bombing
-
సిన్వర్‌పై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.చర్చలకు విఘాతం! అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు. -
Russia Ukrain war: సొంత గ్రామంపైనే బాంబులు వేసుకున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేయబోయి దేశంలోని సొంత గ్రామంపైనే రష్యా ప్రమాదవశాత్తు బాంబులు వేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ నిర్ధారించింది. మంగళవారం(జనవరి 2) ఉదయం తొమ్మిది గంటలకు రష్యా దక్షిణాన ఉన్న వొరొనెజ్ ప్రాంతంలోని ఓ గ్రామంపై రష్యా సైన్యం బాంబులు వేసింది. అయితే ఈ బాంబు దాడుల్లో ఎవరూ చనిపోలేదు. దాడుల్లో 6 ఇళ్లు మాత్రం దెబ్బతిన్నట్లు రష్యా మీడియా రిపోర్టు చేసింది. ‘బాంబు దాడి ఘటనపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. బాంబు దాడిలో జరిగిన నష్టంపై అంచనాకు ఒక కమిషన్ వేశాం. బాంబు దాడులు జరిగిన ప్రాంతం నుంచి కొంత మందిని వేరే చోటికి తరలించాం’ అని వొరొనెజ్ ప్రాంత గవర్నర్ ఓల్గా స్కబెయెవా తెలిపారు. అంతకు ముందు ఈ దాడిపై గవర్నర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించారు. ఈ దాడులు ఉక్రెయిన్ ఉగ్రవాదుల పనేనని ఆమె తన పోస్టుల్లో పేర్కొంది. అయితే బాంబులు వేసింది రష్యా సైన్యమేనని నిర్ధారణ అయిన తర్వాత ఆమె పోస్టులను తొలగించారు. కొంత కాలం నుంచి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా తాజాగా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అయిదుగురు చనిపోగా 100 మంది దాకా గాయపడ్డారు.ఈ బాంబు దాడుల్లో భాగంగానే రష్యా తన సొంత ప్రాంతంపై తానే బాంబులు వేసుకోవడం గమనార్హం. ఇదీచదవండి..ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ -
Sudan: సూడాన్‌లో కల్లోల పరిస్థితులు.. చిక్కుకుపోయిన మనోళ్లు
ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు. హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్లోని అతిథులంతా బేస్మెంట్లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎవరీ హక్కీ పిక్కీలు ? గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు. ఎందుకీ గొడవ ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్ను గత ఏడాది సైన్యం, ఆర్ఎస్ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది. -
Russia-Ukraine war: రెండు నగరాల ముట్టడి
కీవ్/మాస్కో/ఇస్తాంబుల్: ఉక్రెయిన్‌లో కీలక నగరం మారియుపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ముందుకు సాగుతున్నాయి. జంట నగరాలైన సెవెరోడోన్‌టెస్క్, లిసీచాన్స్క్ను చుట్టుముట్టాయి. ఈ రెండు నగరాలను ఒక నది మాత్రమే వేరు చేస్తుంది. రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించడంతో సెవెరోడోన్‌టెస్క్, లిసీచాన్స్క్ ప్రజలు బెంబేలెత్తిపోయారు. రష్యా దాడిలో నలుగురు మృతి రష్యా క్షిపణి దాడుల్లో నలుగురు పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్హివ్ హైడై చెప్పారు. సీవీరోడోన్టెస్క్ పట్టణంపై జరిగిన దాడుల్లో మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. డోన్‌టెస్క్‌లో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైన్యం దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రకటించారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్‌లో యూలియా పైయీవ్స్కా అనే విద్యార్థిని బాడీ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు సంచలనాత్మకంగా మారాయి. ఆమె 256 గిగాబైట్ల సామర్థ్యం గల వీడియోలో చిత్రీకరించారు. మార్చి 16న ఆమె, ఆమె డ్రైవర్‌ను రష్యా జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. సదరు వీడియోలు అసోసియేట్ ప్రెస్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్ దాడిలో రష్యా పౌరుడు బలి సరిహద్దు వద్ద ఉక్రెయిన్ భూభాగం నుంచి జరిగిన దాడిలో తమ పౌరుడి చనిపోయాడని, మరికొందరు గాయపడ్డారని పశ్చిమ రష్యాలోని కుర్స్క్ గవర్నర్ రోమన్ స్టారోవోయిట్ చెప్పారు. మారియుపోల్‌లో ఉన్న అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి రష్యా దళాల నుంచి విముక్తి పొందిన ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు ఇంటర్నేషన్ రెడ్‌క్రాస్ గురువారం వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీల రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు తెలియజేసింది. అప్పటిదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదు రష్యా దళాలు తమ దేశం నుంచి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పోడోలైక్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాల్పుల విరమణ వినతిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉక్రెయిన్‌లో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సూచించారు. క్షమాపణ కోరిన వాదిమ్ శిషిమారిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలపై విచారణను ఎదుర్కొంటున్న తొలి రష్యా సైనికుడు వాదిమ్ శిషిమారిన్ గురువారం కోర్టుకు హాజరయ్యాడు. తనను క్షమించాలంటూ ఒలెగ్జాండర్ షెలిపోవ్ భార్య కేటరినా షెలిపోవాను కోరాడు. ఉన్నతాధికారుల ఆదేశాల వల్లే ఫిబ్రవరి 28న ఒలెగ్జాండర్ షెలిపోవ్ను తాను కాల్చి చంపాల్సిన వచ్చిందని తెలిపాడు. యుద్ధ నేరాల కేసులో నేరం రుజువైతే శిషిమారిన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడనుంది. పోర్చుగల్ దౌత్యవేత్తల బహిష్కరణ..: రష్యా ప్రభుత్వం పోర్చుగల్ ఎంబసీకి చెందిన ఐదుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. రెండు రోజుల క్రితమే స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ ఎంబసీల నుంచి దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సరుకులపై దిగుమతి సుంకాలు రద్దు ఉక్రెయిన్‌కు మరింత చేయూతనందించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల సరుకులపై దిగుమతి సుంకాలు రద్దుచేసింది. యుద్ధం వల్ల నష్టపోతున్న ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్ డాలర్ల సాయం అందజేస్తామని జపాన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు జపాన్ ఇప్పటికే 300 మిలియన్ డాలర్లు అందజేసింది. స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరొద్దు: టర్కీ నాటో కూటమిలో చేరాలన్న స్వీడన్, ఫిన్లాండ్ ఆకాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయీప్ ఎర్డోగాన్ చెప్పారు. ఆ రెండు దేశాలు ఉగ్రవాదానికి అడ్డాగా మారాయని ఆరోపించారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరాలంటే టర్కీ మద్దతు కీలకం. జార్జి డబ్ల్యూ బుష్ వివరణ ‘ఇరాక్‌పై క్రూరమైన దండయాత్ర సాగించడం అన్యాయం’ అని వ్యాఖ్యానించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తాజాగా వివరణ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై అనబోయి పొరపాటున ఇరాక్ అన్నానని చెప్పారు. 2003లో బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇరాక్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. -
ముట్టడిలో మారియుపోల్.. నగరంలో 20 వేలకు పైగా పౌరుల మృతి?
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా ముట్టడి తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. రేవుపట్టణం మారియుపోల్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా సైన్యం తీవ్రతరం చేసింది. నగరం వీడాల్సిందిగా ఉక్రెయిన్ దళాలకు సోమవారం సూచించింది. ‘‘తెల్ల జెండాలు ఎగరేసి, ఆయుధాలు వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డవాళ్లంతా హ్యుమానిటేరియన్ కారిడార్ల గుండా సురక్షితంగా వెళ్లిపోయేలా చూస్తాం. మరుక్షణమే నగరంలోకి అత్యవసరాల సరఫరాను అనుమతిస్తాం’’ అని కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ చెప్పారు. ఉక్రెయిన్ అందుకు నిరాకరించింది. దాంతో రష్యా దళాలు రెచ్చిపోయాయి. ఎడాపెడా క్షిపణి, బాంబు దాడులతో కనీవినీ ఎరగని రీతిలో నగరంపై విరుచుకుపడుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 20 వేల మంది దాకా మరణించి ఉంటారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి! దీనిపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. రష్యా తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసింది. మారియుపోల్‌లో వేలాదిగా పౌరులను అతి కిరాతకంగా, విచక్షణారహితంగా పొట్టన పెట్టుకుంటున్న తీరు దుర్మార్గమని ఈయూ విదేశీ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విమర్శించారు. ‘‘రష్యా నైతికంగా అధఃపాతాళానికి దిగజారింది. యుద్ధంలోనూ నీతీ నియమాలుంటాయని మర్చిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సాక్ష్యాలను సేకరిస్తోంది. కీవ్... కదనరంగం: రాజధాని కీవ్‌ను ఆక్రమించే ప్రయత్నాలను రష్యా మరింత ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి రష్యా సైన్యం జరిపిన బాంబు దాడుల్లో జనసమ్మర్ధ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్ నేలమట్టమైంది. కనీసం ఎనిమిది మంది చనిపోయినట్టు సమాచారం. రాజధానిని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సమీలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో 50 టన్నుల భారీ ట్యాంక్ నుంచి అమోనియా లీకయింది. దాంతో చుట్టుపక్కల రెండున్నర కిలోమీటర్ల మేర వాతావరణం బాగా కలుషితమైనట్టు సమాచారం. తీవ్ర ప్రయత్నాల తర్వాత లీకేజీని అరికట్టారు. ఇతర నగరాలనూ సుదూరాల నుంచి క్షిపణి దాడులతో రష్యా బెంబేలెత్తిస్తోంది. ఉక్రెయిన్ దళాలు రష్యా సైన్యంపై చాటునుంచి దాడులు చేసి పారిపోతూ గెరిల్లా వ్యూహం అనుసరిస్తున్నాయి. ఆహారం తదితర అత్యవసర సరఫరాలను అడ్డుకుంటున్నాయి. రివెన్ సమీపంలో సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణులతో దాడి చేసి 80 మందికి పైగా ఉక్రెయిన్, కిరాయి సైనికులను చంపేసినట్టు రష్యా చెప్పింది. రేవు పట్టణం ఒడెసాపై దాడులను తీవ్రతరం చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారు. దాంతో రష్యా సేనలు యుద్ధ నౌకల నుంచి పౌరులపైకి కూడా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి. బెనెట్‌కు థాంక్స్: జెలెన్స్కీ చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ స్కూలుపై బాంబు వేసిన పైలట్‌ను హతమార్చి తీరతామన్నారు. చర్చల్లో సానుకూల సంకేతాలు కన్పిస్తున్నాయని బెనెట్ చెప్పారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లను రష్యా స్థానిక కోర్టు నిషేధించింది! మొరాయించిన చెర్నోబిల్ మానిటర్లు ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని రేడియేషన్ మానిటర్లు పని చేయడం లేదు! ఉక్రెయిన్ అణు నియంత్రణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ప్లాంటు సమీపంలోని అడవులను కాపాడేందుకు అవసరమైన సంఖ్యలో అగ్నిప్రమాపక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఫలితంగా రేడియేషన్ లీకేజీని అడ్డుకోవడం కష్టం కావచ్చు’’ అని హెచ్చరించింది. శనివారం పోలండ్‌కు బైడెన్ అత్యవసర చర్చల కోసం ఈ వారాంతంలో యూరప్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ట్రిప్‌లో భాగంగా శనివారం పోలండ్‌లో కూడా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురువారం నాటో నేతలతో శిఖరాగ్ర భేటీలో బైడెన్ పాల్గొంటారు. తర్వాత బ్రసెల్స్ నుంచి పోలండ్ వెళ్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జాన్ సాకీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ చాన్సలర్ షోల్జ్, ఇటలీ, ఇంగ్లండ్ ప్రధానులు మారియో డ్రాగీ, బోరిస్ జాన్సన్‌లతో కూడా సోమవారం బైడెన్ చర్చలు జరిపారు. -
ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే
రష్యా దండయాత్ర ఉక్రెయిన్ను అన్ని విధాలా కుంగదీస్తోంది. 27 రోజులుగా వచ్చిపడుతున్న బాంబుల వర్షంలో దేశం శిథిలాల దిబ్బగా మారిపోయింది. మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు యుద్ధంలో సమిధలుగా మారుతున్నారు. లక్షలాది మంది ఉక్రెయిన్ చిన్నారుల భవిష్యత్తును యుద్ధం అంధకారమయం చేసేసింది... హంగరీ నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. ఏ కొందరో ఎన్జీవోల సాయంతో విదేశాల్లోని తమ బంధువుల ఇళ్లకు చేరుతుండగా మిగతా వారంతా శరణార్థి శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే వినిపిస్తున్నారు. ఎన్జీవోలు, ప్రభుత్వాల సాయంపై ఆధారపడి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి! ఏదోలా యుద్ధం ఆగిపోతే తమ దేశానికి తిరిగి వెళ్తామని వీరంతా ఆశగా ఉన్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కళ్లముందే యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని తలచుకుని వీరంతా ఇప్పటికీ వణికిపోతున్నారు. మారియుపోల్‌లో తమ ఇంటి ముందే బాంబులు పడటంతో పిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని కుటుంబంతో సహా వలస వచ్చినట్టు హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు వచ్చిన డేవిడ్ ‘సాక్షి’కి చెప్పాడు. ‘‘కానీ మా ఇద్దరు పసికందుల భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ఆందోళన ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంది. మెకానిక్‌గా పనిచేసిన నాకు హంగరీలో ఏ పని చేయాలో తెలియడం లేదు. భవిష్యత్తు అంధకారంగా ఉంది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలండ్ ఆపన్నహస్తం రష్యా, బెలారస్ తరువాత ఉక్రెయిన్‌తో ఎక్కువ సరిహద్దు పంచుకునేది పోలండ్. యుద్దం మొదలవుతూనే పోలండ్‌కు భారీగా వలసలు మొదలయ్యాయి. సరిహద్దు నగరం ల్యుబ్లిన్‌తో పాటు రాజధాని వార్సాకు శరణార్థుల తాకిడి భాగా పెరిగింది. ఇప్పటికే 21 లక్షలకు పైగా పోలండ్ చేరుకున్నారు. ఆ దేశం వారిని సాదరంగా అక్కున చేర్చుకుంటోంది. శరణార్థులకు పోలిష్ నేషనల్ ఐడెంటిటీ నంబర్ (పెసెల్) అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి ఆర్నెల్ల పాటు తమ దేశంలో ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సమయంలో వారు ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఉచితంగా వైద్యం అందిస్తారు. పిల్లలకు నెలకు 110 యూరోలు ఇస్తుంది. లక్షన్నరకు పైగా దీనిద్వారా లబ్ధి పొందినట్టు పోలండ్ చెబుతోంది.హంగరీ, రుమేనియా, స్లోవేకియా కూడా శరణార్థుల పట్ల ఉదారంగా వ్యవహిస్తున్నాయి. అయితే శరణార్థులతో పోలండ్ పూర్తిగా నిండిపోతోంది. ఒక్క వార్సాకే 4 లక్షల మంది దాకా వచ్చినట్టు సమాచారం. నగర జనాభాలో ఇది ఐదో వంతు! వీరిని ఎక్కడుంచాలన్నది కూడా సమస్యగా మారింది. ముఖ్యంగా రాత్రిళ్లు మైనస్? డిగ్రీల చలిలో పిల్లలు, మహిళలు అల్లాడుతున్నారు. స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు చాలా ఎన్జీవోలు తమ ఇళ్లను ఉక్రేయినియన్ల కోసం తెరిచిపెట్టాయి. పౌరులు కూడా తోచింది తెచ్చి శిబిరాల్లో ఇస్తున్నారు. విద్యార్థులు, యువకులు సోషల్ మీడియాలో కమ్యూనిటీగా ఏర్పడి సాయం చేస్తున్నారు. భేష్ హంగరీ హంగరీకి కూడా 4 లక్షల దాకా శరణార్ధులు వచ్చారు. గతంలో శరణార్థులను అనుమతించని హంగరీ విధానం మార్చుకుని మరీ ఉక్రేనియన్లకు ఆశ్రయమిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న హంగరీ ప్రధాని విక్టర్ అర్బన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. రాజధాని బుడాపెస్ట్, జహోని, డెబ్రిసెన్ లాంటి నగరాల్లోనూ శరణార్థులు భారీగా ఉన్నారు. ప్రభుత్వం కంటే ఎన్జీవోలే వీరికి ఎక్కువగా సాయం చేస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ల ఔదార్యం శరణార్థులను టాక్సీ డ్రైవర్లు సరిహద్దుల నుంచి పెద్ద నగరాలకు ఉచితంగా చేరేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు! ఎయిర్‌పోర్టులకు, శిబిరాలకు తీసుకెళ్తున్నారు. 8 గంటలు పని చేసుకున్నాక వారికోసం ఉచితంగా ఈ పని చేస్తున్నట్టు చెప్తున్నారు. ఛిన్నాభిన్నమయ్యాం యుద్ధం మొదలవగానే కీవ్ నుంచి పోలండ్ వచ్చా. మా నాన్న, అన్నయ్య అక్కడే ఉండిపోయారు. మా అమ్మను తీసుకువచ్చే ప్రయత్నం చేసినా సరిహద్దు దాకా రాలేకపోయింది. ఆమెను సరిహద్దుల్లో బంధువుల ఊళ్లో వదిలొచ్చా. మా కుటుంబం బాగా గుర్తుకు వస్తోంది. కనీసం వాళ్లతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్నారో, అసలున్నారో లేదో తెలియదు. బాధ మర్చిపోయేందుకు వలంటీర్‌గా నాలాంటివారికి సాయం చేస్తున్నాను. ఈ యుద్ధం చాలా క్రూరమైంది. ఇది చేసిన గాయం ఇప్పట్లో మానదు. – మేరీ, శరణార్థి, వార్సా -
బడిపై రష్యా బాంబుల వర్షం.. 150 మంది సేఫ్.. మిగతావారి పరిస్థితి!
మాస్కో: ఉక్రెయిన్‌లో విధ్వంసమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా నానాటికీ విచక్షణారహితంగా వ్యవహరిస్తోంది. రేవు పట్టణం మారియుపోల్‌లో కనీసం 400 మంది తలదాచుకున్న ఓ ఆర్ట్ స్కూల్‌పై ఆదివారం బాంబుల వర్షం కురిపించింది. దాడిలో స్కూలు నేలమట్టమైంది. అందులోంచి 150 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మిగతా వారంతా శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్ మీద బుధవారం రష్యా బాంబులు వేయడం తెలిసిందే. మరోవైపు రష్యా సైన్యం వరుసగా రెండో రోజూ ఉక్రెయిన్‌పైకి కింజల్ హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించింది. రేవు పట్టణం మైకోలేవ్ సమీపంలో ఇంధన డిపోను కింజల్ మిసైల్ ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. యుద్ధ నౌకల పై నుంచి కాలిబర్ క్రూయిజ్ మిసైళ్ల ప్రయోగం ద్వారా చెహిర్నివ్ సమీపంలోని నిజిన్ వద్ద ఆయుధ మరమ్మతు ప్లాంటును కూడా నేలమట్టం చేసినట్టు చెప్పారు. ఉత్తరాన ఓవ్రుచ్లోని ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు, విదేశీ కిరాయి సైనికుల స్థావరంపైనా భారీగా మిసైళ్ల వర్షం కురిపించామన్నారు. మారియుపోల్‌లోకి రష్యా సైన్యాలు మరింతగా చొచ్చుకెళ్లి అన్నివైపుల నుంచీ చుట్టుముట్టాయి. ఆహారం, తాగునీరు తదితర సరఫరాలు పూర్తిగా ఆగిపోయి పౌరులు నరకయాతన పడుతున్నారు. నగరంలో ఇప్పటికే కనీసం 3000 మందికి పైగా అమాయకులు కాల్పులకు బలయ్యారని సమాచారం. దాడిలో నగరం సర్వనాశనమైందని, రూపురేఖలు సైతం కోల్పోయిందని సమాచారం. ఖర్కీవ్‌లోనూ భారీ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని సమాచారం. 10 మానవీయ కారిడార్ల గుండా వేలాది మంది వలస బాటపట్టారు. యుద్ధంలో ఇప్పటిదాకా 15 వేలకు పైగా సైనికులను, 1,500కు పైగా యుద్ధ ట్యాంకులతో పాటు ట్రక్కులు, భారీ సాయుధ వాహనాలను రష్యా నష్టపోయిందని అంచనా. మరోవైపు, రష్యాతో లింకులున్నాయంటూ 11 పార్టీలపై జెలెన్స్కీ నిషేధం విధించారు. ఉక్రెయిన్ తన గగన తలాన్ని సమర్థంగా రక్షించుకుంటోందని ఇంగ్లండ్ అభిప్రాయపడింది. గగనతలంపై రష్యా ఇప్పటిదాకా ఆధిక్యం సాధించలేకపోయిందని చెప్పింది. తమవారి చేతుల్లో మరణించిన సైనికుల మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం కూడా రష్యా చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. పలుచోట్ల రష్యా దాడిని ఆరేడుసార్లు తిప్పికొట్టామన్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా వశపరచుకుని నియంత్రించాలంటే రష్యాకు కనీసం 8 లక్షల సైన్యం కావాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రష్యా తన సైన్యమంతటినీ ఉక్రెయిన్‌లోనే నియోగించాల్సి వస్తుంది. -
ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత మోగిస్తోంది. రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై రష్యా సైన్యం దాడులు సోమవారం మరింత పదునెక్కాయి. కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా దళాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. నగరాన్ని, శివార్లను లక్ష్యం చేసుకుని క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దాంతో ఇర్పిన్, బుచా, హోస్టొమెల్ వంటి శివారు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. దాడుల్లో నగరంలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కూలిపోగా ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాలు తయారు చేసే కీవ్‌లోని ఆంటొనోవ్ ఫ్యాక్టరీ దెబ్బ తిన్నది. ప్లాంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మారియుపోల్, మైకోలెయివ్, ఖర్కీవ్ సహా పలు నగరాలు దాడుల ధాటికి అల్లాడుతున్నాయి. మైకోలెయివ్, ఖర్కీవ్‌ల్లో రష్యా వైమానిక దాడుల్లో పలు నివాస భవనాలు, రివైన్ ప్రాంతంలో ఓ టీవీ టవర్ నేలమట్టమయ్యాయి. పౌర మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్క మారియుపోల్‌లోనే కనీసం 2,500 మందికి పైగా యుద్ధానికి బలైనట్టు నెక్స్టా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వలసలు 28 లక్షలు దాటాయని ఐరాస పేర్కొంది. సంక్షోభంపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్, చైనా విదేశాంగ శాఖ సలహాదారు యాంగ్ జీచీ రోమ్‌లో చర్చలు జరిపారు. మా అంచనాలు తప్పుతున్నాయి: రష్యా యుద్ధం తాము ఆశించినట్టుగా సాగడం లేదని రష్యా తొలిసారి అంగీకరించింది. తమ సేనలు అనుకున్న దానికంటే నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని రష్యా నేషనల్ గార్డ్స్ చీఫ్ విక్టర్ జొలొటోవ్ అన్నారు. మరోవైపు రష్యా జీఆర్యూ మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారి కెప్టెన్ అలెక్సీ గుల్చక్ సోమవారం మారియుపోల్‌లో దాడుల్లో మరణించారు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనికాధికారుల సంఖ్య 12కు చేరింది. ఎటూ తేల్చని నాలుగో రౌండ్ చర్చలు భీకర దాడుల మధ్యే సోమవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం నాలుగో రౌండ్ చర్చలు జరిగాయి. గంటల తరబడి జరిగిన చర్చలు చెప్పుకోదగ్గ ఫలితమేదీ లేకుండానే ముగిశాయి. ముట్టడిలో ఉన్న నగరాలకు సాయం అందించడం తదితరాలకే చర్చలు పరిమితమైనట్టు సమాచారం. చర్చలు మంగళవారం కొనసాగనున్నాయి. శాంతి, కాల్పుల విరమణ, తక్షణం సైన్యాల ఉపసంహరణ, భద్రత హామీలను తమ ప్రధాన డిమాండ్లుగా ఉంచినట్టు ఉక్రెయిన్ చెప్పింది. చైనా సైనిక సాయం కోరిన రష్యా! ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు మిత్రదేశం చైనాను రష్యా సైనిక సాయం అర్థిస్తోందని అమెరికా సీనియర్ అధికారి ఒకరన్నారు. ఆయుధాలు, సైనిక సామాగ్రి కోరుతోందని వెల్లడించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల భయంతో చైనా ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. ఇది తప్పుడు ప్రచారమని, చైనాతో పాటు రష్యా కూడా ఖండించింది. ఆహార విపత్తును ఎదుర్కొంటాం: ఐరాస చూçస్తుండగానే ఉక్రెయిన్ శ్మశానంగా మారిపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. అణు యుద్ధ ప్రమాదం వెన్నులో చలి పుట్టిస్తోందన్నారు. ప్రపంచ ఆహార భద్రతపైనా యుద్ధం పెను ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆహార, ఇంధన విపత్తు స్పందన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 30 వేల సైన్యంతో నాటో విన్యాసాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా నానాటికీ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో భారీ బల ప్రదర్శనకు దిగింది. యూరప్, ఉత్తర అమెరికా నుంచి 25కు పైగా సభ్య దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు, 50కి పైగా యుద్ధ నౌకలతో ఉత్తర నార్వేలో సోమవారం భారీ కవాతు జరిపింది. ఇది యుద్ధానికి చాలా ముందే ఖరారైన షెడ్యూల్ అని, రష్యాకూ వీటిపై సమాచారముందని నార్వే చెప్పింది. రెండేళ్లకోసారి జరిగే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న ముగియాలి. ప్రత్యక్ష చర్చలు జరపాలి: భారత్ యుద్ధం ఆగాలని ఐరాసలో భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర ఆకాంక్షించారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆయన సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌తో తాము సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను అన్ని దేశాలు గౌరవించాలని సూచించారు. నిండు చూలాలు దుర్మరణం రష్యా దాడికి ఓ నిండు చూలాలు బలైన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మారియుపోల్‌లో ఓ ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. అంబులెన్సుతో తరలిస్తుండగా నొప్పితో అల్లాడుతున్న వీడియో వైరలైంది. హుటాహుటిన మరో ఆస్పత్రికి తరలించి సిజేరియన్ చేసినా లాభం లేకపోయింది. పాప దక్కదని అర్థమయ్యాక ‘నన్ను చంపేయండి’ అంటూ ఆమె రోదించిన తీరు డాక్టర్లను కూడా కలచివేసింది. నాతో ఫైటింగ్‌కు రా పుతిన్‌కు ఎలాన్ మస్క్ చాలెంజ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధానికి రావాలని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాలు చేశారు. ఉక్రెయిన్ను పందెంగా ఒడ్డాలంటూ ట్వీట్ చేశారు. పుతిన్‌కు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లేకపోవడంతో, తన సవాలుకు రష్యా అధ్యక్షుని అధికారిక అకౌంట్ ద్వారా స్పందించాలని సూచించారు. ‘‘నాతో ఫైటింగ్‌కు ఒప్పుకుంటారా?’’ అని పుతిన్‌ను ప్రశ్నించారు. అందులో పుతిన్, ఉక్రెయిన్ పేర్లను రష్యన్లో రాశారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్ సేవలకు దూరమైన ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని మస్క్ అందజేయడం తెలిసిందే. -
ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది. రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది. దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది! ముప్పేట దాడిలో నగరాలు మరోవైపు ఖర్కీవ్, చెర్నిహివ్తో పాటు కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను కూడా రష్యా సైన్యం పూర్తిగా చుట్టుముట్టి ముప్పేట దాడులు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. కీవ్ పరిసరాల్లో కందకాలు తవ్వి, నానా వస్తువులతో రోడ్లను బ్లాక్ చేసి రష్యా సేనలను నిలువరిస్తున్నారు. అయినా నగరంపైకి రష్యా క్షిపణులు, బాంబులు నిరంతరం వచ్చి పడుతూనే ఉన్నాయి. పరిసర ప్రాంతాలు, గ్రామాలపై కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా భారీ దాడి జరగవచ్చనే భయాల మధ్య జనం భారీగా రాజధాని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే కీవ్ ముట్టడి కోసం కొద్ది రోజుల క్రితం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన రష్యా పటాలం ఇప్పటికీ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉందని సమాచారం. ఆదివారం మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై దాడికి దిగాలని పౌరులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారిపై వీధి పోరాటాలకు దిగాలని సూచించారు. భారీగా సైన్యాలు దూసుకొస్తున్నా ప్రజలు ఉక్రెయిన్ సైనికులతో కలిసి వారిని ఎదుర్కొంటున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నారు. స్టార్‌లింక్ సిస్టమ్ ద్వారా తమ దేశానికి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ రష్యా దుర్మార్గాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు తోడ్పడుతున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ...అప్పటిదాకా పోరే: పుతిన్ ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగి తీరుతుందన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆదివారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ పుతిన్‌తో గంటకు పైగా జరిగిన ఫోన్ చర్చల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలపైనా పుతిన్ మరోసారి మండిపడ్డారు. అవి తమపై యుద్ధం ప్రకటించడమేనన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ ఆకస్మికంగా రష్యా వెళ్లి పుతిన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత జెలెన్స్కీతో కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అమెరికా ఫైటర్ జెట్లు? ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలతో పాటు సహాయ సామగ్రి దాకా భారీగా అందుతోంది. తమకు ఫైటర్ జెట్లు అందజేయాలన్న జెలెన్స్కీ విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తోంది. ఈ విషయమై పోలండ్‌తో మాట్లాడుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో మరో అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఆక్రమించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపించారు. వెంటనే ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస బెర్లిన్: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని 15 లక్షల మంది వలస వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వలసల సంక్షోభం ఇదేనని తెలిపింది. మీడియాపై రష్యా ఉక్కుపాదం మాస్కో: ఉక్రెయిన్‌పై దాడితో సొంత దేశంలో వెల్లువెత్తుతున్న నిరసన గళాల్ని రష్యాలో పుతిన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తోంది. ఆదివారం పలు స్వతంత్ర ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్లను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మూత పడేలా చేసింది. అలాంటి సంస్థల్లో అమెరికా నిధులతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్ కూడా ఉంది. బెలారస్ ఉప రక్షణ మంత్రి రాజీనామా కీవ్: బెలారస్ ఉప రక్షణ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణలో పాలుపంచుకోవడం ఇష్టంలేక పదవిని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాను రక్షణమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. రష్యా బలగాలను తమ సరిహద్దుల్లో మోహరించడానికి అనుమతించినవారిలో గులేవిచ్ కూడా ఉన్నారు. ఆయనపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. -
ఉగ్రవాదిని పట్టించి హీరో అయ్యాడు
న్యూయార్క్: అమెరికాలో ఓ సిక్కు పౌరుడు హీరో అయ్యాడు. అక్కడి పోలీసులతోనే కాకుండా సాధారణ పౌరులతో కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ, అతడు మాత్రం తాను ఇందులో పెద్దగా చేసిందేమీ లేదని.. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా చేయాల్సిన పనినే తాను చేశానని అంటున్నాడు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ వారాంతపు రోజుల్లో భారీ పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు కారణమైన అనుమానిత 28 ఏళ్ల అప్గన్ సంతతి అమెరికా ఉగ్రవాదిని హరిందర్ బెయిన్స్ అనే ఓ సిక్కు పౌరుడు గుర్తించాడు. ఈయన లిండన్ లో ఓ బార్ షాపు యజమాని. న్యూయార్క్, న్యూజెర్సీలో వారాంతపు రోజుల్లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులకు కారణమైన వ్యక్తికోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడికి కారణమైన అహ్మద్ ఖాన్ రహామీ అనే ఉగ్రవాది తన ముందు నుంచి వెళుతుండటం హరిందర్ బెయిన్స్ గుర్తించాడు. వేరే వీధిలో పనిలో ఉన్న అతడు తన ల్యాప్ టాప్ లో వార్తలు చూస్తూ అతడిని గుర్తించాడు. తొలుత తన ముందు నుంచి వెళుతున్న అహ్మద్ ను చూసి తాగేందుకు వచ్చిన యువకుడు అనుకున్నాడు. అనంతరం వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రాగా ఆ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయినా చివరకు అతడిపై మరిన్ని కాల్పులు జరిపి పట్టుకోగలిగారు. -
రంజాన్ షాపింగ్ లో బాంబుపేలుడు..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో శుక్రవారం బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ బాంబు పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికిగా పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్వెట్టా సిటీలో రోడ్డు పక్కన పార్క్ చేసిన మోటార్ బైక్ లో అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలడంతో రంజాన్ షాపింగ్ లో ఉన్న ప్రజలు పరుగులు తీశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఏరియాలో షాపింగ్ సందడి నెలకొంటుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ, తాలిబన్లు, బలోచ్ మిలిటెంట్ల కదలికలు ఈ ఏరియాలో చురుగ్గా ఉంటాయి. దీంతో ఇది మిలిటెంట్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
పొరపాటున బాంబు వేశాం: ఫ్రెంచ్ ప్రధాని
ఇరవై ఐదేళ్ళ తర్వాత ఫ్రాన్స్, న్యూజిల్యాండ్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్ న్యూజిల్యాండ్ లో పర్యటించడం అందుకు పెద్ద నిదర్శనంగా చెప్పాలి. అక్కడకు వెళ్ళడమేకాక, ఫ్రాన్స్ 31 ఏళ్ళ క్రితం న్యూజిల్యాండ్ పై జరిపిన దాడి పెను తప్పిదమంటూ వాల్స్ విశ్లేషించడం ఇరు దేశాలమధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గ్రీన్ పీస్ పై 31 ఏళ్ళ క్రితం జరిపిన బాంబు దాడి పెను తప్పిదమేనన్నారు ఫ్రెంచ్ ప్రధాని మాన్యుయెల్ వాల్స్. 25 సంవత్సరాల అనంతరం మొదటిసారి ఫ్రెంచ్ ప్రధాని న్యూజిల్యాండ్ ను సందర్శించారు. ఈ సందర్శన ఫ్రెంచ్, న్యూజిల్యాండ్‌ల మధ్య మైత్రిని పెంపొందించే అవకాశం ఉన్నట్లు జిన్హువా వార్తా సంస్థ అభిప్రాయపడింది. 1985 జూలైలో ఫ్రెంచ్ గూఢచారులు... ఆక్లాండ్ ప్రధాన పట్టణం పై.. రెండు భారీ మైన్లతో దాడికి పాల్పడ్డాయి. ఫసిఫిక్ లో ఫ్రాన్స్ జరుపుతున్న అణ్వస్త్ర పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ప్రచారం కొనసాగిస్తున్నసమయంలో రైన్బో వారియర్ నౌక.. బాంబుదాడితో నిమిషాల్లో నీటిలో మునిగిపోయింది. అనంతరం దాడిలో పాల్గొన్న ఇద్దరు ప్రెంచ్ సీక్రెట్ ఏజెంట్లను న్యూజిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 సంవత్సరాలక్రితం మా సంబంధం పెద్ద పవాలుగా ఉండేదని, అప్పట్లో జరిగిన బాంబు దాడి తప్పిదమేనని, దాడితో చెరిగిపోయిన ఇరుదేశాల మధ్య బంధం... తిరిగి చిగురించాలని కోరుకుంటున్నట్లు ఫ్రాన్స్ ప్రధాని వెల్లడించారు. జరిగిన తప్పిదాలను గుర్తుంచుకొని, అటువంటివి మరెప్పుడూ జరగకుండా చూసుకుంటూ...ఇరు దేశాలు కలసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని వాల్స్ ఆకాంక్షించారు. మరోవైపు.. బాంబు దాడి ఘోరమైన తప్పిదంగా ఫ్రాన్స్ అంగీకరించడం మంచి పరిణామమని న్యూజిల్యాండ్ ప్రధాని జాన్ కీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆక్లాండ్ లో వాల్స్ తో చర్చలు జరిపిన అనంతరం న్యూజిల్యాండ్ నష్టాన్ని, బాధను ఫ్రాన్స్ అర్థం చేసుకొందని అటువంటి సమస్యలు తిరిగి తెచ్చే అవకాశం లేదని తాను నమ్ముతున్నట్లు జాన్ కీ తెలిపారు. ఫ్రాన్స్ తన చర్యలను పెద్ద లోపంగా భావించిందని, ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రధాని రాక ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుందని న్యూజిల్యాండ్ ప్రధాని కీ అభిప్రాయపడ్డారు. -
పాకిస్తాన్లో ఆత్మహుతిదాడి
-
ఆత్మాహుతి దాడి.. 26మంది మృతి
డెమాస్కస్: యుద్ధ వాతావరణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయారు. వారు ఆత్మాహుతి దాడి జరపడంతో 26మంది ప్రాణాలు కోల్పోయారు. 70మంది గాయాలపాలయ్యారు. ఓ పాఠశాలకు సమీపంలో దాడులు జరపడంతో చనిపోయినవారిలో ఎక్కువమంది పాఠశాల విద్యార్థులు మహిళలు ఉన్నారు. ఖాష్మాన్ అనే ప్రాంతంలో ఓ వాహనం నిండా బాంబులు వేసుకొని వచ్చిన ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చుకున్నాడు. దీంతో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. మరోచోట వాటర్ ట్యాంక్‌లో బాంబులతో వచ్చిన సాయుధుడు తొలుత కాల్పులు జరిపి తదనంతరం తనను తాను పేల్చేసుకున్నాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దురాఘతానికి పాల్పడినట్లు బలగాలు భావిస్తున్నాయి. -
'హీరో' షిమా.. నాడు.. నేడు
సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1945 ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం.. ఆ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో లక్షా 40 వేలమంది ప్రజలు మరణించగా 90 శాతం నగరం పూర్తిగా ధ్వంసమైంది. భయంకరమైన ఆ విస్ఫోటనాన్ని తట్టుకొని జన్‌బకూ డోమ్ అనే ఒకేఒక్క భవనం మాత్రం నిలిచింది. 70 ఏళ్ల క్రితం అలా నిలిచిన భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది. సమాధి నుంచి పునరుజ్జీవనం పొంది ప్రస్తుతం 12 లక్షల జనాభాతో, ఆకాశ హర్మ్యాలతో అలరారుతూ జపాన్‌లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హిరోషిమా..ప్రస్తుతం అభివృద్ధిలో తనకు తానే సాటి అంటూ దూసుకుపోతోంది. 70 ఏళ్లనాటి ఆ శిథిల జ్ఞాపకాల నుంచి ప్రస్తుతం అభివృద్ధివైపు ఎలా రూపాంతరం చెందిందో చూపే ఫొటోలివి.. -
బాంబు పేలుడు: 12 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ గజినీ ప్రావెన్స్లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12 మంది మరణించారు. మృతులలో మహిళలు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రహదారి పక్కనే వాహనంలో అమర్చిన బాంబు పేలిందని వెల్లడించారు. బాంబు పేలుడు సంభవించిన గజనీ ప్రాంతం తాలిబాన్ల ప్రాబల్యం అధికంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
60 గ్రామాలపై బాంబు దాడులు
జమ్మూ: సరిహద్దులో పొరుగు దేశం ఆగడాలు శ్రుతిమించాయి. పాకిస్తాన్ సైన్యం భారత్ విమర్శలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టి మంగళవారం కూడా జమ్మూకశ్మీర్ సరిహద్దులపై భారీ దాడులకు పాల్పడింది. కతువా, సాంబా జిల్లాల్లోని 60కిపైగా గ్రామాలు, చెక్‌పోస్ట్‌లపై బాంబుదాడులు, కాల్పులకు తెగ బడింది. సోమవారం రాత్రి 11 గంటలవరకు సాగిన కాల్పులు మంగళవారం వేకువ జామున మళ్లీ మొదలయ్యాయని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ తెలిపారు. మోర్టారు బాంబులు భారత భూభాగంలోకి 4కి.మీ దూరం వరకు వచ్చిపడ్డాయన్నారు. షెర్పూర్, చక్రా, లచిపూర్, లోడి గ్రామాలపై వీటితో దాడి చేశారని అన్నారు. పాక్ దాడులకు బీఎస్ఎఫ్ జవాన్లు దీటుగా బదులిచ్చారని, ఉదయం ఏడు గంటలవరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు సాగాయని చెప్పారు. సరిహద్దులో శాంతి కోరుకుంటున్నామని, సహనం నశిస్తే గట్టిగా బదులిస్తామని బీఎస్ఎఫ్ డెరైక్టర్ డీకే పాఠక్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తమ నిరసనను ఆ దేశం పట్టించుకోలేదని, దీంతో ఇరు పక్షాల మధ్య సమాచారం మాధ్యమం దెబ్బతిందన్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
కదిరి : ఎన్పీ కుంట మండలం ఎగువపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన బాంబు దాడి అంతా నాటకమని పోలీసులు తేల్చేశారు. దీంతో తన ఇంటిపై వైఎస్సార్సీపీ నాయకులు బాంబు దాడి చేశారని ఆరోపించిన టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి... ఇప్పుడు పోలీసులకు ఫిర్యా దు చేయడానికి కూడా జంకుతున్నాడు. ‘మా గ్రామానికే చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి, రామసుబ్బారెడ్డి, గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డిలు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి నన్ను వెంటాడారు. ఇది తెలిసి నేను బయటకు రాకుండా ఇం ట్లోనే దాక్కున్నాను. ఒరేయ్..నువ్వు బయటకు రాకపోతే నిన్ను ఇంట్లోనే బాంబులు వేసి చంపుతామని బయటనుంచి గట్టిగా అరిచారు. అర్ధరాత్రి సమయంలో మేమంతా నిద్రపోతుంటే మా ఇంటిపై వారు నలుగురు బాంబులు వేసి నన్ను చంపాలని చూశారు. అదిగో గోడపై బాంబులు పడిన ఆనవాళ్లు’ అంటూ ఈ నెల 2 న పోలీసులకు కట్టుకథ చెప్పిన టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి... ఒక్కసారిగా ఇప్పుడు తోక ముడిచాడు. తాను చేసిందంతా నాటకమని పోలీసులకు తెలిసిపోయిందని గ్ర హించి, తాను ఆరోపణలు చేసిన వారినే ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. బాంబు దాడిపై కదిరి డీఎస్పీ దేవదానం, రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎన్పీ కుంట ఎస్ఐ వెంకటేశ్వర్లు సమగ్ర దర్యాప్తు చేసి అంతా నాటకమని తేల్చారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఇంటెలిజెన్స్ డీఎస్పీ కోలార్ కృష్ణ నేతృత్వంలో పోలీస్ నిఘా బృందాన్ని పంపి నివేదిక తెప్పించుకున్నారు. రాజకీయంగా తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయించి వారిని జైళ్లో పెట్టించాలనేది ఆయన భావనగా ఆ బృందం తమ నివేదికలో ఎస్పీకి సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకుమునుపు కూడా ఆయన వారిపై తప్పుడు కేసు పెట్టి పోలీసులనే మోసగించారని ఆ బృం దం తన నివేదికలో గుర్తు చేసినట్లు తెలిసింది. ఆయన ఇంటి గోడపైన, వసారాలోనూ డిటోనేటర్లు పేలిన గుర్తులను తెలియజేసే ఫొటోలను సైతం ఆ బృందం ఎస్పీకి సమర్పించింది. గతంలో తాను ఇచ్చిన కేసును లోక్ఆదాలత్ ద్వారా రాజీ చేసుకుంటానని, ఇప్పుడు బాంబు కేసులో రాజీకి రావాలని ఆ నలుగురి చెంతకు కొందరు టీడీపీ నాయకులను పంపారు. ఇది తెలిసిన పోలీసులు సంఘటనను ఎన్పీకుంట పోలీస్ స్టేషన్లో జీడీ(జనరల్ డైరీ)లో నమోదు చేసి అంతటితో ఆగిపోయారు. ఒకవేళ ఆయన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని తప్పుడు కేసని దర్యాప్తులో తేలితే అతనిపైనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్‌లో కూడా ఆయన చేసే ప్రతి ఫిర్యాదును అనుమానించాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
చనిపోయిన తల్లికి పుట్టిన మృత్యుంజయురాలు
ఆకాశం నుంచి పడిన ఓ ఇజ్రాయిలీ బాంబు తల్లిని కడతేర్చింది. మరి కొన్ని బాంబులు ఆమె ఇంటిని తునాతునకలు చేశాయి. ధ్వంసమైన ఇంటి భగ్నశకలాల మధ్య పడున్న ఆ తల్లి కడుపులో ఓ బిడ్డ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. బలహీనంగానైనా ఊపిరి తీసుకుంటూ 'బతుకుతాను' అంటోంది. ఇజ్రాయిల్ పాలెస్తీనియన్ల భీకర పోరులో, బాంబుల వర్షం, బారు ఫిరంగుల మోతలో శవమైన తల్లి కడుపులో ఉన్న ఆ బిడ్డను బయటకు తీసేందుకు డాక్టర్లు గడియారం ముల్లుతో పోటీ పడుతూ ప్రయత్నించారు. మామూలుగా తల్లి చనిపోయిన అయిదు నిమిషాలకే కడుపులో బిడ్డ కూడా చనిపోతుంది. కానీ షర్నా అనే 23 ఏళ్ల ఆ తల్లి గాజా లోని డేర్ అల్ బలాహ్ ఆస్పత్రికి రావడానికి ముందే చనిపోయింది. అప్పటికే పదినిముషాలైంది. అయినా డాక్టర్లు ఆశ వదల్లేదు. సిజేరియన్ చేసి మరీ పాపను బయటకి తీశారు. పాప ఊపిరి తీసుకుంటోంది. గుండె బలహీనంగానైనా కొట్టుకుంటోంది. "నిజంగా ఇదొక అద్భుతం. ఇప్పటికీ ఆ పాప బతుకుతుందా అన్నది చెప్పలేం. ఛాన్సులు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి" అన్నారు ఆమెను బయటకు తీసిన డాక్టర్ ఫాదీ అల్ ఖ్రోటే. "ఆ పాప బతుకుతుందనే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ పాప పాలెస్తీనియన్. పాలెస్తీనియన్లది నిత్యం బతుకు పోరాటమే" అన్నారాయన. చావు మధ్య చావు నుంచి పుట్టిన ఆ పాప చిరంజీవి కాకపోతే ఇంకెవరు చిరంజీవి అవుతారు? -
నీతిమాలిన రాజకీయాలను సహించం
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి సురేష్ కుటుంబసభ్యులకు పరామర్శ కోడూరు, న్యూస్‌లైన్ : అధికారం చేతికొచ్చిందని నీతిమాలిన రాజకీయాలకు పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. మండలంలోని వి.కొత్తపాలెంలో టీడీపీ నాయకులు జరిపిన బాంబు దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ మృతిచెందిన విషయం విదితమే. సురేష్ కుటుంబసభ్యులను పార్థసారథి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడి, హత్యా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడినా, అక్రమ కేసులు బనాయించి వేధించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే విజయోత్సవాలు చేసుకోవచ్చని, ఇతర పార్టీ నాయకులపై దాడులకు తెగబడి హత్య చేయడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నాయకులు విజయోత్సవాల పేరుతో దివిసీమలో చాలా ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు తమ వైఖరి మార్చు కోవాలని హితవుపలికారు. కుటుంబానికి అండగా ఉంటాం సురేష్ కుటుంబానికి అండగా ఉంటామని సారథి, రమేష్ హామీ ఇచ్చారు. సురేష్ తండ్రి బసవకుటుంబరావును అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అవనిగడ్డ, వి.కొత్తపాలెం సర్పంచులు నలంకుర్తి పృథ్వీరాజ్, యలవర్తి నాంచారయ్య, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గుడివాక శివరావు, కడవకొల్లు నరసింహారావు, పార్టీ మండల కన్వీనర్ పరిశె మాధవరావు, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మణిక్యాలరావు, మిల్క్సొసైటీ అధ్యక్షుడు రేపల్లి చంద్రశేఖర్, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్లు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వి.కొత్తపాలెంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలీసు పికెట్లు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి.వి.సత్యనారాయణమూర్తి తెలి పారు. రేపల్లె సురేష్ హత్య కేసులో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారని, వారి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. -
ఢిల్లీపై దాడికి అఖ్తర్ కుట్ర
న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుడు తెహసీన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ, అనుచరుల సాయంతో దేశరాజధానిపై బాంబుదాడులకు యత్నించాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు శుక్రవారం తెలిపారు. దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడ్డ వారిలో ఒకడైన ఇతని నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి రిమాండ్ విధించాలని కోరుతూ ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. స్థానికకోర్టు మోనూకు ఇది వరకే ఏప్రిల్ రెండు వరకు పోలీసు కస్టడీ విధించింది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లా సమీపంలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఇతణ్ని ఈ నెల 25న అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోనూ దాడులకు పాల్పడ్డాడని స్పెషల్‌సెల్ పోలీ సులు పేర్కొన్నారు. ఢిల్లీపై దాడులకు యత్నిస్తున్న సమయంలోనే తమకు చిక్కాడని ప్రకటించారు. ఈ కేసు లో మరిన్ని వివరాల సేకరణ, ఇతర నింది తుల అరెస్టు కోసం మోనూను చాలా నగరాల్లో తిప్పాల్సి ఉంద ని తెలిపారు. పేలుళ్ల కుట్రలను ఛేదిం చాలని ఇతణ్ని క్షుణ్నంగా విచారించాల్సి ఉంటుందని వివరించిం ది. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో మతసామరస్యాన్ని నిర్మూలించేందు కు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ జాతీ యుడు జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్, మోనూ ఒకేచోట ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలియజేసింది. -
రక్తమోడిన ఇరాక్: 45 మంది మృతి
ఇరాక్ దేశం ఆదివారం బాంబుల మోత, తుపాకుల గుళ్ల వర్షంతో రక్తమోడింది. దాంతో పలు ప్రాంతాల్లో దాదాపు 45 మంది మృతి చెందారు. మరో 113 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇరాక్ దేశంలో హింస పెచ్చురిల్లింది. దీంతో బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పులు నిత్యకృత్యమైనాయి. ఈ మేరకు స్థానిక వార్తా పత్రిక సోమవారం తెలిపింది. -
డెమాస్కస్ శివార్లలో సిరియన్ దళాల బాంబుదాడులు
సిరియాలో రసాయన దాడులు జరిగిన ప్రాంతంలో అధ్యక్షుడు బషర్ అసద్‌కు చెందిన బలగాలు సైనిక దాడి చేశాయి. తిరుగుబాటుదారులు దాక్కుని ఉన్నట్లు భావిస్తున్న శివారు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించాయి. తూర్పు ఘౌటా ప్రాంతంలో తాము రసాయన ఆయుధాలు ఉపయోగించామన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. రసాయన ఆయుధాలు పడిన ప్రాంతాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే సిరియాలో ఉన్న ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడకు అనుమతించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు డిమాండు చేశాయి. సిరియన్ విపక్ష నాయకులు, అక్కడి ఉద్యమకారులు మాత్రం... బుధవారం నాటి రసాయన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 136 నుంచి 1300కు పెరిగిందని ఆరోపిస్తున్నారు. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో.. ఇప్పటివరకు అత్యంత దారుణమైన రసాయన దాడి ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఇక గురువారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో ఎంతమంది మరణించారన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియట్లేదు. సిరియన్ యుద్ధ విమానాలు పలుమార్లు తూర్పు, పశ్చిమ డెమాస్కస్ శివార్లపై వైమానిక దాడులు చేశాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు ఈ దాడులు జరిగాయి. బుధవారం నాటి రసాయన దాడిలో వందలాది మంది పిల్లలు కూడా మరణించారు. తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఉన్న వారి మృతదేహాలు చూసేందుకు కూడా దారుణంగా ఉన్నాయి. పౌరులు.. ముఖ్యంగా పిల్లలపై కూడా దాడులకు తెగబడటం చాలా దారుణమని, అత్యంత హేయమని యూనిసెఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలను తప్పనిసరిగా రక్షించాలని, వాళ్లను కాపాడలేనివారిని ఈ దాడులకు బాధ్యులుగా చేయాలని చెప్పింది.