ఇరాక్ దేశం ఆదివారం బాంబుల మోత, తుపాకుల గుళ్ల వర్షంతో రక్తమోడింది. దాంతో పలు ప్రాంతాల్లో దాదాపు 45 మంది మృతి చెందారు. మరో 113 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. వారిలో కిందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇరాక్ దేశంలో హింస పెచ్చురిల్లింది. దీంతో బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పులు నిత్యకృత్యమైనాయి. ఈ మేరకు స్థానిక వార్తా పత్రిక సోమవారం తెలిపింది.