ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌లో 2017లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికా, యూరప్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరగ్గా భారత్‌లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2016 సంవత్సరాంతంలో భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య 1,88,000లు కాగా 2017 సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 1,80,000కు పడిపోయింది. ఒక్క ఏడాదిలో 8000 మంది ఉద్యోగులు సంస్థను వీడారు.
కృత్రిమ మేథ, ఆటోమేషన్ ఫలితంగా భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు.మరోవైపు ఇదే కాలంలో కాగ్నిజెంట్ అమెరికా ఉద్యోగుల సంఖ్య 2900 పెరిగి 50,400కు పెరగ్గా, యూరప్ ఉద్యోగుల సంఖ్య 2300 పెరిగింది. భారత్‌లో హైరింగ్ ఊపందుకుంటున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో నియామకాలు పెద్ద ఎత్తున సాగుతుంటే భారత్‌లో కంపెనీలు హైరింగ్‌పై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి వృద్ధికి కేవలం టెక్నాలజీనే కాకుండా మిగతా రంగాలపై దృష్టిసారించాలని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment