Midday Meal Workers
-
‘కడుపు’పై కొట్టారు.. చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన
ఎన్నికల ముందు..‘వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువులతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం.. సంపద సృష్టించి పంచుతాం’ అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు.గద్దెనెక్కాక..మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. చేస్తున్న చిన్న చిన్నఉద్యోగాలను సైతం అన్యాయంగా ఊడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్ట గొడుతూ ‘తమ్ముళ్ల’ జేబులు నింపుకోమంటున్నారు. చివరకు స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్ర పరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి.. ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. ‘ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు’ అని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కాకినాడ జిల్లా కోటనందూరు (అల్లిపూడి) కేజీబీవీలో 2017 ఫిబ్రవరిలో నియమితులైన ఆయా కాళ్ల సత్యవతి(బీసీ)ని టీడీపీ నేతలు తొలగించారు. భర్త లేని ఆమె ఈ వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇదే కేజీబీవీలో రెండేళ్ల నుంచి వంటమనిషిగా పని చేస్తున్న దారా ఆదిలక్ష్మి(ఎస్సీ)ని సైతం గురువారం టీడీపీ నేతలు తొలగించి, తమ మనిషిని నియమించున్నారు. ఇలా ఒక్క చోట కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్లో చూసినా దుర్మార్గపు తొలగింపులు పరిపాటిగా మారాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వండే వంట మనుషులు, హెల్పర్లు, పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, నైట్ వాచ్మెన్ల వరకూ అందరినీ తొలగించాలంటూ టీడీపీ నేతలు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఆదేశిస్తున్నారు. ముడుపులు దండుకుంటున్న ‘పచ్చ’ నేతలుతొలగించిన వారి స్థానంలో నియమిస్తామంటూ ఆశావహుల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించకూడదంటూ అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. 10, 15 ఏళ్ల నుంచి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు.. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తొలగిస్తున్నారు. ఆ స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తాళలేక ఇప్పటికే 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అధికారులు తొలగించారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులు.. తొలగింపులు..ప్రభుత్వ బడుల్లో, కేజీబీవీల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజనం వంట కార్మీకులు, ఆయాలు, స్వీపర్లను బెదిరించి బలవంతంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో అన్ని విభాగాల్లోనూ పార్ట్‌టైమ్ సిబ్బంది సుమారు 20 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది 14 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. వీరి నియామకం రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు తొలగింపు మాత్రం స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట కొత్త వారి నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు డీఈవోలు, ఏపీడీలను ఆదేశించారు. ఇదే అదనుగా టీడీపీ వారు గతంలో నుంచి పని చేస్తున్న వారిని తొలగించి, తమ వారిని నియమించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపి ఆమోదించుకుంటున్నారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.అన్ని జిల్లాల్లోనూ కన్నీటి గాథలే..⇒ విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాణి మల్లమ్మదేవి, యుద్ధ స్తంభం, డివైడర్ల మధ్య ఉన్న మొక్కల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న 16 మంది చిరు ఉద్యోగులను తొలగించారు. గంట్యాడ మండలం కొటారుబిల్లి కేజీబీవీలో 2019 నుండి పని చేస్తున్న వంట మనిషి రొంగలి శ్రీలక్ష్మి, వాచ్మెన్ ఆర్.దుర్గను తొలగించి, తమ వాళ్లను పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని చుక్కవలస, ఏనుగువలస, వెదుళ్లవలస, మెరకముడిదాం మండలంలో భైరిపురం, గర్భాం, కొత్తవీధి, శ్యామయావలస రేషన్ డీలర్లను తొలగించారు. చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, మెరకముడిదాం మండలంలోని రామయవలస, గుర్ల, తెట్టంగి, పెనుబర్తి గ్రామాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించారు. చీపురుపల్లి మండలం పేరిపిలో వేధింపులు భరించలేక ఓ ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా చేశారు. గుర్ల మండలం శేషపుపేటలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించారు. ⇒ పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘంలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న సుమారు 50 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మీకులను (ఆప్కాస్) టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తొలగించారు. వీరు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును కలిసినా, వారిని ఉద్యోగాల్లో తీసుకునేందుకు అంగీకరించలేదు. ⇒ వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె, బాలాయపల్లె, గంగనపల్లె, ఓబులాపురం, ఉప్పలూరులో రేషన్ డీలర్లను తొలగించారు. కలసపాడు మండలంలో పలువురు డీలర్లను తొలగింపుకు రంగం సిద్ధం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పలువురు లబి్ధదారుల పింఛన్ తొలగించాలని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ బుక్‌కీపర్ కె శివనాగేంద్రమ్మను తొలగించారు. పెనమలూరు నియోజకవర్గంలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న నలుగుర్ని తొలగించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో 10 మంది వీవోఏలను, కందుల భవాని, మరో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, జయంతిపురం గ్రామంలో 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీదారులను తొలగించారు. ⇒ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు, మధ్యాహ్న¿ోజన కార్మీకులు, డ్వాక్రా రిసోర్స్ పర్సన్స్, డీఆర్డీఏలో ఉండే విలేజ్ ఆర్గనైజేషన్ అడ్మిని్రస్టేటర్లు ఇలా 67 మంది మహిళల ఉద్యోగాలు తొలగించారు. ఏలూరు నగరంలో అధికార పార్టీ వేధింపులు తాళలేక డ్వాక్రా రిసోర్స్ పర్సన్ పిల్లి విజయలక్ష్మి, ఉంగుటూరు మండలంలో పి.కనకదుర్గలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్నారు. ⇒ ప్రకాశం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 300 మంది వీవోఏలు, 370 మంది మధ్యాహ్న భోజన కార్మీకులు, 200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మంది మున్సిపల్ కార్మికులు, 50 మంది ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, 20 మంది పంచాయతీ కార్మీకులు, 15 మంది స్వచ్ఛభారత్ కార్మికులను తొలగించారు. 2.65 లక్షల వలంటీర్లకు ఉద్వాసనే..2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందించడానికి గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.పది వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి వారిని పక్కన పెట్టారు. దేవుడి సాక్షిగా తొలగింపు అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 48 మంది దినసరి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 80 మంది మధ్యాహ్న భోజనం కార్మీకులను తొలగించారు. పలువురు రేషన్ డీలర్లను తొలగించారు. మిగతా చోట్ల కూడా తొలగించి, వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి జాబితాలు తయారు చేశారు. ప్రైవేటు కంపెనీలనూ వదలడం లేదు. స్థానికంగా కంపెనీలు నడపాలంటే తమకు కప్పం కట్టడంతో పాటు తాము చెప్పిన వారినే కార్మీకులుగా పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. రణస్థలంలోని యూబీ బీర్ల కంపెనీలో ఏం జరిగిందో అందరూ చూశారు. కూటమికి అనుకూలంగా లేని కార్మీకులను తొలగించారు. మూలపేట పోర్టులోనూ అదే జరిగింది. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులంతా పోర్టు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేయడమే కాకుండా కార్యకలాపాలకు అడ్డు తగలడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఫోర్జరీ సంతకాలతో డీలర్ల తొలగింపుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం దాచూరులో పొదుపు గ్రూపులకు సంబంధించిన వీఓఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)గా పని చేస్తున్న మహిళను తొలగించి ఆ స్థానాన్ని రెండుగా విభజించి టీడీపీకి చెందిన కార్యకర్తలను నియమించాలని డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సిఫార్సు లేఖ పంపారు. కోవూరు నియోజకవర్గం గంగవరంలో రేషన్ షాపు డీలర్‌ను తొలగించి ఆ పోస్టును స్థానిక టీడీపీ నాయకుడు లక్ష్మీనరసారెడ్డి (బాబురెడ్డి) బేరంపెట్టి రూ.2 లక్షలకు వేరొక వ్యక్తికి కట్టబెట్టాడు. కందుకూరులో 16 రేషన్‌షాపు డీలర్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రపన్నారు. స్థానిక డిప్యూటీ తహసీల్ధారుతో కుమ్మక్కై డీలర్లకు తెలియకుండానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి రాజీనామా చేసినట్లు లేఖలు పంపడం సంచలనంగా మారింది. తాము రాజీనామాలు చేయలేదని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. కందుకూరు, కావలిలలో వైన్‌షాపులలో పనిచేసే 70 మంది సేల్స్మెన్లు, సూపర్వైజర్లను తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను పెట్టాలని స్థానిక టీడీపీ నేతలు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. కందుకూరులో 50 మందిని తొలగించి వారి స్థానంలో ఆ పోస్టులకు మామూళ్లు దండుకుని టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేలా జాబితా తయారైంది. మున్సిపాలీ్ట, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల్లో దాదాపు 15 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు ఆదేశాలిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు ఏకంగా స్థానిక టీడీపీ నేతలు ఉపాధి హామీ పనులను నిలిపివేశారు. కోవూరు నియోజకవర్గం విడవలూరు, కొడవలూరు మండలాల పరిధిలో పొదుపు గ్రూపులకు సంబంధించిన 10 మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను నియమించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామాలుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మీకులు, డీలర్లు, సంఘమిత్రలు, ఆర్పీలను తప్పుడు ఫిర్యాదుల ద్వారా టీడీపీ నేతలు తొలగిస్తున్నారు. పలుచోట్ల అధికారులు తలొగ్గి చిరుద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ఆయాలు, అంగన్వాడీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పాలు, సరుకులు ఇవ్వడం లేదని, కేంద్రాలు తెరవడం లేదని, పిల్లలు రావడం లేదని తప్పుడు ఫిర్యాదు చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్పీలు, సంఘమిత్రల తొలగింపునకు గ్రామాల్లో డ్వాక్రా సంఘాలను రెచ్చగొట్టి వీధుల్లోకి లాగుతున్నారు. తిరుపతి జిల్లాలో 192 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేయించారు. రేషన్ డీలర్లు 190 మంది, సంఘమిత్రలు 65 మందిని తొలగించారు. చిత్తూరు జిల్లాలో 86 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డగోలుగా తొలగించారు. 126 మందిని పని చేయనివ్వకుండా అడ్డుకున్నారు. 34 మందికి నోటీసులు ఇచ్చారు. 47 మంది సంఘమిత్రలను తొలగించాలని అధికారులకు సిఫార్సులు వెళ్లాయి. ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది 112 మందిపై వేటు వేయాలని చూస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీనే అడ్డుకున్న టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులకు కొరత లేకుండా ఉండేలా గత ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన జిల్లా స్థాయి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉండగా, ఆ నియామకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రులకు స్టాఫ్ నర్స్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 200 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతేడాది సెపె్టంబర్లో విడుదల చేసిన స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్‌లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా తొలుత పాడేరుకు 60, మార్కాపురానికి 47, ఆదోని, పులివెందుల, మదనపల్లె కళాశాలలకు కలిపి 206 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 313 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఈ ఏడాది జూన్‌లో కడప, విశాఖపట్నం, గుంటూరు రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదల చేశారు. అదే నెల 6న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించారు. కాగా, అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాల్సిన ముందు రోజే అర్ధంతరంగా కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు వైద్య శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంలోని నోటిఫికేషన్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుండటంపై వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, వివిధ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఉద్యోగులపై కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించారన్న ఏకైక కారణంతో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్ బోర్డు వంటి కీలక సంస్థల్లో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తగా తమ వారిని నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కూటమి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న ఏపీఐఐసీలోని జీఎం స్థాయి అధికారి వేగంగా పావులు కదుపుతున్నారు. 2019 జూన్ తర్వాత నియమించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలంటూ ఇటీవల కొంత మంది పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు ఆ వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ ఆ ఉన్నతాధికారి జీఎంలకు లేఖలు రాసి, వివరాలు తెప్పించారు. ఇప్పటికే నెల జీతం రూ.40,000 పైన ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన ఏపీఐఐసీ, తాజాగా ఇప్పుడు అంతకంటే తక్కువ జీతం ఉన్న వారిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇలా సుమారు 170 నుంచి 180 మంది ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఏపీ మారిటైమ్ బోర్డు, దాని అనుబంధ సంస్థల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు కింద ఉన్న రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు లిమిటెడ్‌లో రూ.40 వేలకు పైగా జీతం ఉన్న ఉద్యోగులను తొలగించారు. త్వరలోనే అంతకంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా మొదలు కావచ్చని చెబుతున్నారు. డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారుప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎటువంటి రిమార్కు లేకుండా ప్రజలకు రేషన్ పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే డీలర్ షిప్‌లకు రాజీనామా చేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండు నెలలుగా కమీషన్ కూడా ఇవ్వలేదు. మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – పాటిల్ ప్రకాష్‌రెడ్డి, పెద్దకోట్ల, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా మా ఉసురు తప్పక తగులుతుందిమధ్యాహ్న భోజన పథకం కార్మీకురాలిగా పథకం పుట్టినప్పటి నుంచి పని చేస్తున్నా. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు ఉన్నఫళంగా మార్చేశారు. నాపై ఎలాంటి ఆరోపణలూ లేవు. అయినా నువ్వు వంట చేయొద్దంటూ నా వంట పాత్రలన్నీ బయట పడేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తప్పించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. లేదంటే మాలాంటి వారి ఉసురు తగులుతుంది. – ఎస్.సరస్వతి, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మీకురాలు, గంగవరం, బెళుగుప్ప మండలం, అనంతపురం జిల్లాసంఘాల మద్దతున్నా తొలగించారునేను 18 మహిళా స్వయం శక్తి సంఘాల సభ్యుల మద్దతుతో తుంగాన పుట్టుగ గ్రామైక్య సంఘానికి వీఓఏగా ఎన్నికయ్యాను. నా బాధ్యతల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా చేసిన సేవల్ని గుర్తించిన అధికారులు మహిళా దినోత్సవం నాడు జ్ఞాపికతో సత్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే నన్ను అకారణంగా తొలగించారు. 18 సంఘాల వారు నన్ను కొనసాగించాలని చెబుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. నా జీతం బకాయి కూడా ఇవ్వలేదు. – తుంగాన అంజలి, తుంగానపుట్టుగ గ్రామైక్య సంఘం వీఓఏ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాబలవంతంగా రాజీనామా చేయించారుగతంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన ఉపాధి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి సరైన ఆధారాలు దొరకడంతో తొలగించారు. ఆ స్థానంలో ఉపాధి కూలీగా పనిచేస్తున్న నా అనుభవం, విద్యార్హత చూసి ఫీల్డ్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించారు. ఏటా నిర్వహించే సామాజిక తనిఖీలో నాపై ఎలాంటి రికవరీలు లేవు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో వారికి అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని నాతో బలవంతంగా రాజీనామా చేయించారు. ఇలా చిరుద్యోగుల కడుపు కొట్టడం సరికాదు. – మునెయ్య, కందాడు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లానా జీవనం ప్రశ్నార్థకంగా మారిందిగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాచ్‌మెన్‌గా రెండేళ్లుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాననే నెపంతో నన్ను విధుల నుంచి తొలగించారు. నా కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలా అన్యాయంగా పొట్ట కొట్టడం సరికాదు. – మాలాజీ ఏసుబాబు, జయంతి, వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుశ్రీసత్యసాయి జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మీకులు, ఏజెన్సీల నిర్వాహకులు, రేషన్ షాపుల డీలర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పాఠశాలల వాచ్మెన్లు, వలంటీర్లను బలవంతంగా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 7,836 మంది వలంటీర్లను తీసేశారు. 346 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. 1,438 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,730 మంది మధ్యాహ్న భోజన పథకం కార్మీకులను వీధిన పడేశారు. 97 మంది వాచ్మెన్లను తొలగించారు. 1,367 మంది రేషన్ డీలర్లను మార్చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,125 రేషన్ డీలర్లను మార్చేశారు. 420 మంది యానిమేటర్లను తప్పించారు. 677 స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలను మార్చేశారు. 1,300 మందికి పైగా కార్మికులను తొలగించారు. 274 మంది వాచ్మెన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు 450 మందికి పైగా తొలగించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో రాజీనామా చేయించారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్కూళ్లలో టాయ్‌లెట్స్ క్లీన్ చేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. చౌక డిపో డీలర్లు అత్యధిక శాతం టీడీపీ వారే ఉన్నారు. ప్రతి పది షాపులకు ఒకరిని ఇన్చార్జ్గా నియమిస్తున్నారు. వారి ద్వారా మామూళ్లు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. -
మిడ్డే మీల్స్ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..!
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా వండి విద్యార్థులకు అందించాల్సిన వంట నిర్వాహకులు కొద్ది రోజులుగా అరకొరగా వంటలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పాల్జేస్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా గమనిస్తూ వస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం నిర్వాహకులను నిలదీశారు. మాటమాట పెరిగి ఈ వివాదం కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సాక్షి, విజయనగరం అర్బన్: విజయనగరం మోడల్ స్కూల్ భోజన నిర్వాహకులపై పేరెంట్స్ కమిటీ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం వారి మధ్య వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణ శివారుల్లోని ఏపీ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహణ సక్రమంగా లేదని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం వండటం లేదని ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భోజన నిర్వాహకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఆ సందర్భంగానే వారి మధ్య మాటల వివాదం చోటుచేసుకంది. మధ్యాహ్నం భోజన వంటకాలు సరిపడక పోవడాన్ని కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. కమిటీ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు 2 గంటల సమయంలో భోజనం అందని విద్యార్థులకు తిరిగి వంట చేయించారు. ప్రతి రోజూ కనీసం పది కేజీల బియ్యాన్ని మిగిల్చడం వల్లే వంటకాలు చాలడం లేదని కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్‌చైర్మన్ స్వాతి భోజన నిర్వాహకులను నిలదీశారు. కమిటీ ఆధిపత్యాన్ని జీర్జించుకోని భోజన నిర్వాకురాలు శ్యామల, స్రవంతి, భర్త సంతోష్ వారితో వాగి్వవాదానికి దిగారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాజీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి రోజూ చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత వంటకాలు వండకుండా బియ్యం, గుడ్లు మిగుల్చుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్వాహకులు మంగళవారం కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వండకపోవడంతో కమిటీ సభ్యులు నిలదీశారని వివరించారు. మాటల యుద్ధంతో జరిగిన ఈ వివాదం ముదిరి టూ టౌన్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇరువురి వాదన విన్న పోలీసులు సర్ది చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం ఒకే సారి వండి బోధన సమయానికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. -
మిడ్-డే మీల్స్ కార్మికుల వేతనం పెంచుతూ జీవో
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం 1000 నుంచి 3000 కు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచుతూ జీవో విడుదల చేయడంపట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాబూ... నిన్ను నమ్మేదెలా..?
సాక్షి, నెల్లూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో ఏ మాత్రం మార్పులేదు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి అనేక వర్గాల కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. వారిని రోడ్ల పాలు చేశారు. అడిగేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులతో కొట్టించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన సీఎం కావాలని అన్ని వర్గాలు నమ్మి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఉన్న 80 వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులను చుక్కలు చూపించారు. గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే పోలీసులతో లాఠీలతో కొట్టించి, మమ్మల్ని రోడ్లపై ఈడ్పించి కేసులు పెట్టించాడు. ప్రభుత్వ బడులకు వెళ్లి చదువుకొనే పిల్లలకు కడుపు నిండా తాము భోజనం వండి పెడుతుంటే అది కూడా మా నుంచి లాక్కోని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పేద బిడ్డల భోజన పథకానికి నిధులు ఇవ్వకుండా ఆపేశారు. ఇలాంటివన్నీ చేసినందుకా నీకు ఓటేయ్యాలంటూ నిలదీశారు. ఇలాంటి నిన్ను నమ్మి మళ్లీ ఓటెందుకు వేయాలి’ అంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె విజయమ్మ ప్రశ్నంచింది. ఇక నిన్ను నమ్మం బాబూ అంటున్న ఆమె ‘సాక్షి ప్రతినిధి’తో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడిన కష్టాలు ఏకరవు పెట్టారు. గౌరవ వేతనం కోసం ఆందోళన చేస్తే.. మాకు నెలకు రూ.1000 మాత్రమే గౌరవ వేతనం వస్తుంది. మా కష్టానికి తగిన వేతనం ఇవ్వాలని ఎన్నో సార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో వేతనం పెంచమని నిరసనలు తెలిపినా ఏ మాత్రం చలనం లేదు. చర్చల పేరుతో మమ్మల్ని పిలిపించి పిల్లలకు భోజనం సక్రమంగా పెట్టడం లేదంటూ బెదిరింపులకు దిగారు. గత్యంతరం లేక మూడుసార్లు అమరావతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మాపై పోలీసులను ఉసిగొల్పారు. నిరసన చేస్తే మమ్మల్ని పోలీసులతో లాఠీలతో కొట్టించి రోడ్లపైనే ఈడ్చుకుంటూ వెళ్లి కేసులు నమోదు చేసి లోపల కూర్చోబెట్టి మా పరువు తీశారు. ఆరు నెలల నుంచి వేతనాలు, బిల్లులు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి మాకు బిల్లులతో పాటు వేతనాలు నిలిపి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. నెలవారీగా దాదాపు రూ.40 వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలలుగా నిలిపివేస్తే మేమెట్లా వండి పెట్టాలి. ఎన్నికల కోసం మహిళలపై ప్రేమ ఉన్నట్లు పసుపు–కుంకుమ కింద పోస్ట్ పెయిడ్ చెక్కులిచ్చావు. మరి వంట వండి పేద బిడ్డలకు ఆకలి తీర్చుస్తున్న మేము మహిళలమే కదా.. మాకెందుకు వేతనాలు, బిల్లులు ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఏజెన్సీల కోసం.. నెల నెలా బిల్లులు ఇవ్వకున్నా అప్పు చేసి వంట వండి పేద బిడ్డల ఆకలి తీర్చుతున్నాం. ఇంటి వంటతో వారికి రుచికరమైన భోజనం అందిస్తున్న మా నుంచి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ లాక్కొని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి మా కడుపులు కొట్టారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను ఇప్పటికే ఢిల్లీకి చెందిన నవప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన చోట్ల పిల్లలకు ఎన్నిసార్లు ఫుడ్‌పాయిజన్ అయి అస్పత్రి పాలయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం, మనుబోలులో కూడా స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే భోజనంలో బల్లి పడిన సం«ఘటనలు న్నాయి. కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో కూడా ప్రైవేట్ ఏజెన్సీలు చేసే భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఇచ్చేది రెండు రూపాయలే.. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చేది రూ.4.13లే. కానీ అందులో కోడిగుడ్డు, వంటనూనె సరఫరాను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఇచ్చే నాలుగు రూపాయల్లో రెండు రూపాయలు మాకు తగ్గించి ఆ డబ్బులు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. బయట మార్కెట్లో పామాయిల్ ప్యాకెట్ రూ.50లకే వస్తుంటే.. ప్రైవేట్ ఏజెన్సీ వాళ్లు మాత్రం పామాయిల్‌ను రూ.90 వంతున సరఫరా చేస్తున్నారు. మాకు మాత్రం బిల్లులు ఇవ్వరు.. ప్రైవేట్ ఏజెన్సీలకు మాత్రం ఠంచన్‌గా నిధులు మంజూరు చేస్తున్నారు. మీ కమీషన్ల కోసం మా కడుపులు కొడతారా? వేతనాలు పెంచామని మోసం ఐదేళ్ల కాలంలో గౌరవ వేతనం పెంచాలని ఎన్నో నిరసనలు చేస్తే ఎన్నికల సమయంలో గౌరవ వేతనం రూ.3 వేలు పెంచామని హామీ ఇచ్చారు. కానీ పెంచిన వేతనం ఇప్పటిì వరకు మాకు అందలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేతనం పెంచుతున్నట్లు మోసం చేశాడు. ఐదేళ్ల పాటు నీవు చేసిన మోసం గురించి మా చేతి వంట తినే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నీ మోసాలను వివరించి చెబుతాము. నిన్ను నమ్మితే నిలువునా మోసం చేస్తావని చెప్తాం. ఇక నిన్ను నమ్మి ఓటేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
ఈడ్చేసి.. తరిమికొట్టి!
చిలకలపూడి (మచిలీపట్నం) : మధ్యాహ్న భోజన పథక కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకువెళుతూ.. తరిమికొడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. నాయకులు, కార్మికులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్‌లోకి ఎత్తిపడేశారు. నాయకులు, కార్మికులను స్టేషన్‌కు తరలిస్తుండగా మిగిలిన కార్మికులు వ్యాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని కూడా రోప్ పార్టీ ద్వారా పోలీసులు తరిమికొడుతూ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద ఆందోళన చేస్తుంటే వారిని కూడా బస్టాండ్ వరకు తరిమికొట్టారు. పోలీసుల చర్యతో కార్మికులు ఆగ్రహం.. ఆవేదనతో ఊగిపోయారు. విద్యార్థులకు పట్టెడన్నం పెడుతున్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తుంటే అణచివేసే ప్రయత్నం చేస్తారా? అని వ్యా ఖ్యానించారు. కార్మికుల హక్కులను కాలరాయాలని చూసే ఏ ప్రభుత్వం మనుగడసాగించలేదన్నారు. మమ్మల్ని పంపిస్తే.. మిమ్మల్ని పంపిస్తాం.. మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించి ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ‘మమ్మల్ని బయటకు పంపిస్తే.. మిమ్మల్ని కూడా అధికారం నుంచి బయటకు పంపుతాం’ అంటూ కార్మిక నాయకులు నినదించారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని, కార్మికుల కనీస వేతనం రూ.5 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 2003 నుంచి డ్వాక్రా గ్రూపు మహిళలు నిర్వహిస్తున్న ఈ పథకాలను అక్షయపాత్ర, ఏక్తాశక్తి, నవప్రయాస లాంటి సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బిల్లులు రాక అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి పథకాన్ని సజావుగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల కంటే కాంట్రాక్టర్లే ముఖ్యమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సీఐటీయూ తూర్పు జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హెల్పర్లకు ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. ధరలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పథకం అమలు కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వమే పాఠశాలలకు సబ్సిడీ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పి.ధనశ్రీ, బి.వెంకటరమణ, ఎల్.లలితకుమారి, ఆర్.విజయలక్ష్మి, సీఐటీయూ నాయకులు బూర సుబ్రహ్మణ్యం, ఎస్.నారాయణ, చిరువోలు జయరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు. -
మహిళలపై ఉక్కుపాదం
-
పిడిగుద్దులు గుద్దుతూ.. ఈడ్చుకెళుతూ..
చోడవరం: తమ ఉపాధిని తీసేయొద్దంటూ ఆందోళనకు దిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా వ్యవహరించింది. మహిళలని కూడా చూడకుండా పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ, దౌర్జన్యంగా వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కమిటీలను కాదని ఈ నెల 24 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే కాంట్రాక్టును ‘నవ ప్రయాస్’ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం ఆప్పగించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భోజన పథకం నిర్వాహకులు చోడవరం సమీపంలో ఉన్న నవప్రయాస్ సంస్థ వంటశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్తున్న పోలీసులు సీఎం చంద్రబాబు ప్రైవేటు సంస్థల వద్ద ముడుపులు తీసుకుని తమ జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో అనకాపల్లి డీఎస్పీ, చోడవరం,అనకాపల్లి సీఐలు, ఎస్ఐలు పెద్దసంఖ్యలో పోలీసు బలగాలతో వచ్చి ధర్నా చేస్తున్న మహిళలను భయాందోళనలకు గురిచేశారు. ఎదురుతిరిగిన మహిళలపై విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యంగా పిడిగుద్దులతో ఈడ్చుకెళ్లి వ్యాన్లు ఎక్కించారు. అనంతరం చోడవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ పోలీసు స్టేషన్లకు వీరిని తరలించారు. ఈ సందర్భంగా పలువురు స్పృహ కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని చోడవరం ఆస్పత్రికి తరలించారు. అరెస్టు అయిన వారిలో 100 మంది మహిళలు ఉన్నారు. సాయంత్రం కొందర్ని విడుదల చేసిన పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
వైఎస్ జగన్‌కు పెరుగుతున్న మద్దతు
సాక్షి, విజయనగరం: టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మధ్యాహ్న భోజన కార్మికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం ఉదయం కలిసి తమ సమస్యలను జననేతకు విన్నవించారు. ప్రభుత్వం తమకు ఆరు నెలల నుంచి బిల్లులు చెల్లించడంలేదని.. పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపించి బుద్ధి చెప్తామన్నారు. జీవో 279ను రద్దు చేయాలని వినతి జీవో నంబర్ 279ను రద్దు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై మండిపడ్డారు. మహిళా కార్మికులను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గీత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జననేతకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పనిచేస్తున్న తామంతా జగన్‌కు మద్దతు ఇస్తామని తెలిపారు. ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా చేశారు చంద్రబాబు నాయుడు తమ ఉద్యోగాలు తీసేసి తమన రోడ్డున పడేలా చేశారని జేఎన్టీయూ కాంట్రాక్టు అధ్యాపకులు వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిసస్తున్న జననేతను కలిసిన అధ్యాపకులు.. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తమ ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతాలు పెంచలేదని, టైం స్కేల్ కూడా అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను 108 ఉద్యోగులు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేతను కోరారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో 108 వాహనాలు మూలన పడ్డాయని వైఎస్ జగన్‌కు తెలిపారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై జననేతకు వినతి పత్రం అందజేశారు. ఫించన్ కూడా ఇవ్వడం లేదు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను బధిర, మూగ విద్యార్థులు కలిశారు. తమకు కనీసం చదువుకోవడానికి ఉన్నత పాఠశాల, కాలేజీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయడం లేదని జననేతకు విన్నవించారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది బధిరులు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఫించన్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. జాతిపితకు నివాళులర్పించిన జననేత మహాత్మా గాంధీ 149వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయనగరంలోని పాదయాత్ర శిబిరంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ప్రధానికి నివాళులు మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయనగరంలోని కొండకరకాం క్రాస్ వద్ద పాదయాత్ర శిబిరంలో చిత్రపటానికి లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. నేడు జననేత పాదయాత్ర నెల్లిమర్ల నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. -
మధ్యాహ్న భోజన కార్మికులపై ఉక్కుపాదం
-
‘మధ్యాహ్న భోజనం’ కార్మికులను ఈడ్చి పారేశారు
సాక్షి, అమరావతి/ సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్: తమ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. తమ కడుపు కొట్టొద్దని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. ఆందోళనలో పాల్గొన్న మహిళలు, వృద్ధులను పోలీసులతో విచక్షణారహితంగా ఈడ్చివేయించింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని సైతం లారీల్లోకి తోసేసి పోలీస్స్టేషన్లకు తరలించింది. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా అనుమతించకుండా వేధించింది. మరోవైపు వీరికి సంఘీభావం తెలపడానికి వచ్చిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లినప్పుడు సైతం పోలీసులతో బలవంతంగా బయటకు తోసివేయించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. కదం తొక్కిన కార్మికులు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు పరం చేయొద్దనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్మికులు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాచౌక్‌కు వస్తున్న కార్మికులను అలంకార్ సర్కిల్లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పథకాన్ని ప్రైవేటు పరం చేసి తమ కడుపులు కొట్టొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇంతలో వీరిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ వారు ప్రతిఘటించడంతో తోపులాట, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహిళలు, వృద్ధులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా కూడా లెక్కచేయకుండా పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు తరలించారు. ర్యాలీకి మద్దతు పలికేందుకు వచ్చిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎంసీహెచ్ శ్రీనివాస్‌రావుతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, సుప్రజ, స్వరూపారాణి తదితరులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి మాట్లాడుతూ.. తమ ప్రాణాలు పోయినా సరే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. 18 ఏళ్లుగా పనిచేస్తూ.. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే పోలీసులను ప్రయోగించి అరెస్ట్‌లు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. బిల్లు బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళన మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ర్యాలీ చేయడం నేరమా? అని ప్రశ్నించారు. యూనియన్ ప్రతిని«ధులతో ప్రభుత్వం చర్చలు జరపకుండా.. పోలీసులను ప్రయోగించి అరెస్ట్‌లు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించబోమంటూ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డున పడనున్న వేలాది మంది కార్మికులు! మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్, స్వచ్చంద సంస్థలకు అప్పగించాలని డీఈవోలను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ మే 16న ఉత్తర్వులు జారీ చేశారు. 13 జిల్లాలను 71 క్లస్టర్లుగా చేసి.. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకేచోట కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి భోజనం సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ చర్య వల్ల 15 ఏళ్లుగా పనిచేస్తున్న 85 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇస్కాన్, అక్షయపాత్ర, బుద్ధవరపు ట్రస్ట్, హరేరామ, నాంది, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ తదితర సంస్థలకు అప్పగించనున్నారు. పేద మహిళల కడుపు కొడతారా? బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్ట్ అప్పగించి పేద మహిళల కడుపుకొడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకొని శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులను ఉసిగొల్పి మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా ఈడ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. – కె.స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ప్రభుత్వ పతనానికి నాంది.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న మహిళలను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వ పతనానికి నాంది. కార్మికులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నన్ను, కార్మిక సంఘ నాయకులను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ నిరంకుశ ప్రభుత్వంపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. – బొడ్డు నాగేశ్వరరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ -
మంత్రి గంటా ఇల్లు ముట్టడి
-
అన్నం పెట్టిన చేతులివి..మా పొట్ట కొడతారా..!
బడి భోజన పథకం బాధ్యతను 15 ఏళ్లుగా చేస్తున్న వారిని కాదని.. ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడ్డారు. తమ కడుపు కొట్టొద్దని వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. పెద్దసంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపారేస్తున్నా.. వలువలూడేలా లాగేస్తున్నా.. మహిళా కార్మికులు ఏమాత్రం వెరవండా మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగించారు. మంత్రి ఇంటి సమీపంలోని జాతీయ రహదారిపైనా బైఠాయించారు. విశాఖపట్నం: మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మిడ్ డే మీల్స్ వర్కర్లు కదం తొక్కారు. పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఒప్పుకునేది లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం నెలకు రూ.1000 జీతం ఇస్తున్న ఉద్యోగులను ఎందుకు తొలగించాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు. తమను తొలగిస్తే చంద్రబాబు పతనానికి అదే నాంది అవుతుందంటూ నినాదాలు చేశారు. మూకుమ్మడి అరెస్టులు ముట్టడిని నీరుగార్చేందుకు తొలుత నాయకులపై దృష్టి సారించిన పోలీసులు వారిని మూకుమ్మడిగా అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఒకపక్క అరెస్టులు జరుగుతున్నా వర్కర్లు ఆందోళన కొనసాగించారు. డబుల్‌రోడ్డులో రాకపోకలను అడ్డుకున్నారు. ఆందోళన ఉధృతం కావడంతో వందల మంది వర్కర్లను అరెస్టు చేశారు. ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. కార్యక్రమంలో యూనియన్ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు కె.ప్రసన్న, గౌరవ అధ్యక్షురాలు ఎస్.అరుణ, కార్యదర్శి జి.వరలక్ష్మి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలు మంగశ్రీ తదితరులు పాల్గొన్నారు. గంటా ఇంటి ముట్టడికితీవ్ర యత్నం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఎంవీపీ కాలనీలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడిం చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. సుమా రు 2 వేల మంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనలో పాల్గొని గంటా నివాసాన్ని ముట్టడించేందుకు ప్ర యత్నించడంతో ఒక్కసారి అక్కడి వాతా వరణం వేడెక్కింది. వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీ సులు బారికేడ్లు ఏర్పాటు చేసినా ప్రతిఘటించి వాటిని గెంటుకుంటూ ముందుకు రావడంతో వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వలయాన్ని ఛేదించుకుని మంతి గంటా ఇంటివైపు దూసుకు పోవడంతో పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఈడ్చి పారేశారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి పోలీసువ్యానుల్లో తరలించారు. మంత్రి ముఖం చాటేస్తున్నారు తమ సమస్యలను వివరించాలని ఎన్నిసార్లు వచ్చినా మంత్రి గంటా శ్రీనివాసరావు కావాలనే ముఖం చాటేస్తున్నా రని మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే నవప్రయాస సంస్థకు అప్పగించినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. అదే జరిగితే రాష్ట్రప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తామన్నారు. ఇప్పటికైనే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, వర్కర్ల వేతనాలను రూ.1000 నుంచి 5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వెట్టిచాకిరీ చేయించుకుని పొమ్మంటారా? మాతో 12 ఏళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. కేవలం వెయ్యి రూపాయల జీతం, అదీ ప్రతీ నెల వచ్చే పరిస్థితి లేదు. తర్వాత అవకాశాలు ఉంటాయని ఓపిగ్గా ఎదురుచూస్తుంటే ఇప్పుడు మా సేవలు వద్దంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇన్నాళ్ల మా శ్రమకు ఫలితం ఏదీ? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. –గురవమ్మ, కె.నగరపాలెం(కాపుల దిబ్బపాలెం) మమ్మల్ని ఎందుకు తొలగిస్తారు? మిడ్డే మీల్ వర్కర్లను తీసేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఆ హామీ మర్చిపోయారా. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల ద్వారా సొమ్ములు దండుకోవడానికి మమ్మల్ని తీసేస్తారా? మాకిస్తున్న జీతం ఎంత? ప్రైవేట్ సంస్థల ద్వారా భోజనం పెడితే ఒరిగేదేంటి. ప్రభుత్వం వీటన్నింటికీ వివరణ ఇవ్వాలి. మమ్మల్ని తొలగించాలని చూస్తే చంద్రబాబు అందుకు మూల్యం చెల్లించాల్సిందే. –పార్వతి,పేరంటాళ్లపాలెం (కశింకోట) పదేళ్ల కష్టానికిఇదా ప్రతిఫలం? పదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి పనిచేస్తున్నాం. చాలీచాలని సరకులు, అరకొర వేతనంతో సరిపెట్టుకుంటున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నాం. ఇంత చేసినా మా పొట్టకొట్టాలని చూడటం అన్యాయం. ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మానుకోవాలి. – నూకరత్నం, బీసీ కాలనీ (అనకాపల్లి) గుణపాఠం చెబుతాం వెట్టిచాకిరీ చేయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోం. గతంలో మాదిరిగానే పథకాన్ని కొనసాగించాలి. వంటకు అవసరమైన సరుకులు సకాలంలో అందజేయడంతో పాటు జీతం రూ.5 వేలకు పెంచాలి. ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే గుణపాఠం చెబుతాం. – కుమారి, అమనాం (భీమిలి) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్నం పెట్టిన చేతులివి..మా పొట్ట కొడతారా..!
-
జోరువానలో ఆగ్రహ జ్వాల
- టీడీపీ నేతల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన - వాళ్ల మనుషులను పెట్టుకోవడానికి మమ్మల్ని తొలగిస్తున్నారు - తెలుగుదేశానికి ఓటేయలేదనే వేధిస్తున్నారు - అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ,ఐకేపీ వర్కర్ల నిరసన - కలెక్టరేట్ దిగ్బంధం - వర్షంలోనూ కొనసాగిన ధర్నా, రాస్తారోకో - మహిళలు, పోలీసుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. మహిళలమని చూడకుండా టీడీపీ నేతలు తమను నానా దుర్భాషలాడుతూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పెట్టుకునేందుకు కారణాల్లేకుండా, తమ పట్ల నీచంగా ప్రవరిస్తూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కదం తొక్కారు. రెండు గేట్లనూ మూసేసి మహా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ను దిగ్బంధిం చి ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలను అడ్డుకున్నారు. జోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాస్తారోకో చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, ఆశ వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధారాణి, తమ్మినేని సూర్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సుధారాణి తదితరులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మహిళా ఉద్యోగులపై కారణాల్లేకుండా వేటు వేస్తున్నారన్నారు. ఓటు వేయలేదనే అక్కసుతోనే ఇదం తా చేస్తున్నారని ఆరోపించారు. తమవారిని నియమిం చుకునేందుకు కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 30 మంది మధ్యాహ్న భోజన వర్కర్లను జిల్లా వ్యాప్తంగా తొల గించారన్నారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం పెంచిన రూ.300 మొత్తాన్ని వేతనాలకు కలపకుండా వదిలేశారన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నిర్వహించినపుడు అందరినీ వినియోగించుకోవడమే తప్ప ఎటువంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదన్నారు. ఐకేపీలో 15 నెలలుగా వీబీకేలకు (విలేజ్ బుక్ కీపర్లు) వేతనాలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ వారికి వ్వాల్సిన వేతనాలు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తిసూ, విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన మధ్యాహ్న భోజన వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వర్షం.. మరో వైపు ఆందోళన ఓ వైపు జోరుగా వర్షం పడుతున్నా మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. తడుస్తూనే ధర్నా కొనసాగించారు. మరోవైపు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మహిళల జుత్తు పట్టుకుని, మెడపై చేతులేసి.... ఆందోళనకారులంతా కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించారు. వర్షం పడుతుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు విధించి విరమించాలని, వినతిపత్రాన్ని కలెక్టర్, జేసీ తదితరులకు ఇవ్వాలని మహిళలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులు మహిళల జుత్తు పట్టుకుని లాగేశారు. మరికొంతమంది మెడపై చేతులేసి నెట్టేశారు. ఈ సమయంలో మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. బిగ్గరగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కలెక్టరేట్ దిగ్బంధం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ బి.రామారావు, డీఆర్వో బి.హేమసుందర్‌లకు ఆందోళనకారులు వినతిపత్రం అందించారు. తొలగించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులను 15 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని, ఆశ, వీబీకేలకు వేతనాలు ఇవ్వాలనీ ఈ సందర్భంగా గడువు విధించారు. లేకుంటే 16వ రోజున తిరిగి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణతో పాటు ఉమామహేశ్వరి, సుధారాణి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఆర్ జయప్రద, అంగన్వాడీ, ఐకేపీ, ఆశ, మధ్యాహ్న భోజన నిర్వహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కదంతొక్కిన ‘మధ్యాహ్న’ కార్మికులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిం చాలని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) పీడీ ఇచ్చి న ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూ నియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ.. ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించాలని ఐకేపీ పీడీ ఉత్తర్వులు జారీ చేశారని, డిసెంబర్‌లోగా కొత్త వారిని నియమించాలని పేర్కొన్నారని తె లిపారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జిల్లాలో ఉత్తర్వులు ప్రవేశపెట్టి 12 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించడం సమంజసం కాదన్నారు. జిల్లాలో 6,750 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని, కోడిగుడ్లకు, అరటిపండ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలోపే బిల్లులు అందేలా చూడాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వంటషెడ్లు, మంచినీరు, గంజులు, గ్యాస్‌పొయ్యి అందించాలని డిమాం డ్ చేశారు. వంట సరుకులను ప్రభుత్వమే సరఫ రా చేయాలని, ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్ అహ్మద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోనవ్వ, జిల్లా అధ్యక్షురాలు భారతీబాయి, ఉపాధ్యక్షురాలు రూప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. పలువురి మద్దతు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మధ్యాహ్న భో జన కార్మికులకు పలువురు నాయకులు మ ద్ద తు తెలిపారు. టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షు డు లోకా భూమారెడ్డి, టీడీపీ నాయకులు యూ నిస్ అక్బానీ, మున్సిపల్ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు నారాయణ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.