headcount
-
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
ఎస్బీఐలో 10 వేల మంది కొత్త ఉద్యోగులు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై దృష్టి పెట్టింది."మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే జనరల్ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ఇటీవల ఎంట్రీ లెవల్తోపాటు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ అర్హుల నియామకాలను ప్రకటించాం" అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వార్తా సంస్థ పీటీఐకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు."మా టెక్నాలజీ రిక్రూట్మెంట్ డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్వర్క్ ఆపరేటర్లు మొదలైన ప్రత్యేక ఉద్యోగాలపై ఉంది. టెక్నాలజీ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. కాబట్టి, మొత్తంగా ప్రస్తుత సంవత్సరంలో 8,000 నుంచి 10,000 మంది అవసరం మాకుంది. ప్రత్యేక విభాగంతోపాటు సాధారణ విభాగంలోనూ ఉద్యోగుల చేరిక ఉంటుంది" అని పేర్కొన్నారు.ఎస్బీఐలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296. ఇందులో 1,10,116 మంది ఆఫీసర్లు. ఇక బ్యాంక్ నెట్వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్బీఐ యోచిస్తోందని శెట్టి చెప్పారు. ఎస్బీఐ 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. ఇవి కాకుండా 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కరస్పాండెంట్ కేంద్రాలు ఉన్నాయి. -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్‌గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్‌పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్‌కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్‌గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్‌పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్‌ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా తగ్గిన హెచ్‌సీఎల్ ఉద్యోగుల సంఖ్య
జూన్ 30, 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్య 8,080 మంది తగ్గినట్లు సమాచారం. కంపెనీ క్యూ 1 ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో 2,19,401కి చేరింది.టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. హెచ్‌సీఎల్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతోంది. గతంలో హెచ్‌సీఎల్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే కొంత ఎక్కువగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి.గురువారం టీసీఎస్ ఫలితాలను వెల్లడించిన సమయంలో.. ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5452 పెరిగింది. దేంతో టీసీఎస్ హెడ్‌కౌంట్ 6,06,998కి చేరింది. ఫ్రెషర్స్ నియమాల విషయానికి వస్తే.. గత త్రైమాసికంలో హెచ్‌సీఎల్ కొత్త నియమాలకు కేవలం 1078 మాత్రమే. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 3096గా ఉండేది. దీన్ని బట్టి చూస్తే కొత్త ఉద్యోగుల నియమాలను కూడా అంతంతమాత్రమే అని తెలుస్తోంది.జూలై 11న జరిగిన క్యూ1 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ.. చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో స్టేట్ స్ట్రీట్‌తో జరిగిన డివెస్టిచర్ను పరిగణనలోకి తీసుకుని హెడ్‌కౌంట్‌ను పరిశీలించాలి. సంస్థ ఎదుర్కొన్న కొన్ని అనిశ్చితుల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, నియమాల మీద ద్రుష్టి సారిస్తామని ఆయన అన్నారు. -
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్‌లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు.. క్యాంపస్ నియామకాలు డౌటేనా?
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య భారగా తగ్గింది. 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంటే మూడు నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,680 పడిపోయిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 జూన్ చివరి నాటికి 6.15 లక్షలు ఉండగా తాజా క్షీణతతో డిసెంబర్ చివరి నాటికి 6.03 లక్షలకు తగ్గింది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎప్పటిలాగా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని సైతం కంపెనీ స్పష్టం చేయడం లేదు. బలవంతపు తొలగింపుల కంటే కూడా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టడం వల్లే హెడ్‌కౌంట్ తగ్గినట్లు భావిస్తున్నారు. కంపెనీ వదిలివెళ్లిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టనప్పుడు కూడా హెడ్‌కౌంట్ తగ్గుతుంది. తాము మంచి సంఖ్యలోనే ఉద్యోగులను, ట్రైనీలను మార్కెట్ నుంచి నియమించుకున్నామని, నియామకం ఎల్లప్పుడూ అట్రిషన్కి అనుగుణంగా ఉండకపోవచ్చని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ చెబుతున్నారు. అయితే దీనిని ప్రతికూలంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. భవిష్యత్ త్రైమాసికాల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించవచ్చని ఆయన హింట్ ఇచ్చారు. క్యాంపస్ నియామకాలు డౌటే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే లక్ష్యానికి టీసీఎస్ ఇప్పటికీ కట్టుబడి ఉందా అంటే మిలింద్ లక్కడ్ స్పష్టత ఇవ్వలేదు. 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సంఖ్య లేదు కానీ క్యాంపస్ నియామకాలలో ముందుంటామని లక్కడ్ చెప్పారు. నేర్చుకునే సామర్థ్యం, జిజ్ఞాస, ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. -
టీసీఎస్‌లో తగ్గిపోయిన ఉద్యోగులు! కారణం ఇదే..
దేశంలో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) లో గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య (హెడ్‌కౌంట్) 6,333 పడిపోయింది. ఇది క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7,186 తగ్గింది. ప్రస్తుతం టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985. ఫ్రెషర్లపై దృష్టి దీనిపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ కంపెనీ కొత్త టాలెంట్‌పై ఎక్కువగా ఖర్చు పెడుతోందని, దానికి తగిన ఫలితం లభిస్తోందని చెప్పారు. ‘కంపెనీలో అట్రిషన్ తగ్గుతున్నట్లు చూశాం. మా నియామకాల్లో కీలక మార్పులు చేస్తున్నాం. ఫలితంగా మా మొత్తం నియామకం ఈ త్రైమాసికంలో అట్రిషన్ కంటే తక్కువగా ఉంది. దీని అర్థం మానవ వనరుల కోసం ఖర్చు పెడుతున్నాం. కొంచెం ఆలస్యమైనా మా అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ ఫ్రెషర్ల ఆన్‌బోర్డ్‌ను కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా జూన్ త్రైమాసికంలో ఐటీ అట్రిషన్ 17.8 శాతం నుంచి 14.9 శాతానికి తగ్గింది. (గూగుల్, యాపిల్‌పై సీసీఐ విచారణ.. నివేదిక రాగానే చర్యలు!) టీసీఎస్ తన వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మందికి 100 శాతం వేరియబుల్ పే అందిస్తోంది. మిగిలినవారికి మాత్రం పనితీరు ఆధారంగా చెల్లిస్తోంది. ఆఫీస్ పాలసీ గురించి.. “మేము గత మూడు సంవత్సరాలలో చాలా మందిని నియమించుకున్నాం. వారంతా చాలా కాలం పాటు హైబ్రిడ్ లేదా వర్చువల్ రిమోట్ (మోడ్)లో పని చేస్తున్నారు. కొత్త వర్క్‌ఫోర్స్ కంపెనీలో ఇప్పటికే ఉన్న విస్తృత వర్క్‌ఫోర్స్‌తో ఏకీకృతం కావడానికి వారంతా ఆఫీస్‌కు రావాలని గట్టిగా నమ్ముతున్నాం. కొత్తవారు టీసీఎస్ విలువలను అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఇది ఏకైక మార్గం” అని మిలింద్ లక్కడ్ చెప్పారు. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాలకు రావడం ప్రారంభించారన్నారు. -
భారీగా ఉద్యోగులపై వేటు..ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!!
ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూం బెర్గ్ విడుదల చేసిన జులై రిపోర్ట్‌లో ఇంటెల్ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్, మార్కెటింగ్ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నో కామెంట్ ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్ గణాంకాలే కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్ ఓపెన్ కావడం, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల పీసీల వినియోగం తగ్గిపోయింది. చదవండి👉 'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! చైనా- ఉక్రెయిన్ వార్ సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ చైనాలో కోవిడ్-19 ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సప్లయి చైన్ సమస్యలు డిమాండ్‌పై ప్రభావంపై పడింది.అందుకే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఇంటెల్ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
టెక్ మహీంద్రలో 4వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర టెకీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే మూడు త్రైమాసికాల్లో సంస్థ ఉద్యోగులను పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టు చెప్పింది. దాదాపు నాలుగు వేలమంది కొత్త ఉద్యోగాలను అదనంగా జోడించుకోవాలని చూస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,800 మందిని నియమించు కున్నట్లు వెల్లడించింది. వచ్చే తొమ్మిది నెలలకాలంలో 4వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. జూన్ 2018 నాటికి కంపెనీలో 1,13,552 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య 72,462.. బీపీఓ విభాగంలో 34,700 మంది ఉద్యోగులు, సేల్స్‌లో 6,390 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్ ఆధారిత నియామకంపై మరింత దృష్టి పెట్టినట్టు టెక్ మహీంద్ర ప్రధాన ఆర్థిక అధికారి మనోజ్ భట్ తెలిపారు. -
టెకీలకు షాక్ : ఆ కంపెనీలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య
సాక్షి, చెన్నై : దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌లో 2017లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. అమెరికా, యూరప్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య పెరగ్గా భారత్‌లో తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2016 సంవత్సరాంతంలో భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య 1,88,000లు కాగా 2017 సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 1,80,000కు పడిపోయింది. ఒక్క ఏడాదిలో 8000 మంది ఉద్యోగులు సంస్థను వీడారు. కృత్రిమ మేథ, ఆటోమేషన్ ఫలితంగా భారత్‌లో కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు.మరోవైపు ఇదే కాలంలో కాగ్నిజెంట్ అమెరికా ఉద్యోగుల సంఖ్య 2900 పెరిగి 50,400కు పెరగ్గా, యూరప్ ఉద్యోగుల సంఖ్య 2300 పెరిగింది. భారత్‌లో హైరింగ్ ఊపందుకుంటున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో నియామకాలు పెద్ద ఎత్తున సాగుతుంటే భారత్‌లో కంపెనీలు హైరింగ్‌పై ఆచితూచి వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి వృద్ధికి కేవలం టెక్నాలజీనే కాకుండా మిగతా రంగాలపై దృష్టిసారించాలని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
కాగ్నిజెంట్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు
బెంగళూరు : ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు 4000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో తగ్గిపోయారు. మార్చి క్వార్టర్లో కాగ్నిజెంట్‌లో 261,200 మంది ఉద్యోగులుంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి ఈ సంఖ్య 256,800కు తగ్గిందని కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది. టాప్ దేశీయ ఐటీ అవుట్సోర్స్ కంపెనీల్లో కెల్లా, దీనిలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. కాగ్నిజెంట్ ప్రత్యర్థులు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా కంపెనీల్లో కూడా ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ ఈ మేర తగ్గడం దీనిలోనే. కాగ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. అయితే కాగ్నిజెంట్ తన రెవెన్యూ గైడెన్స్‌ను పెంచింది. గతంలో తక్కువగా అంచనావేసిన 8-10 శాతం వృద్ధిని, 9-10 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక మూడో క్వార్టర్లో వృద్ధి రేటు 1.6-3 శాతముంటుందని కాగ్నిజెంట్ అంచనావేస్తోంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ నికర లాభం 86 శాతం ఎగిసి ఈ క్వార్టర్లో 470 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభం 252 మిలియన్ డాలర్లు మాత్రమే. హెల్త్ కేర్ లాంటి వాటిలో గణనీయమైన వృద్ధిని సాధించడంతో కంపెనీ లాభాలు భారీగా ఎగిసినట్టు తెలిసింది. రెవెన్యూలు కూడా తొలి క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో 8.9 శాతం పెరిగి 3.67 బిలియన్ డాలర్లగా నమోదైనట్టు కాగ్నిజెంట్ తెలిపింది. రెండో క్వార్టర్లో బలమైన ఫలితాలను ప్రకటించామని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుకు 0.80 డాలర్ల లాభం చేకూరుతుందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇది 0.41 డాలర్లుగా మాత్రమే ఉందని కాగ్నిజెంట్ తెలిపింది. -
ట్రంప్ ఎఫెక్ట్: వారికి బంపర్ ఆఫర్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగులు సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్1బీ వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థానికంగా 8000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే మరో ఏడు సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయనుందట. ముఖ్యంగా బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి ఐటీ కంపెనీలకు జారుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫీ బాటలోనే కాగ్నిజెంట్ కూడా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగ్నిజెంట్ 2017సం.రంలో అమెరికాలో ఎనిమిదివేల మందిని కొత్తగా నియమించుకోనుంది. 2016 అమెరికాలో నాలుగువేలమంది ఐటి ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుత 20 కేంద్రాలకు తోడు యూఎస్‌లో మరో ఏడు డెలివరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది. మరోవైపు అమెరికాలో ఉంటున్న సుమారు పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మరో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది. రానున్న రెండేళ్లలో 10 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఇన్ఫీ ప్రకటించిన సంగతి విదితమే.