మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో వోల్వో బస్సులో మంటల చెలరేగాయి.
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో వోల్వో బస్సులో మంటల చెలరేగాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సులో మంటలు వచ్చాయి. అడ్డాకుల మండలం టోల్గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు రావటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.