నా కళ్లు తెరిపించింది | Taapsee Pannu Says She's Been Dropped From Pati Patni Aur Woh remake | Sakshi
Sakshi News home page

నా కళ్లు తెరిపించింది

Jan 18 2019 1:01 AM | Updated on Apr 3 2019 6:34 PM

Taapsee Pannu Says She's Been Dropped From Pati Patni Aur Woh remake - Sakshi

తాప్సీ

2018 బాలీవుడ్‌ బాగా కలిసొచ్చింది తాప్సీకి. మూడు హిట్స్‌ అందుకోవడమే కాకుండా నటిగా అద్భుతమైన మార్కులు సంపాదించారామె. లేటెస్ట్‌గా యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో కలసి ‘పతీ పత్నీ అవుర్‌ వో’ అనే చిత్రం రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోయిన్‌ తాప్సీ కాదని చిత్రబృందం అనౌన్స్‌ చేయడంతో ఆమె షాక్‌ అయ్యారు. ఈ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం నా షెడ్యూల్‌ అంతా సెట్‌ చేసుకొని వాళ్లకు డేట్స్‌ ఇచ్చాను.

నేను హీరోయిన్‌ కాదని తెలియడంతో షాక్‌ అయ్యాను. దర్శక–నిర్మాతలను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఎంత క్లారిటీ తెచ్చుకుందామనుకున్నా జవాబు చెప్పకుండా మాట దాటేస్తున్నారు. ఈ విషయం కొంచెం ముందే తెలిసినా ఈ సినిమా కోసం సర్దుబాటు చేసిన డేట్స్‌ వేరే సినిమాలకైనా ఇచ్చేదాన్ని. ఈ సంఘటన వల్ల ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం అయింది. ఒక విధంగా చెప్పాలంటే జరిగిన సంఘటన నా కళ్లు తెరిపించింది’’ అని తాప్సీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement