ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి | 10 people were killed and 17 others wounded on Thursday by a suicide bombing in the Kafarsuseh | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి

Published Fri, Jan 13 2017 9:51 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి - Sakshi

ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి

డమాస్కస్‌: సిరియా రాజధాని డమాస్కస్‌ సమీపంలోని కఫర్‌సుసెలో గురువారం ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి.  ఈ దాడుల్లో 10 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ముహఫజ స్పోర్ట్స్‌ క్లబ్‌ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. పేలుడు అనంతరం రక్తపు చారికలతో అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి.

ఇదిలా ఉండగా డమాస్కస్‌ పశ్చిమ ప్రాంతం మెజెహ్‌లోని తమ ఎయిర్‌బేస్‌ను ఇజ్రాయిల్‌ వార్‌ప్లేన్స్‌ టార్గెట్‌గా చేసుకున్నాయని సిరియన్‌ ఆర్మీ శుక్రవారం ఆరోపించింది. ఎయిర్‌పోర్ట్‌ పరిధిలో పడిన పలు బాంబులు ఇజ్రాయిల్‌కు చెందినవే అని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement