fought
-
ఖమ్మం.. చారిత్రక గుమ్మం!
ఖమ్మం మయూరి సెంటర్: చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఖమ్మం జిల్లా.. వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూభాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలోని స్తంభాద్రి నుంచే మండపాలు, స్తంభాలకు కావల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు.. నగరంలోని నృసింహాద్రి అని పిలిచే నారసింహాలయం నుంచి వచి్చనట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతి స్తంభం అని.. అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచి్చనట్లు మరో వాదన ఉంది. నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలుతీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వా«దీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలున్నాయి. పశి్చమం వైపు దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపు రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోట ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. అభివృద్ధి వైపు అడుగులు.. ఖమ్మం కోటగా కీర్తి గడించిన ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కోటలోని జాఫర్‌టౌలి (బావి)ని ఆధునికీకరించారు. కోటపైకి పర్యాటకులు వెళ్లేందుకు రోప్ వే నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. రోప్‌వే నిర్మాణం జరిగితే ఖిల్లాను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, దీనిద్వారా కోటకు ఉన్న ఘనమైన చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
వందేళ్ల యుద్ధ సైనికుని వివాహం.. హాజరైన బైడెన్
రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దేశాధినేతలైన బైడెన్, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్ అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. -
బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమరవీరులు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరేకాదు షాజహాన్‌పూర్ చీమలు కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు యుద్ధం చేసి, విజయం సాధించాయి. ఈ ఘటన ‘1857 సిపాయిల తిరుగుబాటు’ సమయంలో జరిగింది. చీమల దండు జరిపిన దాడి కారణంగా బ్రిటీషర్లు షాజహాన్పూర్లో స్థాపించిన కేరు అండ్ కంపెనీని మూసివేయవలసి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా రచించిన ‘షాజహాన్‌పూర్ కా ఇతిహాస్ 1857’ పుస్తకంలోని వివరాల ప్రకారం బ్రిటీష్ వారు 1805లో కాన్పూర్‌లో కేరు అండ్ కంపెనీని తొలిసారిగా స్థాపించారు. దానిలో క్రిస్టల్ షుగర్, స్పిరిట్, రమ్ తయారు చేసేవారు. ఈ ఉత్పత్తులను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కాన్పూర్‌లో ఈ వ్యాపారం విజయవంతం కావడంతో బ్రిటీషర్లు 1811లో షాజహాన్‌పూర్‌లోని రామగంగా సమీపంలో మరో యూనిట్ ఏర్పాటు చేశారు. 1834లో బ్రిటీషర్లు.. రౌసర్ కోఠి వద్ద మరో యూనిట్‌ను స్థాపించారు. షాజహాన్‌పూర్‌లోని రౌజర్ కోఠి ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో చెరకు సాగయ్యేది. దీనికితోడు గర్రా, ఖన్నాత్ నదుల నుండి వాణిజ్యానికి నౌకాయాన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండేవి. 1857లో విప్లవ తిరుగుబాటు సమయంలో విప్లవకారులు ఫ్యాక్టరీని కొల్లగొట్టి, తగలబెట్టారని డాక్టర్ వికాస్ ఖురానా తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ యజమాని జీబీ కెరు ఇక్కడ నుండి తప్పించుకొని మిథౌలీ రాజు సహాయంతో లక్నోకు తరలివెళ్లిపోయాడు. అక్కడ అతను హత్యకు గురయ్యాడు. తిరుగుబాటు ఆందోళనల తర్వాత ఫ్యాక్టరీ పునఃప్రారంభించారు. వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. అయితే ఆ సమయంలో చీమలు ఆ కంపెనీపై దాడి చేశాయని చరిత్రకారుడు డాక్టర్ వికాస్ ఖురానా, సాహితీవేత్త సుశీల్ తెలిపారు చెప్పారు. కాగా చీమలను తరిమికొట్టేందుకు కంపెనీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. అయితే ఆ ప్రయత్నాలు వృథాగా మారాయి. చివరికి బ్రిటీషర్లు కెరుగంజ్లో కంపెనీ పనులను నిలిపివేయవలసి వచ్చింది. కాగా కంపెనీ ఇక్కడ భారీ మార్కెట్‌ను సృష్టించిందని డాక్టర్ ఖురానా తెలిపారు. నేటికీ షాజహాన్‌పూర్‌లోని కెరుగంజ్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి, వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
ఆమె భారత యువరాణి.. బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు కోసం ఎందుకు పోరాడారు?
భారతదేశానికి చెందిన ఒక యువరాణి మహిళల ఓటు హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె కారణంగానే బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ ఉద్యమం కోసం ఆమె తన రాజ కీయ హోదాను కూడా పక్కన పెట్టారు. అయితే కాలక్రమేణా ఆమె చరిత్ర మరుగున పడింది. ఇంతకీ ఆ భారతీయ యువరాణి ఎవరు? ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు గురించి ఎందుకు పోరాడవలసి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యువరాణి మరెవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా దులీప్ సింగ్. ఈమె బ్రిటన్‌లోని నార్ఫోక్-సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్లో పెరిగారు. భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ పాలకులు 1840లో మహారాజా దులీప్ సింగ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతనిని బ్రిటన్‌కు తరలించారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి దులీప్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత తనకు అందిన పరిహారపు సొమ్ముతో ఆయన ఎల్వెడీన్ హాల్‌ను కొనుగోలు చేశారు. అతను తన పిల్లలతో సహా అక్కడే ఉండేవారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, యువరాణి సోఫియా 1900లలో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ నేపధ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజకుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లో అపార్ట్మెంట్ అప్పగించారు. సోఫియా దులీప్ సింగ్‌ను ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ అని పిలుస్తారు. ఈ కారణంతోనే ప్రిన్సెస్ సోఫియా బ్రిటీష్ మహిళల మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్‌లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని భావించారు. ప్రిన్సెస్ సోఫియా ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్‌లో సభ్యురాలు. ఈ లీగ్ మహిళల ఓటు హక్కు కోసం ‘నోట్ నో టాక్స్’ నినాదం అందుకున్నారు. యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మహిళా ఓటు హక్కు కార్యకర్త ఎమ్మెలిన్ పాన్‌ఖర్స్ట్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరిగిన రోజున ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా నినాదాలు చేయడం లేదా నిరసనలలో పాల్గొనడం మాత్రమే కాకుండా, హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్‌లోని తన ఇంటి వెలుపల మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను విక్రయించారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగా బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు. 1876లో జన్మించిన ఆమె 1903లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఇది ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ సాగించిన పోరాట పటిమకు ఆమె ప్రభావితురాలయ్యారు. ఇదే ఆమెను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రేరేపణ కల్పించింది. ఆమె బ్రిటన్‌లో మహిళల ఓటుహక్కు పోరాటం కొనసాగించేందుకు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె మహిళా ఓటుహక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె నిరసనలలో పాల్గొంటున్న కారణంగా ఇంగ్లండ్‌లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె దానిని పట్టించుకోలేదు. ప్రిన్సెస్ సోఫియా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాలుపంచుకున్నారు. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సహాయం అందించారు. ఆమె బ్లూ ఫ్లాక్ అవార్డును అందుకున్నారు. యువరాణి సోఫియా 1948లో తన 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు? -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): మండలంలోని తంగిరాలపల్లె పంచాయతీ తమ్మడపల్లెలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో మంగళవారం సాయంత్రం దాడి చేశారు. వెంటపడి మరీ కర్రలు, రాళ్లతో కొట్టడంతో నాగం పెద్దరవారం తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. కుర్ర రమణమ్మ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే పెద్దరవారాన్ని ఆటోలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తరఫున ఎన్నికల అధికారుల అనుమతితో మండలంలో అటోకు మైకులు, ఫ్లెక్సీలు కట్టుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ కాట్రావత్ వెంకటేశ్వరనాయక్ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకొని తమ ఊరిలో ప్రచారం చేసేందుకు వీల్లేలేదని, నీవు ఏ ఊరు వాడివని గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఫ్లెక్సీ చింపి, మైకును పగలకొట్టి కర్రతో కొట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు ఆటో చుట్టుముట్టడంతో ఆయన భయంతో కేకలు వేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆటోను ఎందుకు అపుతున్నారని, డ్రైవర్‌ను కొట్టడం దేనికని ప్రశ్నిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వాదులాటకు దిగారు. ఇరువర్గాల మధ్య ఒక్కసారి మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. టీడీపీకి చెందిన నక్కా శ్రీనివాసులు, పిన్నిక వెంకట సుబ్బయ్య, కన్నెబోయిన రమణయ్య, కుర్రా శ్రీను, కుర్రా గంగయ్య, పిన్నిక వెంకటేశ్వర్లు, నాగశేషయ్య, నక్కా కోటయ్య, తిరుమలయ్య, చిన్న కాశయ్యతో పాటు మరో కొంతమంది కలిసి రాళ్లు, కర్రలతో కొట్టేందుకు వచ్చారని నాగం పెద్దరవారం, కుర్ర రమణమ్మ, కుర్రా గంగయ్య, కుర్రా ఏడుకొండలు, గుమ్మా గిరిప్రసాద్, కన్నెబోయిన ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి వెళ్లి రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. టీడీపీ కార్యకర్తలు వెంటపడి నాగం పెద్దరవారాన్ని కర్రలు, రాళ్లతో కొట్టడంతో తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆటోలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుర్ర రమణమ్మకు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. నక్కా శ్రీనివాసులు, కన్నెబోయిన రమణయ్యలు దరిమడుగు గ్రామం వరకు కొట్టేందుకు వెంబడించారని డ్రైవర్ వెంకటేశ్వరనాయక్ చెప్పారు. భయందోళన గురై వారిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే ఎస్ఐ ప్రభాకర్‌రావుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ధర్మ పోరాటం చేస్తున్న గిరిజనులు
భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కోవడం అన్యాయం అసంఘటిత కార్మికులకు తీరని అన్యాయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వాగొడ్డుగూడెం(అశ్వారావుపేట రూరల్): పోడుసాగు విషయంలో గిరిజనులు, పేదలు చేస్తున్నది.. ధర్మ పోరాటమని, రాష్ట్రప్రభుత్వం చేస్తున్నది.. ఆ ధర్మమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మండలంలోని వాగొడ్డుగూడెం పోడుభూముల్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు పంపిణీ చేయకపోగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. గిరిజనులకు 10 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వాలని నిబంధనలున్నాయని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 2005 కంటే ముందుగానే సాగులో ఉన్న భూములను లాక్లోవడం మానుకోవాలన్నారు. దీనిపై గిరిజనులు చేస్తున్న ధర పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. పట్టాలు ఉన్న ఐదు లక్షల ఎకరాలను అన్యాయంగా గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అనంతరం పోడు కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చిన 120 మంది గిరిజనులను పరామర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, నాయకులు ఏజే రమేష్, ఐలయ్య, డివిజన్ నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, ధర్ముల సీతారాములు, చిరంజీవి, ప్రసాదు, కుంజా మురళీలున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా : సున్నం రాజయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం పోడు భూముల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. పోలీస్, అటవీ అధికారులు వ్యవహారిస్తున్న తీరు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తానన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పోడు జోలికి వెళ్లమని చెప్పిన ప్రభుత్వ తీరును ఎండగడతానన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో ముగ్గురు మంత్రులు కూడా పోడు జోలికి వెళ్లవద్దని అధికారులకు చెప్పి.. దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. -
'మృగాళ్ళ' ముందు మార్షల్ ఆర్ట్స్ విఫలం!
నోయిడాః మానవత్వం లేని మృగాళ్ళ ముందు మార్షల్ ఆర్ట్స్ కూడా పనికి రావడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా... మహిళల్లో అవగాహన పెరిగినా రాక్షసత్వానికి బలవంతులూ బలైపోతున్నారు. రాజధాని నగరంలో సంచలనం రేపిన నిర్భయ ఘటన అనంతరం.. అటువంటి ఘటనలే పునరావృతం అవుతున్నా కఠిన చట్టాలు మాత్రం అమల్లోకి రావడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ లో బాధితురాలు 13 ఏళ్ళ మైనర్ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో 30 నిమిషాలపాటు దుండగులతో పోరాడి చివరికి దారుణానికి బలైన ఘటన.. అందర్నీ ఆలోచింపజేస్తోంది. దేశంలో గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ కాన్పూర్ జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా.. అటుగా ప్రయాణిస్తున్న కుటుంబంపై దాడిచేసి, ఓ మహిళ సహా ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలసిందే. అయితే బాధిత 13 ఏళ్ళ బాలిక మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది ఉండటంతో సుమారు అరగంట పాటు దుండగులతో పోరాడినట్లు తెలుస్తోంది. అయితేనేం చివరికి సామూహిక దాడిని ఎదుర్కోలేక, మానవ మృగాల పైశాచికత్వానికి బలవ్వాల్సిన దుస్థితి ఎదురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నోయిడానుంచీ షాజహాన్‌పూర్ కు కారులో వెడుతున్న కుటుంబాన్ని అడ్డగించిన ఆరుగురు సభ్యుల దోపిడీ దొంగల ముఠా... కారులోని ఇతర కుటుంబ సభ్యులను తాళ్ళతో కట్టి, వాహనంలోని మహిళను, 13 ఏళ్ళ కుమార్తెను బయటకు లాగి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతేకాదు వారివద్ద ఉన్న నగలు, నగదు, సెల్ ఫోన్లు సైతం దోచుకెళ్ళారు. అయితే తమ కుమార్తె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిందని, దుండగులను ఎదుర్కొనేందుకు సుమారు అరగంటపాటు తీవ్రమైన పోరాటం జరిపిందని బాధితురాలి తండ్రి తెలిపారు. చివరికి ఆమెను ఎదుర్కోలేని దుండగులు.. తనపైనా, అన్నగారిపైనా కాల్పులకు పాల్పడ్డంతో వారి క్షేమాన్ని కోరి... తమ బిడ్డ దుండగులకు లొంగిపోయినట్లు ఆయన వివరించారు. ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా వారిని బాధితులు గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి దుర్ఘటనలు ఉత్తరప్రదేశ్ లోని శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. కుటుంబ సభ్యులతో వెడుతున్న మహిళలకే భద్రత లేకపోతే ఇంకెవరికుంటాయంటూ ప్రశ్నిస్తున్నాయి.