Telugudesham
-
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ ..
-
చంద్రబాబు దీక్ష.. బీజేపీ నేతల హౌజ్ అరెస్టులు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అనంతపురంలో బుధవారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఆటంకం కల్గిస్తారనే అనుమానంతో పలువురు బీజేపీ నేతల్ని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. ‘నాలుగేళ్లుగా బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అనేలా వ్యవహరించింది. విభజన హామీల అమలు విషయమై ఏమాత్రం పనిచేయలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అభినందనలు తెలిపారు. సన్మానం కూడా చేశారు. ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసిందంటూ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు’ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు. -
'కుట్రపూరితంగానే సెక్షన్-8 ప్రస్తావన'
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగానే సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో అప్పుడు చంద్రబాబు సెక్షన్-8 అంశాన్ని ప్రస్తావించగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతోందని ఆయన తెలిపారు. దొంగలు దొంగలు ఒకటైనట్టుగా కాంగ్రెస్, టీడీపీలు కలిశాయని ఆయన విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
హమ్మయ్య ... ఓ పనితప్పింది
గుండెల మీద భారమేదో తీరిపోయినట్లు ... హమ్మయ్యా అనుకుంటూ.. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు తెలంగాణ టీడీపీ నేతలు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతోంది.. వీటిపై పోరాటాలు చేస్తామని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉంది. ఏ ఆందోళన చేపట్టినా అది విజయవంతం అవుతుందన్న నమ్మకం, భరోసా 'తమ్ముళ్ల' కే లేదు. ప్రభుత్వం చీప్‌లిక్కర్‌పై వెనకడుగు వేయడంతో స్వీట్లు పంచి పండుగ జేసుకుంటున్న టీడీపీ నేతల రిలీఫ్‌కు ఓ కారణం ఉంది. చీప్‌లిక్కర్‌కు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 'తెలుగు మహిళ' ల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ప్రకటించారు. ఈ ధర్నాలు విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో ఈ ధర్నాల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తెలంగాణ నాయకత్వం బెంగ పెట్టుకుంది. కానీ, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్న విధంగా ఈ నెల 2వ తేదీన కేబినెట్ భేటీ అనంతరం సీఎం చీప్‌లిక్కర్ లేదు...ఏం లేదని తేల్చి చెప్పడంతో 'హమ్మయ్య.. ధర్నా బాధ తప్పింది.. ధర్నాలకు రమ్మని ఎవడ్ని బతిమిలాడాల్సిన పనిలేదు. ఇలాగైనా పరువు దక్కింది..'అంటూ సంబరపడిపోతున్నారు. -
దొడ్డి దారిన నారాయణ..నారాయణ!
ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడిగా ఉంటాయనేది పాత సామెతే అయినప్పటికి.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వ్యహారాలకు అతికినట్టు సరిపోతుంది. కొద్ది రోజుల క్రితం వరకు పార్టీలో సీనియర్ నేతలమని చంకలు గుద్దుకున్న యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమకు గొంతులో వెలక్కాయ పడినంత పని చేస్తోంది కార్పోరేట్ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ దూకుడు. ఎప్పుడొచ్చిందనేది కాదన్నా... అనే రీతిలో నారాయణ దూసుకుపోతున్న వైనం చూసి సీనియర్లైన ఇతర నేతలు ముక్కున వేలు వేసుకుంటే ఎవరైనా చూస్తే బాగుండదని మానుకుంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేయకుండానే చంద్రబాబు మంత్రివర్గంలో తనదైన హస్తలాఘవంతో పట్టణాభివృద్ది శాఖను సొంతం చేసుకున్న నారాయణ ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలను వెనక్కి నెట్టి తన మార్కు రాజకీయాన్ని రుచి చూపిస్తున్నారట. 'ఫండర్ కమ్ ఫండ్ రైజర్' ట్యాగ్ లైన్ తో బ్యాక్ డోర్ ద్వారా పార్టీలోకి దూరిన ఆయన వ్యవహరిస్తున్న అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందట. బియాస్ నది విషాదం, రాజధాని ఏర్పాటుపై నియమించిన కమిటికి ముఖ్యనేతగా పలు అవకాశాలను ఒంటి చేత్తో సొంతం చేసుకున్నారు. అలా ముందుకు పోతున్న నారాయణకు ఎమ్మెల్సీ చేయడానికి అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేత వీరభద్ర స్వామి రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీకి ఆగస్టు 21 తేదిన జరిగి ఉప ఎన్నికలో విధాన పరిషత్ కు ఎన్నికవ్వడం లాంఛనప్రాయమే. ఇలా దూసుకుపోతున్న నేతను చూసి చేసేది ఏమి లేక సీనియర్ నేతలు నారాయణ..నారాయణ అని మూసుకుంటున్నారట. -
టీడీపీలోకి 8 మంది ఎమ్మెల్సీలు, చంద్రబాబుతో భేటి!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలోకి 8 మంది కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్సీలు చేరేందుకు రంగం సిద్ధమైంది. లేక్ వ్యూ అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పదిమంది కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్సీలు కలిశారు. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీలలో గాదె శ్రీనివాసులనాయుడు, చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, బచ్చల పుల్లయ్య, ఇందిరా, శివకుమారి, వి.నారాయణరెడ్డి, షేక్ హుస్సేన్, రెడ్డప్పరెడ్డి, ఐలాపురం వెంకయ్యలున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీడీపీకి కేవలం ఏడుగురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అయితే శాసన మండలి అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు 8 మంది ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రచించారు. -
కదిరిలో టీడీపీకి షాక్
కదిరి: టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయలక్ష్మి పార్టీకి రాజీనామా సమర్పించారు. దాంతో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో తెలుగుదేశం పార్టీకి విజయలక్ష్మీ గుడ్ బై చెప్పడం పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురి చేసింది. టీడీపీకి రాజీనామా చేసిన విజయలక్ష్మీ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు, జిల్లా నాయకుల వ్యవహారంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మీ పార్టీకి రాజీనామా చేశారు. సీమాంధ్ర అభివృద్దికి, పేద ప్రజల సంక్షేమం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విజయలక్ష్మి అన్నారు. -
బాలకృష్ణ పోటీ చేస్తానంటే కోరిన సీటును ఇస్తా!
బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి డిమాండ్‌పై బాబు స్పందన నేను సీమాంధ్ర నుంచే పోటీచేస్తా.. లేకపోతే ప్రజలు డీలాపడతారు నేను 1999 వరకూ స్వయంగా నిర్ణయాలు తీసుకునేవాడ్ని.. ఆ తర్వాత 2009 వరకూ చెప్పుడు మాటలు విని విఫలమయ్యా సాక్షి, హైదరాబాద్: ‘‘నీకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పది మంది వచ్చి కోరతారు.. ఇస్తామా ఏంటి?’’ - సినీ నటుడు, తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్న విషయంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందన ఇది. బాలకృష్ణ పోటీ చేస్తానంటే ఆయన కోరిన సీటును ఇస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే.. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకు కేటాయించటంపై తాను ఇపుడు ఏమీ మాట్లాడనన్నారు. చంద్రబాబు మంగళ వారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు పార్టీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పారు. తాను సీమాంధ్ర ప్రాంతం నుంచి పోటీచేస్తానని.. తాను అక్కడి నుంచి పోటీ చేయకపోతే ప్రజలు డీలా పడిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు. అక్కడా తనను లేకుండా చేయటంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహకరించాలనే ఉద్దేశంతోనే.. టీడీపీ సీమాంధ్రలో బీసీ సీఎం నినాదం ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్తో అనుబంధం ఉన్న ఉద్యోగులకే తనపట్ల వ్యతి రేకత ఉందని బాబు వ్యాఖ్యానించారు. తాను 1999 వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే వాడినని, ఆ తరువాత 2009 వరకూ పలువురు చెప్పిన మాటలు వినటంతో పాటు మొహమాటాలకు పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటంతో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశమవుతుందన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లోనే ఇతర పార్టీల నుంచి నేతలు వస్తున్నారని, దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) పద్ధతి ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేస్తామని అన్నా రు. తొలుత పార్టీ కార్యకర్తలు, ఆ తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటుకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు పంపి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, వీరు ఎవ్వరూ వద్దనుకుంటే మరొకరి పేరు సూచించాలని కోరతామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తామన్నారు. ఇదిలావుంటే.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు బుధవారం టీడీపీలో చేరనున్నారు. వెన్నుపోటు భయమా?: చంద్రబాబు విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఈ సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాబట్టేది... బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే 1995లో ఎన్టీఆర్‌కు మీరు ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో అలా మీకు ఆయన వెన్నుపోటు పొడుస్తారని భయపడుతున్నారా? ఒకప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉందంటున్న మీరు.. ఆ తరువాత మొహమాటాలకు ఎందుకు పోవాల్సి వచ్చింది? తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి న మీకు ఇక్కడే ఓటు హక్కుంది. తెలంగాణనుంచి పోటీకి ఎందుకు జంకుతున్నారు?