కదిరిలో టీడీపీకి షాక్
Published Sun, Apr 27 2014 12:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
కదిరి: టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి విజయలక్ష్మి పార్టీకి రాజీనామా సమర్పించారు. దాంతో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది.
ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో తెలుగుదేశం పార్టీకి విజయలక్ష్మీ గుడ్ బై చెప్పడం పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురి చేసింది. టీడీపీకి రాజీనామా చేసిన విజయలక్ష్మీ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటన చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరు, జిల్లా నాయకుల వ్యవహారంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మీ పార్టీకి రాజీనామా చేశారు. సీమాంధ్ర అభివృద్దికి, పేద ప్రజల సంక్షేమం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విజయలక్ష్మి అన్నారు.
Advertisement
Advertisement