the court
-
చిన్నమ్మ తంత్రం
సాక్షి, చెన్నై : విదేశీ మారక ద్రవ్యం కేసులో చిన్నమ్మ శశికళ కుటుంబీకులు కోర్టుకు హాజరయ్యారు. పరప్పన అగ్రహార చెర నుంచి భద్రత నడుమ సుధాకరన్ను ఎగ్మూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనతో పాటుగా మరో బంధువు భాస్కరన్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా బెంగళూరు చెరలో ఉన్న శశికళతో దినకరన్, తంబిదురైతో పాటుగా ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన వారిపై విదేశీ మారక ద్రవ్యం కేసుల మోత మోగుతున్న విషయం తెలిసిందే. శశికళ మీద కూడా ఈ కేసు నమోదై ఉంది. ఈ కేసుల విచారణ చెన్నై ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టు న్యాయమూర్తి మలర్ మది విచారిస్తున్నారు. శశికళ అక్క కుమారుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, అన్న కుమారుడు భాస్కరన్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇక, దివంగత సీఎం జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆ ఇద్దరు అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తుండటమే. విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం సుధాకరన్ను హాజరుపరచాలని ఇప్పటికే పలుమార్లు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, కర్ణాటక పోలీసులు అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటాన్ని ఓ కారణంగా ఆ పోలీసులు చూపించారు. ఎట్టకేలకు మంగళవారం జరిగిన విచారణకు పరప్పన అగ్రహార చెర నుంచి గట్టి భద్రత నడుమ సుధాకరన్ను చెన్నైకి తీసుకొచ్చారు. నిఘా నీడలో ఆయన్ను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా ఇరికించారంటూ కోర్టుకు సుధాకరన్ విన్నవించుకున్నారు. అభియోగాలపై ప్రభుత్వ తరపు వాదన, సాక్షుల విచారణకు కోర్టు తేదీ నిర్ణయించడంతో సుధాకరన్ అంగీకరించారు. ఇదే కేసు నిమిత్తం భాస్కరన్ సైతం కోర్టుకు హాజరైన తన వాదన వినిపించారు. తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేశారు. దీంతో సుధాకరన్ను గట్టి భద్రత నడుమ మళ్లీ బెంగళూరుకు తరలించారు. ఇక, విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళను కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారో అన్నది వేచి చూడాల్సిందే. చిన్నమ్మతో ములాఖత్ : పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చిన్నమ్మకు వివరించినట్టు సమాచారం. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని, దివాకరన్‌తో సాగుతున్న వివాదంపై స్పందించారు. వివాదాలన్నీ పనిగట్టుకుని సృష్టిస్తున్నారని, తమ కుటుంబీకులు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై చిన్నమ్మ తన నిర్ణయాన్ని పార్టీకి పంపుతారని, అందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మతో వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. చాలాకాలం అనంతరం చిన్నమ్మతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో మాట్లాడుతూ తంబిదురై వ్యాఖ్యానించడం విశేషం. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బీజేపీకి అనుకూలంగా పడే రీతిలో పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వాలన్న సంకేతాన్ని చిన్నమ్మకు తంబి దురై సూచించినట్టు సమాచారం. అలాగే, ఇదే ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఎదుర్కొందామా..? లేదా, సామరస్యంగా సాగుదామా..? అన్న అంశంపై దినకరన్ మంతనాలు సాగించినట్టు తెలిసింది. అయితే, తన రాజకీయ తంత్రాన్ని ఎన్నికల తేదీ నాటికి ప్రయోగించేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
నా సోదరికి పోలీసుల నుంచి ప్రాణహాని
కేసులుంటే కోర్టులో హాజరుపరచండి .. లేదంటే విడుదల చేయూలి అన్నపూర్ణ సోదరుడు భూతం వుస్తాన్‌రావు డిమాండ్ పిడుగురాళ్ళ మావోయిస్టు అనే ఆరోపణలతో పిడుగురాళ్ళ వుండలం జూలకల్లుకి చెందిన తన సోదరి అన్నపూర్ణ అలియూస్ అరుణ అలియూస్ పద్మక్కను తుళ్లూరు వుండలం తాళ్లారుుపాలెంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆమెకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె సోదరుడు భూతం మస్తాన్‌రావు ఆరోపించారు. వుస్తాన్‌రావు మంగళవారం పిడుగురాళ్ళ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన చిన్న చెల్లెలు అరుున అన్నపూర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు పోలీసులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి విజయువాడ వైపు తీసుకెళ్లారని చెప్పారు. అన్నపూర్ణపై కేసులు ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని, కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయూలని వుస్తాన్‌రావు డివూండ్ చేశారు. గతంలో వుస్తాన్‌రావు మేనకోడలు కువూర్తె అరుున రాయుపాటి స్వర్ణలత అలియూస్ నాగవుణిని పట్టుకుని పోలీసులు కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు అదే విధంగా తన చిన్న చెల్లెలు అన్నపూర్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయున ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో జననాట్య వుండలి పట్ల ఆకర్షితురాలైన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోరుుందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదని, ఇటీవలే రెండు రోజుల క్రితం పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంటికి వచ్చిన అన్నపూర్ణను పోలీసులు తీసుకెళ్లారని వుస్తాన్‌రావు వివరించారు. ఆమెను వెంటనే కోర్టుకు హాజరు పరచడవూ? లేదా విడుదల చేయుడమో చేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని ఆయున పోలీసులున హెచ్చరించారు. అన్నపూర్ణతోపాటు తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం, బావ బాలస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. అన్నపూర్ణను బేషరతుగా విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం నరసరావుపేట టౌన్: పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నాయకురాలు భూతం అన్నపూర్ణను వెంటనే బేషరతుగా విడుదలచేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీవో హోమ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసుల చర్యను నిరసించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళయ్యపాలెంలో తన సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న తలదాచుకున్న భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను యాంటీ నక్సల్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకి చెందిన అన్నపూర్ణ 1991నుంచి ఉద్యమంలో భాగస్వామ్యురాలైందన్నారు. గత నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బంధువుల ఇంట్లో చికిత్స పొందుతోందని చెప్పారు. ఏఎన్ఎస్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళారని, ఆమెకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అన్నపూర్ణపై ఏమైనా కేసులు ఉంటే వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరచాలని లేకుంటే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు నల్లపాటి రామారావు , కెఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్నా, పికెఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంభాల ఏడుకొండలు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దండు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బెయిల్ స్కాం!
⇒ నిందితులకు నకిలీ ష్యూరిటీ పత్రాలు జారీచేసే గ్యాంగ్ గుట్టురట్టు ⇒ మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించిన వైనం ⇒ జిల్లాలో పదిమంది దాకా ఏజెంట్లు ⇒ కీలక సూత్రధారి అనంతపురం జిల్లా వాసి ⇒ పోలీసుల అదుపులో పలువురు నిందితులు నిప్పులాంటి చట్టంతోనే చెలగాటమాడుతూ నకిలీ జామీను పత్రాలు సృష్టించి మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించే ముఠా గుట్టురట్టయింది. ఎంచక్కా ఐదేళ్లుగా సాగిన ఈ వ్యాపారం ఎస్పీ చొరవతో బట్టబయలైంది. ఇందులో జిల్లాకు చెందిన పదిమంది దాకా ఏజెంట్లు.. మరికొందరు న్యాయవాదులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని అతిత్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. పలమనేరు: మూడు రాష్ట్రాల కోర్టులను తప్పుదోవ పట్టించి నిందితులను నకిలీ జామీను పత్రాల ద్వారా విడుదల చేయించే ఓ భారీ గ్యాంగ్ ముఠా గుట్టురట్టయ్యింది. దీనివెనుక జిల్లావాసుల హస్తమున్నట్టు సమాచారం. వీరిని రేపోమాపో అరెస్ట్ చేసేందుకు ఎస్పీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంఘటన ఇలా వెలుగులోకి.. గతంలో గంగవరం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన నిందితులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత నిందితులు కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఆపై కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వారిపై వారెంట్లు జారీ అయ్యాయి. ఈ ముఠా గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. వారెంట్ జారీ అయిన నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు చిక్కాయి. నిందితులు కోర్టుకు సమర్పించిన జామీను పత్రాల్లో చాలా వరకు ఉద్యోగుల సాలరీ సర్టిఫికెట్లు ఉడడంతో వాటి ఆధారంగా ఆ ఉద్యోగులను విచారించారు. కానీ వారు తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో జామీను పత్రాలు నకిలీవని గుర్తించారు. కీలక సూత్రధారి అనంతపురం వాసే అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో బెయిల్ పొందేందుకు అవసరమైన అన్ని రకాల జామీపత్రాలను నకిలీవి సృష్టించి ఇవ్వడంలో సిద్ధహస్తుడు. ఇతని ఏజెంట్లు జిల్లాతో పాటు కడప, అనంతపురంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కోర్టుల్లో నిందితులకు అవసరమైన నకిలీ పత్రాలను అందజేస్తూ ఇప్పటిదాకా రూ.30 లక్షల దాకా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇతని వద్ద వందల సంఖ్యలో నకిలీ సీళ్లు, ధ్రువపత్రాలకు కావాల్సిన టెక్నాలజీ ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సదరు వ్యక్తి ఇదే వ్యాపారంలో మునిగితేలినట్టు స్పష్టమవుతోంది. పోలీసుల అదుపులో పలువురు ఏజెంట్లు నకిలీ జామీను పత్రాల స్కామ్‌కు సంబంధించి తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు చెందిన పలువురు ఏజెంట్ల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా జిల్లాలోని పలు కోర్టుల్లో 70 కేసులకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసి బెయిల్ పొందినట్లు సమాచారం. వీరి ద్వారా మరింతమంది ముఖ్య వ్యక్తులు, పలువురు న్యాయవాదుల పేర్లు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బురిడీ అంతర్రాష్ట్ర ముఠాలు, హిట్అండ్న్ ్రకేసులు, ఎక్సైజ్ స్మగ్లర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులకు ఈ ముఠా బెయిల్ మంజూరు చేయించేందుకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు కర్ణాటకలోని కోలార్, బెంగళూరు, తమిళనాడులోని కృష్ణగిరి, వేలూరు తదితర కోర్టుల్లోనూ ఈ గ్యాంగ్ నకిలీ పత్రాలను ఇచ్చి నిందితులకు బెయిల్ వచ్చేలా చేసినట్లు సమాచారం. ‘ఎర్ర’బెయిళ్లపై ఆరా కొన్నాళ్లుగా జిల్లాలో వందలాది మందిపై ఎర్రచందనం అక్రమరవాణా కేసులు నమోదయ్యాయి. పలువురు కోర్టులకు సమర్పించిన బెయిల్‌పత్రాలు అసలైనవా లేక నకిలీవా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఒకవేల ఈ కేసుల బెయిళ్లలోనూ ఇలాగే జరిగిఉంటే ఇంకెంతమంది ఇరుక్కుంటారో..! ఎస్పీ చొరవతో గుట్టురట్టు న్యాయ వ్యవస్థనే తప్పుదోవ పట్టించిన ఈ కుంభకోణం వెనుక ఉన్న ముఠాను పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవచూపినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో గంగవరం పోలీసులు ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపో, మాపో జిల్లా ఎస్పీ నిందితులను అరెస్ట్ చేసి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. -
సత్వర న్యాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్
హైకోర్టు జడ్జి జస్టిస్ అఫ్జల్‌పుర్కర్ తిరుపతి లీగల్: క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి కోర్టు ఆవరణలో వీడియోకాన్ఫరెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి, చిత్తూరు జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ విలాస్‌రావ్ అఫ్జల్‌పుర్కర్ తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై వీడియో కాన్పరెన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఓ హత్య కేసుకు సం బంధించి తిరుపతి సబ్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న పి.దిల్షాన్ అలియాస్ దిల్ అనే మహిళకు సంబంధించిన సెషన్స్ కేసులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆమెను న్యాయమూర్తి విచారించారు. ఆమెకు న్యాయవాదిని నియమించుకునే ఆర్థికశక్తి లేకపోవడంతో ప్రభుత్వం తరపున పి.రవి అనే న్యాయవాదిని నియమి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్ జడ్జిల కోర్టుల్లోని కేసుల్లో నిందితులై, జైల్లో రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో న్యాయమూర్తి వీడియో కాన్సరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు న్యాయమూర్తి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హై కోర్టు జడ్జి మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయశాఖలోని అన్ని విభాగాలను కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు తెలిపా రు. న్యాయస్థానాలను, జైళ్లను అనుసంధానం చేసేందుకు ఈ- కోర్టు విధానంలో భాగంగా వీడియో లింకేజీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన క్రమంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 37 వీడియో లింకేజీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో గతనెల 22న మొదటిసారిగా వీడియో లింకేజీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జుడిషియల్ కస్టడీలోని ఖైదీల రిమాం డ్ పొడిగించడం సులభతరమవుతుందని, ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్‌లో సాక్షుల విచారణ, ఇరువైపుల వాదనలు వినడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వ అధికారుల, నిపుణులు తాము కోరుకున్న చోటు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షం చెప్పడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి టి.ఆనంద్, తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి నాగార్జున, మూడో అదనపు జిల్లా జడ్జి రాంబాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్, వీడియో కాన్పరెన్స్ నోడల్ ఆఫీసర్, నాల్గవ అదనపు జూనియర్జడ్జి సన్యాసినాయుడు, సీనియర్ సివిల్జడ్జిలు రాంగోపాల్, సదానందమూర్తి, జూనియర్జడ్జిలు మల్లీశ్వరి, శశిధర్‌రెడ్డి, లీలా వెంకటశేషాద్రి, పి.విజయ, న్యాయవాదులసంఘ కార్యవర్గ సభ్యులు, జిల్లా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఏపీపీ రాజేంద్రకుమార్, ఇతర పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
టీటీడీ అధికారి ఇంట్లో ముగిసిన ఏసీబీ దర్యాప్తు
నిందితుడిని నెల్లూరు కోర్టుకు హాజరు తిరుపతిక్రైం : టీటీడీ డెప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో దర్యాప్తు మంగళవారం ముగిసిందని ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపారు. భూపతిరెడ్డి ఆస్తులు విలువ ఎంతనేది అంచనాకు రాలేక పోతున్నామన్నారు. ఇప్పటికే ఆయన బంధుమిత్రులకు సంబంధించిన 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. అయితే 2015 డిసెంబర్లో రూ.1.8 కోట్ల విలువ చేసే ఒక స్థలానికి రూ.65 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారని, అలాగే ఆయనకు తిరుచానూరు, రాఘవేంద్రనగర్ గ్రామీణ బ్యాంకుల్లో రెండు లాకర్లు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఆ లాకర్లను బుధవారం తెరుస్తామని, వాటిల్లో మరింత ఆస్తుల సమాచారం, ఇతరత్రా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే 12 ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో ఎంత మొత్తం నగదు వుందనేది బుధవారం నాటికి పూర్తిగా తెలుస్తుందన్నారు. అయితే ఐసీసీఐ బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.37లక్షలు ఉన్నట్టు తేలిందన్నారు. ఇంకా పోస్టల్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భూపతిరెడ్డిని నెల్లూరు కోర్టులో హాజరు పరచామన్నారు. -
గృహహింస కేసు ద్వారా మీ అన్నయ్యను దారిలోకి తీసుకు రావచ్చు!
నేను, నా భర్త విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను మరలా వివాహం చేసుకున్నాను. నా భర్త కూడా మరలా వివాహం చేసుకున్నాడు. ఇది జరిగి పది సంవత్సరాలైంది. నా మొదటి భర్త ద్వారా నాకొక పాప. ఆమె నా దగ్గరే పెరుగుతుంది. ఇటీవల నా మొదటి భర్త యాక్సిడెంట్లో పోయారని తెలిసింది. ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. అతని రెండవ భార్యకూ ఒక పాప ఉంది. ఆయన వీలునామా రాయలేదు. నేను నా పాపకు తండ్రి నుండి ఆస్తి వచ్చే ప్రయత్నం చేయవచ్చా? పాపకు హక్కులున్నాయా? - నివేదిత, ఆదిలాబాద్ మీ పాపకు తన తండ్రి ఆస్తిలో తప్పకుండా వాటా ఉంటుంది. మీ విడాకులకూ ఆస్తి సంక్రమణకూ ఎలాంటి సంబంధం లేదు. హిందూ వారసత్వ చట్టం 1956 అనుసరించి పాపకు ఆస్తిహక్కు ఉంటుంది. చట్టప్రకారం ఒక హిందూ పురుషుడు వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తికి అతని తల్లి, భార్య, కూతురు, వితంతువైన కోడలు ప్రథమశ్రేణి వారసులౌతారు. కనుక మీ పాపకు చనిపోయిన తండ్రి ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా వస్తుంది. ముందుగా మీరు ఆస్తికి సంబంధించిన వివరాలు సేకరించి, ఒక లీగల్ నోటీస్ అతని రెండవ భార్యకు జారీ చేయండి. సామరస్యంగా పరిష్కారమైతే మంచిది. లేకుంటే కోర్టులో ‘ఆస్తివిభజన దావా’ వేయవలసి వస్తుంది. నా వయస్సు 19 సం॥బీటెక్ చదువుతున్నాను. నాన్నగారు చనిపోయారు. నేను, అమ్మ, అన్నయ్య కలసి ఉంటున్నాము. అన్నయ్య చదువు ఇంకా పూర్తి కాలేదు. సమస్యేమిటంటే, నాన్న చనిపోయాక అన్నయ్య చాలా మారిపోయాడు. నాపైనా, అమ్మపైనా ఎన్నో ఆంక్షలు విధించాడు. మా మీద పెత్తనం చలాంచడమేగాక, అమ్మపై, నాపై చేయి కూడా చేసుకుంటున్నాడు. ఎవరికైనా చెబుతామంటే పరువు పోతుందని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాము. అన్నయ్యపై మేము చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా? - వీణ, వేజెండ్ల మీ అన్నయ్య ప్రవర్తన ‘గృహహింస చట్టం’ కిందకు వస్తుంది. రక్త సంబంధీకులైన మగవారు, వివాహసంబంధం ద్వారా బంధువులైన మగవారు మహిళలను హింసకు గురిచేసినపుడు, అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా హింసించినప్పుడు, ఈ చట్టాన్ని అనుసరించి తగిన ఉపశమనాలు పొందవచ్చు. మీ అన్నయ్య మీకూ, అమ్మకూ రక్త సంబంధీకుడౌతాడు. కనుక ఈ చట్టపరిధిలోకి వస్తాడు. మీరు మీ జిల్లాలోని ‘ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్’ ఆఫీస్‌కి వెళ్లి, అక్కడ వారిని సంప్రదించి కేస్ వేసి మిమ్ములను, అమ్మనూ వేధించకుండా మీపై చేయి చేసుకోకుండా ‘రక్షణ ఉత్తర్వులు’ పొందవచ్చు. మీరు కేస్ వేయగానే మీ అన్నయ్యను పిలిపించి ‘కౌన్సెలింగ్’ ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. వినకుంటే కేస్ వేసి కోర్టుకు పంపిస్తారు. అక్కడ మీరు విచారణ అనంతరం ఉత్తర్వులు పొందవచ్చు. నా వయస్సు 30 సం॥పెళ్లి విషయంలో మహిళలే కాకుండా పురుషులు కూడా మోసపోతున్నారనడానికి నా పెళ్లే పెద్ద ఉదాహరణ. ఎన్నో ఆదర్శాలతో కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకున్నాను. అమ్మానాన్నలను ఆదరించే అమ్మాయి చాలనుకున్నా. నా భార్య పెళ్లినాటికే కాస్త బొద్దుగా ఉన్నా, మంచి కుటుంబమని చేసుకున్నాను. పెళ్లి రిసెప్షన్నాడే ఒక నమ్మకస్తుడి ద్వారా నా భార్య గర్భవతి అని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. నమ్మలేదు. కానీ ఎంతో ఆప్తులైన ఆ వ్యక్తి సాక్ష్యంతో సహా చూపించాడు. అమ్మాయినీ, తల్లిదండ్రులను నిలదీశాను. ఒప్పుకోలేదు. నన్ను పోలీసులకు పట్టిస్తానని బెదిరించారు. ఇది జరిగి రెండునెలలైంది. మామధ్య శారీరక సంబంధం లేదు. అమ్మానాన్న మంచమెక్కారు. అక్కలు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు. - శేఖర్, హైదరాబాద్ సెక్షన్ 12 హిందూ వివాహచట్టం 1955 ప్రకారం వివాహమయ్యే నాటికే భార్య గర్భవతిగా ఉండి, ఆ సంగతి భర్తకు తెలియకుండా ఉండి, తెలిసిన తర్వాత శారీరక సంబంధం లేకుండా ఉంటే ఆ వివాహాన్ని ‘చెల్లకూడని వివాహం’ (నల్ అండ్ వాయిడ్)గా ప్రకటించమని వివాహమైన సంవత్సరంలోగా కోర్టును ఆశ్రయించవచ్చు. తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించవలసిన బాధ్యత మీదే. -
టీ సర్కారుది కోర్టు ధిక్కారమే
హుస్సేన్ సాగర్ ప్రక్షాళనపై ‘సోల్’ మండిపాటు హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళన విషయంలో తెలంగాణ సర్కార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా ఒక ప్రణాళికాయుత విధానం, శాస్త్రీయత లేకుండా వ్యవహరిస్తోందని ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ (సోల్) సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంస్థ కోకన్వీనర్ లుబ్నా సర్వత్ ఇతర సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగర్ ప్రక్షాళనపై తమకు పూర్తి వివరాలు కావాలని హక్కుల చట్టం ఆధారంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీపీసీబీలను కోరితే ఆ సంస్థలు తమ వద్ద ఏ సమాచారం లేదని సమాధానం ఇచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (సదరన్ జోన్)లో పిటిషన్ వేశామన్నారు. సాగర్‌ను ఖాళీ చేయించే విషయమై ప్రభుత్వం ప్రాజెక్టు నివేదిక లేకుండా, ప్రజలతో సంప్రదింపులు జరపకుండా చర్యలకు ఉపక్రమించ డం తగదని వాదించామన్నారు. తీవ్రంగా కలుషితమైన సాగర్ జలాలను, ప్రమాదకర వ్యర్థాలను నేరుగా మూసీలోకి వదలడం వల్ల ఆ నీటిలోని జీవరాశులు చనిపోతాయని పిటిషన్లో పేర్కొన్నామన్నారు. దీంతో సాగర్ ఖాళీచేసే పనులను నిలిపేయాలని ట్రిబ్యునల్ ప్రభుత్వానికి, సంబంధిత సంస్థలకు ఆదేశించినట్లు సర్వత్ వెల్లడించారు. అలాగే ఈ నెల 22 లోపు సాగర్ యాక్షన్‌ప్లాన్‌ను ప్రభుత్వం తమకు అందించాలని ఆదేశించిందన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ నీటిని మళ్లిస్తోందని ఇది కోర్టుధిక్కారమని తెలి పారు. దీనిపై సోమవారం తిరిగి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సోల్ వ్యవస్థాపక సభ్యుడు బి.వి. సుబ్బారావు, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి, సోల్ ప్రతినిధులు జాస్విన్ జైరాథ్, ఒమిమ్ కూడా విలేకరులతో మాట్లాడారు. -
కోర్టు సమీపంలో న్యాయవాది హత్య
- నిరసనగా కోర్టు కార్యకలాపాలు నిలిపేసిన న్యాయవాదులు - కోర్టు సమీపంలోనే తమకు రక్షణ లేదని ఆరోపణ - పదునైన ఆయుధంతో గాయపరచడం వల్లే మృతి - కేసులో ఒక వ్యక్తి అరెస్ట్.. మరో ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు సాక్షి, న్యూఢిల్లీ: తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్ వెనుకభాగంలో ఓ న్యాయవాది వృతదేహం శుక్రవారం రక్తం మడుగులో లభించింది. తమ సహచరుడు కోర్టు ఆవరణలోనే హత్యకు గురికావడం న్యాయవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. న్యాయవాది హత్యకు నిరసనగా వారు పనులు నిలిపివేసి ధర్నా జరిపారు. శర్మహత్యకు నిరసనగా శుక్రవారం అన్ని విధులు నిలిపివేయాలని ఆల్ డిస్ట్రిక్ బార్ సమన్వయ కమిటీ నిర్ణయించిందని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు చెందిన డీడీవర్మ తెలిపారు. శుక్రవారం ఉదయం కోర్టు వెనుక భాగాన టి బ్లాక్ లాయర్ల చాంబర్లో ఉన్న దాభా దగ్గర న్యాయవాది రాజీవ్ శర్మ వృతదేహం పోలీసులకు లభించింది. గురువారం రాత్రి దాభా దగ్గర జరిగిన ఘర్షణలో అతను మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై పదునైన ఆయుధంతో గాయపరచడం వల్ల శర్మ ప్రాణాలు పోయి ఉంటాయని వారు చెబుతున్నారు. న్యాయవాది హత్యకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తరువాత రాజీవ్ శర్మ తన కుటుంబసభ్యులతో మాట్లాడారని పోలీసులు పేర్కొన్నారు. 38 సంవత్సరాల న్యాయవాది శర్మ రోహిణి ప్రాంత నివాసి అని వారు చెప్పారు. శర్మ వృతదేహం కోర్టు దుస్తులలోనే లభించిందని పోలీసులు చెప్పారు. కోర్టు నుంచి బయటకు రాగానే శర్మ దాభా దగ్గర కొందరు వ్యక్తులతో గొడవ పడి ఉంటాడని, ఈ గొడవ అతని ప్రాణాలు తీసి ఉంటుందని పోలీసులు చెప్పారు. శర్మ హత్య కేసుకు సంబంధించి పోలీసులు జోధ్‌పుర్‌కు చెందిన ధన్నా రామ్ చౌదరిని అరెస్టు చేశారని, దాభాలో పనిచేసే ముగ్గురు పనివారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని అనధికార వర్గాలు తెలిపాయి. శర్మ హత్యకు గురైన రోడ్డుపై పలువురు లాయర్ల చాంబర్లు ఉన్నాయి. దాభా యజమాని మనోజ్ సింగ్ కూడా న్యాయవాదేనని తెలిసింది. దాభా దగ్గర శర్మ మద్యం సేవించి ధన్నా రామ్ చౌదరితో తీవ్రంగా గొడవ పడ్డాడని, ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసిందని, దాభా పనివారు కూడా ఈ గొడవలో తలదూర్చారని, వారిలో ఒకరు శర్మ తలపై పదునైన వస్తువుతో కొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. న్యాయస్థానం సమీపంలోనే తమ సహచరుడొకరు హత్యకు గురికావడం పట్ల న్యాయవాదులు నిరసన ప్రకటించారు. ఓ యువ న్యాయవాది కోర్టు పరిసరాలలోనే హత్యకు గురయ్యాడని, అది తీవ్రమైన విషయమని న్యాయవాదులు పేర్కొన్నారు. అతను అంత పొద్దుపోయిన తరువాత దాభా వద్ద ఏంచేస్తున్నాడనేది ఇంకా తేలవలసి ఉందని తీస్‌హజారీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నాసియర్ అన్నారు. -
దివాకర్ నాయుడుకు యావజ్జీవం
ఆదోని: ఫ్యాక్షనిస్టు, తెలుగుదేశం నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కప్పట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న కప్పట్రాల సర్పంచ్ మాదాపురం దివాకర్ నాయుడుకు యావజ్జీవ శిక్ష, రూ.మూడు వేలు జరిమానా విదిస్తూ ఆదోని రెండో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం సోమవారం తీర్పు వెల్లడించారు. కోర్టులో జడ్జ్ తీర్పును వెల్లడిస్తుండగా బయట తీవ్ర ఉద్రిక్తత కనిపించింది. పత్తికొండ సీఐ గంట సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు సిబ్బంది కోర్టు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. దివాకర్ నాయుడు తల్లి రాములమ్మ, బంధువులు పెద్దఎత్తున కోర్టు వద్దకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో జడ్జి తీర్పు వెల్లడించగానే బోనులో ఉన్న దివాకర్‌నాయుడు ముఖంలో ఆవేదన కనిపించింది. బయట ఉన్న తల్లి రాములమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. తీర్పు పూర్తి కాగానే దివాకర్ నాయుడును భారీ బందోబస్తు మధ్య పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించారు. ఈ తీర్పుతో వెంకటప్పనాయుడు హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన వారి సంఖ్య 18కి చేరింది. ఘటన..కేసు: 2008 మే 17న దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టాపు వద్ద కప్పట్రాల వెంకటప్ప నాయుడుతో సహా మొత్తం 10 మంది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి దేవనకొండ పోలీసులు మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు ఆరేళ్లపాటు కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగుతుండగానే నలుగురు నిందితులు మృతి చెందారు. కోర్టులో నేరం రుజువు కావడంతో మొత్తం నిందితులలో 17 మందికి గత నెల 10వ తేదీన యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆదోని జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి సుబ్రమణ్యం తీర్పు చెప్పారు. తీర్పు రోజు దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన దివాకర్‌నాయుడుపై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రముఖులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డితో సహా మొత్తం 26 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మగ దిక్కును కోల్పోయిన దివాకర్ కుటుంబం ఫ్యాక్షన్ భూతం దివాకర్ నాయుడు కుటుంబంలో మగ దిక్కు లేకుండా చేసింది. దివాకర్‌నాయుడు తండ్రి రంగప్పనాయుడు గతంలో ఫ్యాక్షన్‌లో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కప్పట్రాళ్ల హత్య కేసులో శిక్ష పడిన మొత్తం 18 మందిలో ముగ్గురు దివాకర్ నాయుడు సోదరులే. వారు మద్దిలేటి నాయుడు, యోగేష్ నాయుడు, పురుషోత్తమ నాయుడు. వీరు ఇప్పటికే సెంట్రల్ జైలుకు వెళ్లగా సోమవారం తీర్పుతో దివాకర్ నాయుడు కూడా ఇంటికి దూరం అయ్యాడు. మద్దిలేటి నాయుడు, పురుషోత్తమ నాయుడుకు మాత్రం పెళ్లిళ్లు అయ్యాయి. ఎలా బతికేది?: భర్త రంగప్ప నాయుడు ఫ్యాక్షన్‌కు బలి కావడం, నలుగురు కొడుకులు జైలు పాలు కావడంతో తల్లి రాములమ్మ కన్నీళ్ల పర్యంతమైంది. ఇద్దరు కోడళ్లతో తాను ఎలా బతుకాలంటూ బోరున విలపించింది. తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రత్యేర్థులు తమ పొలంలో ఉన్న వ్యవసాయ పంపింగ్ మోటారును ఎత్తుకు వెళ్లారని, ఇంటి వద్ద ఉన్న ట్రాక్టరును కాల్చి వేశారని, ఇక తమను బతకనిస్తారన్న నమ్మకం లేదని గుండెలవిసేలా రోదించారు. వెంకటప్పనాయుడు హత్య కేసుతో తన కొడుకులకు సంబంధం లేదని, రాజకీయాల వల్ల జైలుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. న్యాయం కోసం తాను హైకోర్టుకు వెళుతానని తెలిపారు. -
మృగాడికి పదేళ్ల జైలు
బాలికపై లైంగిక దాడి కేసులో మూడో అదనపు జిల్లా కోర్టు తీర్పు వరంగల్ లీగల్ : అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే అపకారం తలపెట్టిన మృగాడిపై న్యాయస్థానం కన్నెర్ర జేసింది. సభ్యసమాజం అసహించుకునేలా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరస్తుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి ఇనగంటి కృష్ణయ్య తీర్పు ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శంభునిపేటకు చెందిన నేరస్తుడు మహమూద్ గౌస్(21) క్యాటరింగ్ వర్కర్‌గా పనిచేసేవాడు. 2012 మే 7న పని లేదని, తన ఇంట్లో ఎవరూ లేరని తినడానికి అన్నం పెట్టమని సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. వారింట్లో ముగ్గురు బాలికలు ఉన్నారు. ఇంటి యజమానురాలు ప్లేట్లో అన్నం పెట్టి తన రెండో కూతురైన 8 ఏళ్ల బాలికను రూమ్‌లో ఉన్న నేరస్తుడు గౌస్‌కు వద్దకు పంపించింది. ఉదయం 9.40 గంటలకు అతడు తిన్న ప్లేటు తీసుకురావడానికి సదరు బాలిక రూమ్‌కు వెళ్లగా గౌస్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఏడుస్తూ ఇంటికి వెళ్లగా తల్లి ఏమైందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె అందుబాటులో ఉన్న బంధువులకు తెలిపింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు 21 సంవత్సరాల యువకుడైన మహ్మద్ గౌస్ ఉద్దేశపూర్వకంగానే బాలికపై బెదిరింపులకు పాల్పడి, లైంగికదాడి చేశాడని రుజువు కావడంతో జడ్జి ఇనగంటి కృష్ణయ్య శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. నేరస్తుడికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం లైంగిక దాడి నేరం కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా, బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 506 కింద 6 నెలల జైలు శిక్ష విధించారు. జరిమానా చెల్లించకుంటే మరో నెల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని, శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును అప్పటి మిల్స్‌కాలనీ సీఐ ఎల్.రమేష్‌కుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్ పి.రమేష్‌బాబు, నారాయణదాసు పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుళ్లు రమణారెడ్డి, రమేష్ కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వై. శ్రీరాఘవరావు వాదించారు. -
‘జంగా’కు బెయిల్
నాటకీయ పరిణామాల మధ్య మడికొండ ఠాణాకు చేరిన రాఘవరెడ్డి బెయిల్ పత్రాలు పరిశీలించి.. పూచీకత్తుపై విడుదల చేసిన సీఐ కాజీపేట : నాణ్యతలేని బ్రిడ్జిలను నిర్మించారనే అభియోగాలతో నమోదైన కేసులో కోర్టులో ముందస్తు బెయిల్ పొందిన జంగా కన్స్ట్రక్షన్స్ ఎండీ, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సినీఫక్కీలో మడికొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం లొంగిపోయి, బెయి ల్‌పై విడుదలయ్యారు. మడికొండ, టేకులగూడెం గ్రామాల్లో రెండు బ్రిడ్జిలను నాణ్యత లేకుండా నిర్మిం చడమేగాక అధికారులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆగస్టు 21న ఎస్ఈ జనార్దన్‌రెడ్డి మడికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లగా ఇటీవల మొదటి అదనపు న్యాయమూర్తి కె.బి నర్సింహు లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులతోపాటు *20 వేల వ్యక్తిగత పూచికత్తును సమర్పించి పోలీసుస్టేషన్లో లొంగి పోయి ఎస్హెచ్ఓ ఎదుట బెయిల్ పొందాలని ఆదేశించా రు. ఈ మేరకు రాఘవరెడ్డి సోమవారం న్యాయవాది ద్వారా మడికొండ సీఐ నందిరామ్‌నాయక్ ఎదుట లొంగిపోయి బెయిల్ తీసుకున్నారు. వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని రాఘవరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. పత్రాలు పరిశీలించాక రాఘవరెడ్డిని సీఐ నందిరామ్‌నాయక్ విడుదల చేశారు. జంగా వెంట డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నేతలు వరదరాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీను, ఉమాపతిరెడ్డి, గోపు బిక్షపతి, డి.జైపాల్‌రెడ్డి, రాజుగారి రఘు, సుంచు అశోక్, తొట్ల రాజు, పి.నాగరాజు, సయ్యద్ రజాలీ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. కొందరు వ్యక్తులు తనపై కక్ష కట్టి అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తున్నారని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించా రు. ఓ క్వారీ విషయంలో తలెత్తిన విబేధాలను మనసులో పెట్టుకుని జయ ఆస్పత్రి యజమాని, మాజీ ఎంపీ భర్త టి.నర్సింహారెడ్డి తన పనులపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని వాపోయారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా దంపతులకు మద్దతిచ్చాననే కోపంతో నర్సింగ్‌రెడ్డి తండ్రితో కలిసి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. బ్రిడ్జిలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పత్రాలను విలేకరులకు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి చాలా విషయాలను బహిర్గతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు టౌన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి సోమవారం ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. గత మార్చి 30న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఆదిఆంధ్ర పాఠశాలలోని పోలింగ్ బూత్‌కు సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లతో చర్చిస్తుండటంతో పట్టణ పోలీసులు ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. సోమవారం ఈ కేసు వాయిదా ఉండటంతో ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేశారు. -
విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు..
చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం ఇది. విడాకుల వివాదం సెటిల్మెంట్ కోసం అక్షరాలా రూ. 27 వేల కోట్లు భార్యకు చెల్లించాలంటూ రష్యాకు చెందిన వ్యాపారవేత్త దిమిత్రీ రైబొలొవ్లెవ్ను అక్కడి కోర్టు ఆదేశించింది. ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 52,800 కోట్లు ఉంటుంది. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇలాంటివే మరికొన్ని భారీ విడాకుల కేసులు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త అలెక్ వెల్డైన్స్టెయిన్ డైవోర్స్ తీసుకున్నప్పుడు భార్య జోసెలిన్కి దాదాపు రూ. 15,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన మాజీ భార్య ఆనాకి సుమారు రూ. 10,000 కోట్లు ఇచ్చారు. ఇదే కోవలో ఫార్ములా వన్ ప్రెసిడెంట్ బెర్నీ ఎక్లిస్టోన్ తన మాజీ భార్య స్లావికా నుంచి విడాకుల కోసం రూ. 9,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. హాలీవుడ్ స్టార్ మెల్ గిబ్సన్ కూడా భార్య రాబిన్ నుంచి విడిపోయినప్పుడు రూ. 2,000 కోట్లు పైగా ఇవ్వాల్సి వచ్చింది. -
ఢిల్లీపై దాడికి అఖ్తర్ కుట్ర
న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుడు తెహసీన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ, అనుచరుల సాయంతో దేశరాజధానిపై బాంబుదాడులకు యత్నించాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు శుక్రవారం తెలిపారు. దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడ్డ వారిలో ఒకడైన ఇతని నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి రిమాండ్ విధించాలని కోరుతూ ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. స్థానికకోర్టు మోనూకు ఇది వరకే ఏప్రిల్ రెండు వరకు పోలీసు కస్టడీ విధించింది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లా సమీపంలోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఇతణ్ని ఈ నెల 25న అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోనూ దాడులకు పాల్పడ్డాడని స్పెషల్‌సెల్ పోలీ సులు పేర్కొన్నారు. ఢిల్లీపై దాడులకు యత్నిస్తున్న సమయంలోనే తమకు చిక్కాడని ప్రకటించారు. ఈ కేసు లో మరిన్ని వివరాల సేకరణ, ఇతర నింది తుల అరెస్టు కోసం మోనూను చాలా నగరాల్లో తిప్పాల్సి ఉంద ని తెలిపారు. పేలుళ్ల కుట్రలను ఛేదిం చాలని ఇతణ్ని క్షుణ్నంగా విచారించాల్సి ఉంటుందని వివరించిం ది. ఇండియన్ ముజాహిదీన్ దేశంలో మతసామరస్యాన్ని నిర్మూలించేందు కు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ జాతీ యుడు జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్, మోనూ ఒకేచోట ప్రశ్నించాల్సి ఉందని కూడా తెలియజేసింది. -
ఆర్మీ ఆంక్షలపై నిరసన
రోడ్ల మూసివేతపై భగ్గుమంటున్న జనం పోరాట మార్గాలపై మల్లగుల్లాలు ప్రజలకు వ్యతిరేకం కాదంటున్న మిలటరీ అధికారులు ప్రత్యామ్నామ మార్గాలు లేక జనం సతమత ం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సాధారణ వాహనాల రాకపోకల్ని నిషేధిస్తూ మిలటరీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై చుట్టుపక్కల కాలనీల్లో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాత్రివేళల్లో ఆంక్షల్ని అమలు చేస్తున్న మిలటరీ అధికారులు పగటిపూట కూడా ఆంక్షల్ని ఆరంభిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆర్మీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా వివిధ వర్గాలు, పార్టీలు, అసోసియేషన్లు ఎవరికి వారు తమదైన శైలిలో పోరాటాలు ఆరంభించారు. వినతులు, విజ్ఞప్తులు, నిరసనలతో పాటు కోర్టు ద్వారా కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రధానంగా సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి వచ్చేరోడ్డు మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే మల్కాజ్గిరి, ఉప్పల్ నియోజకవర్గాల ప్రజలు ఉద్యమానికి సైతం సిద్ధమవుతున్నారు. వీరికి కంటోన్మెంట్ ప్రజలు కూడా తోడైతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆర్మీ పాలనలోని కంటోన్మెంట్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యులు సైతం మిలటరీ అధికారులపై ఒత్తిడి తీవ్రతరం చేశారు. గతంలో కంటోన్మెంట్ నిధులతో అభివృద్ధి చేసిన రోడ్లపైకి సాధారణ పౌరుల రాకపోకల్ని ఎలా నిషేధిస్తారంటూ ఇటీవల బోర్డు సమావేశంలో సీనియర్ బోర్డు సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు జంపన ప్రతాప్, వెంకట్రావులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా మిలటరీ అధికారుల వాదన మరోలా ఉంది. కంటోన్మెంట్లో పెరిగిపోయిన ట్రాఫిక్ వల్ల తమ శిక్ష ణ కార్యకలాపాలు, ఇతరత్రా విధులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, భద్రత పరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో కంటోన్మెంట్ పరిధిలో సాధారణ పౌరులు, మిలటరీ సిబ్బం ది మధ్య ఉండాల్సిన పరస్పర సహకారం, బాధ్యతలు, విధులు, హక్కుల అంశాలు చర్చనీయాంశమయ్యాయి. కంటోన్మెంట్ విభిన్నం సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీబీ) చాలా భిన్నమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన ఎస్సీబీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన కంటోన్మెంట్. మొత్తం 10వేల ఎకరాల్లో మూడు భాగాలుగా విస్తరించిన ఎస్సీబీ పరిధిలో సుమారు 6వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. 3 వేల ఎకరాల పరిధిలో కంటోన్మెంట్ సివిలియన్ ప్రాంతం ఉంది. మిగతా వెయ్యి ఎకరాల్లో బేగంపేట ఎయిర్‌పోర్టు, బీ-3, బీ-4 కేటగిరీ స్థలాలున్నాయి. ఏళ్ల తరబడి కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల (ఇప్పుడు జీహెచ్ఎంసీలో భాగమయ్యాయి) ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ రోడ్లను వినియోస్తూ వచ్చారు. గత పదేళ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందనే కారణంతో వివిధ రోడ్లపై సివిలియన్ల రాకపోకలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. మల్కాజ్‌గిరికి తెగనున్న లింక్ మిలటరీ అధికారుల తాజా ఆంక్షల్లో ప్రధానంగా సఫిల్‌గూడ నుంచి మారేడ్‌పల్లి/ సికింద్రాబాద్ క్లబ్‌కు దారితీసే రోడ్డు మూతతో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు కంటోన్మెంట్‌తో లింక్ తెగిపోతుంది. దీంతో సివిలియన్ ప్రాంతాలకు ఆనుకుని సాగే ఈ రోడ్డుపైనైనా రాకపోకల్ని అనుమతించాలని పలువురు కోరుతున్నారు. ఆర్కేపురం- తిరుమలగిరి రోడ్డు మాదిరిగానే ఈ మార్గాన్ని కొనసాగిస్తే మెజారిటీ ప్రజల సమస్య తీరినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. కాలనీల ప్రతినిధులతో చర్చలు: ఆర్మీ ఈ విషయమై మార్చి 2న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ సమీప కాలనీ ప్రతినిధులతో చర్చించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మీ శిక్షణ సంస్థలకు ఇబ్బందులు కలగని రీతిలో ఆర్మీ రోడ్లను వినియోగించే అంశాన్ని చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి మొదటి వారంలో స్థానిక సంస్థల అధికారులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్, పోలీసులతో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. బోర్డు నిధులతోనే నిర్మించాం ఆర్మీ కంటోన్మెంట్‌లోని పలు రోడ్లను సివిలియన్ కంటోన్మెంట్ బోర్డు నిధులతోనే అభివృద్ధి చేశాం. కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఒక్కొక్కటిగా రోడ్లు మూసివేస్తూ వస్తున్నారు. దీంతో సమీప కాలనీలతో కంటోన్మెంట్ ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అందాల్సిన సర్వీసు చార్జీలు సకాలంలో అందడం లేదు. తాజాగా ఈ బకాయిలు రూ.315 కోట్లకు చేరాయి. ఈ నిధుల్ని అందిస్తే అంతర్గతంగా రోడ్లను విస్తరించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. - జంపన ప్రతాప్, కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు కచ్చితమైన సమాచారం లేదు కంటోన్మెంట్ పరిధిలో ఏయే రోడ్లు బోర్డు పరిధిలోకి వస్తాయి? ఏ రోడ్లు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) పరి ధిలోకి వస్తాయనే పక్కా సమాచారం బోర్డులో అందుబాటులో లేదు. ఆర్కే పురం- తిరుమలగిరి మధ్య ఉన్న మార్గం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) అజమాయిషిలో ఉన్నట్లు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేశారు. తాజాగా ఆంక్షల నేపథ్యంలో రోడ్లపై విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంతర్గత రోడ్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. - సుజాత గుప్తా, కంటోన్మెంట్ సీఈఓ న్యాయపోరాటం చేస్తాం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సాధారణ ప్రజలు వినియోగిస్తున్న రోడ్లను అర్ధంతరంగా మూసివేయ డం సరికాదు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తాం. కొంత కాలంగా ప్రజలు ఉపయోగిస్తున్న రోడ్లను సహేతుక కారణాలు లేకుండా మూసివేయం ఈజ్మెంట్ రైట్‌కు భంగం కలిగించడం అవుతుంది. ఈ కోణంలోనూ మా పోరాటాన్ని కొనసాగిస్తాం. - రమణ, సీనియర్ అడ్వకేట్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉద్యమం చేస్తాం కంటోన్మెంట్లో ఆర్మీ ఆంక్షలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సివిలియన్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీ (ఎంసీహెచ్)లో విలీనం చేయాలని 1998లో స్థానిక ఎమ్మెల్యేగా తీవ్ర ప్రయత్నం చేశాను. ఇందుకు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలోని రక్షణ శాఖ మంత్రి కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ, స్థానిక బోర్డు సభ్యులు సహకరించలేదు. రోడ్లపై ఆంక్షల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రజా ఉద్యమంతో పాటు, న్యాయపోరాటం కూడా చేస్తాం. - సాయన్న, మాజీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఆంక్షలొద్దు: హైకోర్టు ఆదేశం కంటోన్మెంట్ పరిధిలో రక్షణాధికారుల ఆంక్షల వల్ల ఇబ్బం దులు పడుతున్న సాధారణ ప్రజానీకానికి హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఎటువంటి ఆంక్షలు విధించకుండా వాహనాల రాకపోకలను అనుమతించాలని రక్షణ మంత్రిత్వశా ఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యా యమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో రక్షణశాఖాధికారులు భద్రతను కారణంగా చూపుతూ పలు రహదారులను మూసివేశారని, దీని వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎటువంటి ఆంక్షలు లేకుండా వాహనాల రాకపోకలకు అనుమతిని మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ మల్కాజిగిరి నియోజకవర్గ కోఆర్టినేటర్ గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన బి.కృష్ణవిజయారావులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. కంటోన్మెంట్ రోడ్లపై వాహనదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలను తదుపరి విచారణ నిమిత్తం మార్చి 6కి వాయిదా వేశారు. ఆంక్షలు వద్దని కోర్టు పేర్కొన్న మార్గాలివీ... ఎంట్రన్స్రోడ్ : ఎస్పీ రోడ్డు, ఈస్ట్ మారేడ్‌పల్లి నుంచి అలహాబాద్ గేట్ వెల్లింగ్టన్రోడ్ : సికింద్రాబాద్ క్లబ్ నుంచి అలహాబాద్రోడ్. ఆర్డినెన్స్ రోడ్ : సఫిల్‌గూడ జంక్షన్ నుంచి మార్నింగ్టన్ రోడ్ : తిరుమలగిరి హనుమాన్ దేవస్థానం నుంచి గాఫ్ రోడ్. గాఫ్ రోడ్ : కేంద్రీయ విద్యాలయ క్రాసింగ్ నుంచి ఈస్ట్, వెస్ట్ మారేడ్‌పల్లి గత పదేళ్లలో మూతపడిన ప్రధాన రహదారులు బొల్లారం నుంచి బాలాజీనగర్, భవన్స్ కాలేజీ మీదుగా సైనిక్‌పురి వేళ్లే మార్గాన్ని ఏడేళ్ల క్రితం మూసేశారు. శామీర్‌పేట నుంచి రహదారి నుంచి నేరుగా ఈసీఐఎల్ వైపు వెళ్లే వారు ఈ మార్గాన్నే ఉపయోగించేవారు. ఈ రోడ్డు మూసివేతతో బొల్లారం- కౌకూరు- యాప్రాల్ మీదుగా బాలాజీనగర్ చేరుకోవాల్సి వస్తోంది. బోయిన్పల్లి చెక్‌పోస్టు సమీపంలోని నందమూరి నగర్ నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీలకు ఉన్న రహదారిని ఐదేళ్ల క్రితం మూసేశారు. దీంతో ఒకటిన్నన కిలోమీటరు దూరంలోనే ఉన్న ఆయా కాలనీలకు చేరుకోవాలంటే ప్రస్తుతం సుచిత్ర జంక్షన్ నుంచి లేదా, బాలానగర్-ఐడీపీఎల్ -చింతల్ మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చర్యల వల్ల కంటోన్మెంట్‌కు కుత్బుల్లాపూర్‌కు ఉన్న లింక్ దాదాపుగా తెగిపోయింది. బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రహదారి ఆర్మీ ఈగల్ స్టాట్యూ నుంచి నేరుగా బాలాజీనగర్- భవన్స్ మార్గాలకు చేరేందుకు అనువుగా ఉండేది. మూడేళ్ల క్రితం ఈ రోడ్డు మూతతో అల్వాల్- లోతుకుంట- మల్లారెడ్డినగర్- రాష్ట్రపతినిలయం మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. రామకృష్ణాపురం ఫ్లైఓవర్ నుంచి తిరుమలగిరి చౌరస్తాకు వచ్చే మార్గంలోని కుడివైపు రోడ్లలోని పలు సబ్ రోడ్లను దశలవారీగా మూసేస్తూ వచ్చారు. తాజాగా ఈ మార్గంలో ఎడమవైపు (కేంద్రీయ విద్యాలయం చౌరస్తా నుంచి ఏఓసీకి వెళ్లే రోడ్డు) మార్గాన్ని మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం నుంచి, సికింద్రాబాద్ క్లబ్/ పికెట్ నుంచి ఈస్మారేడ్పల్లి/ ఎస్పీరోడ్డు నుంచి, సఫిల్‌గూడ రైల్వే క్రాసింగ్ నుంచి ఏఓసీకి దారి తీసే మార్గాలన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. -
కోర్టుపై నుంచి దూకిన యువకుడు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు సోమవారం కోర్టు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. కాళ్లు, చేతులు విరగడంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన లావుడ్యా మోహన్ హన్మకొండలోని దీనదయాల్నగర్లో నివాసముంటున్నాడు. అతడు నిట్ సమీపంలోని దేవినగర్ కాలనీలోని బీసీ సామాజికవర్గానికి చెందిన యువతిని 2013 సెప్టెంబర్‌లో కులాంతర వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న తర్వాత వరంగల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి వేడుకలు చేస్తామని నమ్మించి అమ్మాయిని తీసుకెళ్లారు. అయితే తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సమయంలోనే మోహన్‌పై ఆమె తల్లిదండ్రులు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. ఈ కేసులో అతడు మొదటి అదనపు జిల్లాకోర్టులో ముందస్తు బెయిల్ తీసకున్నాడు. అమ్మాయిని ఎంతకీ పంపించకపోవడంతో అతడు కొన్నాళ్ల క్రితం అత్తగారింటి వద్ద ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. అతడు భార్యను కాపురానికి పంపించాలని కోరుతూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థను కూడా ఆశ్రయించాడు. ఈ క్రమంలో మోహన్‌పై వాళ్లింటి వద్దనే గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. దీంతో నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మోహన్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేయాలని సుబేదారి పోలీసులను కోర్టు అదేశించింది. భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు చట్టబద్ధంగా చేయాల్సిన చర్యలు ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో కలత చెందిన మోహన్ సోమవారం సాయంత్రం ఫ్యామిలీ కోర్టు భవనంపై నుంచి దూకాడు. రెండో అంతస్తు నుంచి దూకడంతో కాళ్లు విరిగి, నడుముకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్నవారు అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.