దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది.
హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది.
టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment