
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అనంతపురంలో బుధవారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో పలువురు బీజేపీ నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ‘నాలుగేళ్లుగా బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అనేలా వ్యవహరించింది. విభజన హామీల అమలు విషయమై ఏమాత్రం పనిచేయలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అభినందనలు తెలిపారు. సన్మానం కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు’ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment