కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిం చాలని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) పీడీ ఇచ్చి న ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూ నియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ.. ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని ఐకేపీ పీడీ ఉత్తర్వులు జారీ చేశారని, డిసెంబర్‌లోగా కొత్త వారిని నియమించాలని పేర్కొన్నారని తె లిపారు.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో ఉత్తర్వులు ప్రవేశపెట్టి 12 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం సమంజసం కాదన్నారు. జిల్లాలో 6,750 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని, కోడిగుడ్లకు, అరటిపండ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలోపే బిల్లులు అందేలా చూడాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వంటషెడ్లు, మంచినీరు, గంజులు, గ్యాస్‌పొయ్యి అందించాలని డిమాం డ్ చేశారు. వంట సరుకులను ప్రభుత్వమే సరఫ రా చేయాలని, ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోనవ్వ, జిల్లా అధ్యక్షురాలు భారతీబాయి, ఉపాధ్యక్షురాలు రూప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.
పలువురి మద్దతు..
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మధ్యాహ్న భో జన కార్మికులకు పలువురు నాయకులు మ ద్ద తు తెలిపారు. టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షు డు లోకా భూమారెడ్డి, టీడీపీ నాయకులు యూ నిస్ అక్బానీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు నారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
కదంతొక్కిన ‘మధ్యాహ్న’ కార్మికులు
Published Tue, Jan 7 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement