నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా.. | YSRCP MP Vijaya Sai Reddy Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా..

Published Wed, Feb 13 2019 9:47 AM | Last Updated on Wed, Feb 13 2019 4:19 PM

YSRCP MP Vijaya Sai Reddy Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు నాయుడుకి నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా ఫొటో సేషన్‌కు మాత్రమే పనికొచ్చిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రాబాబు అవినీతి, దొంగ దీక్షలపై బుధవారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘ఒక్క పూట భోజనం మానేస్తే నిమ్మ రసం తాగించి దీక్ష విరమణ ఏమిటి? కామెడీ కాకపోతే. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి విరమిస్తే జీర్ణ రసాలను తటస్థం చేసేందుకు లెమన్ జ్యూస్ ఇస్తారు. నల్లచొక్కా లాగే నిమ్మరసం కూడా ఫొటో సెషన్‌కు పనికొచ్చింది. వేషాల్లో సహజ నటుడు ఎంపీ శివప్రసాదును మించి పోయాడు.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ‘చంద్రబాబు..  ఆ నల్లచొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి’)

ప్రతిదీ కౌంట్‌ అవుతోంది బాబు..
‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు 2003లో ఐఎంజీ స్పోర్ట్స్‌ అనే బోగస్‌ సంస్థకు హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక ఎన్నికల ముందు రూ. 200 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్షలు చేయడం వింతేమి కాదు. ప్రతిదీ కౌంట్‌ అవుతోంది బాబు.. ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోక తప్పదు’ అని హెచ్చరించారు. ఇక పోలవరం విషయంలో బాబు చేసే మోసాలను జనాలు గమనిస్తున్నారని, మరోసారి వారు మోసపోలేరని పేర్కొన్నారు. ఇప్పటికి పోలవరం ఎడవ కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ఈ పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి హామీ కూడ ఇతర ఫేక్‌ హామీల్లాంటిదేనని విమర్శించారు. (చదవండి: టీడీపీ స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ)

ట్రెండింగ్‌ న్యూస్‌
అయ్యో.. లోకేష్‌ అది కూడా తెలియదా?
చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’
ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement