ఢిల్లీపై దాడికి అఖ్తర్ కుట్ర | akhtar conspiracy to attack on | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై దాడికి అఖ్తర్ కుట్ర

Published Fri, Mar 28 2014 10:28 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

akhtar conspiracy to attack on

న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుడు తెహసీన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ, అనుచరుల సాయంతో దేశరాజధానిపై బాంబుదాడులకు యత్నించాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు శుక్రవారం తెలిపారు. దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడ్డ వారిలో ఒకడైన ఇతని నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి రిమాండ్ విధించాలని కోరుతూ ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
 
స్థానికకోర్టు మోనూకు ఇది వరకే ఏప్రిల్ రెండు వరకు పోలీసు కస్టడీ విధించింది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లా సమీపంలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఇతణ్ని ఈ నెల 25న అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోనూ దాడులకు పాల్పడ్డాడని స్పెషల్‌సెల్ పోలీ సులు పేర్కొన్నారు. ఢిల్లీపై దాడులకు యత్నిస్తున్న సమయంలోనే తమకు చిక్కాడని ప్రకటించారు.
 
ఈ కేసు లో మరిన్ని వివరాల సేకరణ, ఇతర నింది తుల అరెస్టు కోసం మోనూను చాలా నగరాల్లో తిప్పాల్సి ఉంద ని తెలిపారు. పేలుళ్ల కుట్రలను ఛేదిం చాలని ఇతణ్ని క్షుణ్నంగా విచారించాల్సి ఉంటుందని వివరించిం ది. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో మతసామరస్యాన్ని నిర్మూలించేందు కు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ జాతీ యుడు జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్, మోనూ ఒకేచోట ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement