సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1945 ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం.. ఆ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో లక్షా 40 వేలమంది ప్రజలు మరణించగా 90 శాతం నగరం పూర్తిగా ధ్వంసమైంది. భయంకరమైన ఆ విస్ఫోటనాన్ని తట్టుకొని జన్‌బకూ డోమ్ అనే ఒకేఒక్క భవనం మాత్రం నిలిచింది.
70 ఏళ్ల క్రితం అలా నిలిచిన భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది. సమాధి నుంచి పునరుజ్జీవనం పొంది ప్రస్తుతం 12 లక్షల జనాభాతో, ఆకాశ హర్మ్యాలతో అలరారుతూ జపాన్‌లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హిరోషిమా..ప్రస్తుతం అభివృద్ధిలో తనకు తానే సాటి అంటూ దూసుకుపోతోంది. 70 ఏళ్లనాటి ఆ శిథిల జ్ఞాపకాల నుంచి ప్రస్తుతం అభివృద్ధివైపు ఎలా రూపాంతరం చెందిందో చూపే ఫొటోలివి..
'హీరో' షిమా.. నాడు.. నేడు
Published Thu, Aug 6 2015 9:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement