రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దేశాధినేతలైన బైడెన్, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్‌లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్ అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.
హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment