జూన్ 30, 2024తో ముగిసిన మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్య 8,080 మంది తగ్గినట్లు సమాచారం. కంపెనీ క్యూ 1 ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో 2,19,401కి చేరింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. హెచ్‌సీఎల్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతోంది. గతంలో హెచ్‌సీఎల్ కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే కొంత ఎక్కువగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి.
గురువారం టీసీఎస్ ఫలితాలను వెల్లడించిన సమయంలో.. ఉద్యోగుల సంఖ్యను కూడా ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5452 పెరిగింది. దేంతో టీసీఎస్ హెడ్‌కౌంట్ 6,06,998కి చేరింది. ఫ్రెషర్స్ నియమాల విషయానికి వస్తే.. గత త్రైమాసికంలో హెచ్‌సీఎల్ కొత్త నియమాలకు కేవలం 1078 మాత్రమే. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 3096గా ఉండేది. దీన్ని బట్టి చూస్తే కొత్త ఉద్యోగుల నియమాలను కూడా అంతంతమాత్రమే అని తెలుస్తోంది.
జూలై 11న జరిగిన క్యూ1 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ.. చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో స్టేట్ స్ట్రీట్‌తో జరిగిన డివెస్టిచర్‌ను పరిగణనలోకి తీసుకుని హెడ్‌కౌంట్‌ను పరిశీలించాలి. సంస్థ ఎదుర్కొన్న కొన్ని అనిశ్చితుల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, నియమాల మీద ద్రుష్టి సారిస్తామని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment