
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం 1000 నుంచి 3000 కు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచుతూ జీవో విడుదల చేయడంపట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment