మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మిడ్ డే మీల్స్ వర్కర్లు కదం తొక్కారు. పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఒప్పుకునేది లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం నెలకు రూ.1000 జీతం ఇస్తున్న ఉద్యోగులను ఎందుకు తొలగించాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు. తమను తొలగిస్తే చంద్రబాబు పతనానికి అదే నాంది అవుతుందంటూ నినాదాలు చేశారు.