![West Playing Dangerous Bloody And Dirty Game Over Ukraine - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/27/putin4.jpg.webp?itok=Y6AnC4u5)
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ డర్టీ బాంబును ప్రయోగించనుందంటూ పదేపదే గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదులు సైతం చేశారు. అందులో భాగంగా ఇప్పుడూ పుతిన్ పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు పుతిన్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌తో మాట్లాడుతూ...ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన డర్టీ గేమ్ ఆడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు వలసవాదంతో కళ్లుమూసుకుపోయి ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ చేత ప్రమాదకరమైన రక్తపాతంతో కూడిన గేమ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని నియంత్రించడంలో భాగంగానే పశ్చిమ దేశాలు ఇలా ప్రవర్తిస్తున్నాయంటూ మండిపడ్డారు. అంతేగాదు చివరికి ఈ విషయమై అమెరికా, దాని మిత్రదేశాలతో రష్యాతో మాట్లాడాల్సి పరిస్థితి ఏర్పడుతుందంటూ హెచ్చరించారు.
(చదవండి: డ్రోన్‌లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు)
Comments
Please login to add a commentAdd a comment