భారతదేశాన్ని వ్యవసాయ దేశంగా పిలుస్తారు. వ్యవసాయం అంటే ప్రధానంగా పురుషులే కనిపిస్తారు. ఈ రంగంలో మహిళలను కూడా ప్రోత్సహించదానికి కోర్టెవా అగ్రిసైన్స్ ఓ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని ద్వారా 20230 నాటికి దేశంలో 20 లక్షలమంది మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.
కోర్టెవా అగ్రిసైన్స్ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా.. రైతులను, పరిశోధకులను, వ్యవస్థాపకులను తయారు చేయనుంది. ఇది కేవలం కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందడానికి మాత్రమే కాకుండా.. లింగ సమానత్వం, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.
గ్రామీణ జీవితానికి, వ్యవసాయానికి మహిళలు వెన్నెముక. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విద్య, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పొందడం ద్వారా మహిళలు జీవితాలను మెరుగు పరుస్తుందని.. కోర్టెవా అగ్రిసైన్స్ ప్రెసిడెంట్ 'సుబ్రొటో గీడ్' పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా సహాయపడుతుంది, వికసిత భారత్ వైవు అడుగుల వేస్తూ ఈ సామాజిక బాధ్యతను స్వీకరించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment