ఆత్మాహుతి దాడి.. 26మంది మృతి | 26 killed in twin suicide bombings in Syria | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడి.. 26మంది మృతి

Published Tue, Sep 15 2015 8:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

26 killed in twin suicide bombings in Syria

డెమాస్కస్: యుద్ధ వాతావరణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయారు. వారు ఆత్మాహుతి దాడి జరపడంతో 26మంది ప్రాణాలు కోల్పోయారు. 70మంది గాయాలపాలయ్యారు. ఓ పాఠశాలకు సమీపంలో దాడులు జరపడంతో చనిపోయినవారిలో ఎక్కువమంది పాఠశాల విద్యార్థులు మహిళలు ఉన్నారు.

ఖాష్మాన్ అనే ప్రాంతంలో ఓ వాహనం నిండా బాంబులు వేసుకొని వచ్చిన ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చుకున్నాడు. దీంతో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. మరోచోట వాటర్ ట్యాంక్లో బాంబులతో వచ్చిన సాయుధుడు తొలుత కాల్పులు జరిపి తదనంతరం తనను తాను పేల్చేసుకున్నాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దురాఘతానికి పాల్పడినట్లు బలగాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement