GO issued
-
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది. 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీని ఎలా అమలుచేయాలి, వారి పేస్కేల్, అలవెన్సులు ఇతర అన్ని అంశాలను ఎలా నిర్ధారించాలో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2020 జనవరి 1నుంచి పీఆర్సీ అమలు ప్రభుత్వంలో విలీనమైన 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకానుంది. ఇచ్చిన హామీ ప్రకారం మిగిలిన ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్లలో వారికి మాస్టర్స్ స్కేల్స్ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. 23 శాతం ఫిట్మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్స్) ఎలా నిర్ధారించాలో అందులో పేర్కొంది. 2018 జూలై, 2020 జనవరి మధ్య ఆర్టీసీలో చేరిన ఉద్యోగులకు పే స్కేల్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది. పెన్షన్, గ్రాట్యుటీ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎలా వర్తింపజేయాలో కూడా సూచించింది. ట్రావెలింగ్ ఇతర అలవెన్సులకు సంబంధించి మరో జీఓ ఇచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లకు వారి డ్యూటీల ప్రకారం ఇచ్చే అలవెన్సులను నిర్ధారించింది. -
ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 22 మందితో తాత్కాలిక కమిటీ నియమించింది. 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చదవండి: సీఎం జగన్‌తో భేటీ.. సజ్జల ఏమన్నారంటే..? -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్వో నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. చదవండి: గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ -
విద్యతోపాటు ఉద్యోగాల్లోనూ ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్యా సంస్థలతోపాటు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో వంతు మహిళలకు... ► ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి. ► ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ► ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు. చంద్రబాబు తీరుతోనే గందరగోళం రిజర్వేషన్ల కేటగిరీలో లేని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో విధాన నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో ఆ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో వ్యవహరించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన 10 శాతం కోటాను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా విభజించారు. అందులో 5 శాతం కాపు సామాజికవర్గానికి, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల పేదలకు కేటాయిస్తూ అప్పట్లో టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు సామాజికవర్గ ప్రతినిధులతోపాటు రాజ్యాంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ల స్ఫూర్తిని చంద్రబాబు దెబ్బతీశారని స్పష్టం చేశారు. తమను బీసీల్లో చేరుస్తామని మోసం చేసిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సరికొత్త మోసానికి తెర తీయడంపై కాపు సామాజికవర్గ నేతలు భగ్గుమన్నారు. అసలు తాము బీసీలమా? ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారమా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను విభజించడాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విభజించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు నిలిచిపోయింది. చంద్రబాబు నిర్వాకంతో అటు కాపు సామాజికవర్గం, ఇటు ఆర్థికంగా వెనుబడిన ఇతర అగ్రకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈడబ్ల్యూఎస్ కోటాపై నేడు చిత్తశుద్ధితో అధికారం చేపట్టిన అనంతరం రాజ్యాంగ స్ఫూర్తితో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలకు తావులేని రీతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా మొదట విద్యావకాశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మరింత కసరత్తు అనంతరం సమగ్రంగా విధివిధానాలను నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారతాయి. (సీఎం జగన్ లక్ష్యాలను నెరవేరుస్తాం) ► ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు. (సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు!) ► మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వానికి నివేదిక... తమకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో మాధ్యమంపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని ప్రభుత్వం నివేదిక కోరిన సంగతి తెలిసిందే. విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సోమవారం ప్రభుత్వానికి 59 పేజీల నివేదికను సమర్పించింది. నివేదికలో పలు అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఆంగ్ల మాధ్యమం పాఠశాల స్థాయి నుంచి ఎంత అవసరమో ఎస్సీఈఆర్టీ ప్రస్తావించింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యతను సంతరించుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసింది. ఎస్సీఈర్టీ సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది. ముఖ్యమైన సిఫార్సులు.. ► విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం వివిధ ప్రక్రియల ద్వారా కొనసాగాలి ► విద్యార్థులు ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా తడబాటుకు తావులేకుండా చెప్పగలగాలి ► ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేస్తున్నాం ► విద్యార్థులు, తలిదండ్రులు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని 1నుంచి 6 వ తరగతి వరకు ప్రవేశపెట్టవచ్చు. ► ఎస్సీఈఆర్టీ 1–6 ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసింది. ► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు. ► తెలుగు సబ్జెక్టును 1 నుంచి 10 తరగతి వరకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు పాఠ్యపుస్తకాలను పటిష్టంగా తీర్చిదిద్దింది. -
మిడ్-డే మీల్స్ కార్మికుల వేతనం పెంచుతూ జీవో
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనం 1000 నుంచి 3000 కు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచుతూ జీవో విడుదల చేయడంపట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంగన్వాడీలకు పదోన్నతులు
అశ్వాపురం : ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులపై ప్రకటన చేయడంతో అంగన్వాడీ టీచర్లలో ఆశలు చిగురించాయి. సీనియారిటీ ఉండి డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంటర్, పదో తరగతి విద్యార్హత ఉన్న అంగన్వాడీ టీచర్లు.. సూపర్వైజర్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్)లో సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లలో సీనియారిటీ, అర్హత ఉన్న అంగన్వాడీ టీచర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి శాంతికుమారిలతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో టీచర్లకున్న అనుభవాన్ని వినియోగించుకోవాలని, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. గ్రేడ్–2 సూపర్వైజర్లుగా.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,434 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 626 మినీ అంగన్వాడీ కేంద్రాలు. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 1,859 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 70 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ టీచర్‌గా పది సంవత్సరాలకు పైగా సర్వీసు ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్హత ఉన్న వారికి గ్రేడ్–2 సూపర్వైజర్గా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 150 మంది అంగన్వాడీ టీచర్లు పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని డిగ్రీ ఆపైన చదువుకున్న వారు ఉన్నారు. సుమారుగా 1500 మంది అంగన్వాడీ టీచర్లు 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని పదో తరగతి ఆపైన చదువుకొని ఉన్నారు. ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేపడితే జిల్లాలో వందల మంది అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. పదో తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులే గతంలో అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందాలంటే సీనియారిటి ఉండి డిగ్రీ విద్యార్హత ఉండేది. దీంతో ఎంతో మంది టీచర్లు పదోన్నతులకు రాక టీచర్లుగానే కొనసాగుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా డిగ్రీ విద్యార్హతతోనే అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలనుకున్నా...అంగన్వాడీ టీచర్లు, యూనియన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని పదోన్నతులకు అర్హులుగా అవకాశం కల్పిస్తూ జీఓ జారీ చేసింది. సీనియారిటీ ఉండి పదో తరగతి విద్యార్హత ఉన్న వారు కూడా గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టుల అర్హత పరీక్షకు హాజరుకావచ్చు. టెన్త్ విద్యార్హతతో గ్రేడ్–2 సూపర్వైజర్గా ఎంపికైన వారు ఎంపికైనప్పటి నుంచి ఐదేళ్లలోపు డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సూపర్వైజర్గా ఎంపికైన తర్వాత డిగ్రీ ఉత్తీర్ణత అయ్యేలా ప్రభుత్వం అవకాశం కల్పించడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ప్రమోషన్లకు సంబంధించి జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి, సీడీపీఓలకు ఎటువంటి సమాచారం లేదు. ఆదేశాలు రాలేదు అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీల పదోన్నతులకు జీఓ జారీ చేసింది. ప్రభు త్వం మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు జిల్లాలో అంగన్వాడీల పదోన్నతుల ప్రక్రియ చేపడతాం. –ఝాన్సీలక్ష్మీబాయి, స్త్రీ శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి -
వైద్య కోర్సుల ఫీజు పెంపు
బీ, సీ కేటగిరీ సీట్లకు ఐదు శాతం పెంపు ♦ బీ కేటగిరీకి ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.55 వేలు ♦ సీ కేటగిరీకి ఎంబీబీఎస్‌కు రూ.1.10 లక్షలు పెంపు ♦ మైనారిటీ కాలేజీల్లో గత ఏడాది ఫీజులే ♦ బీ, సీ కేటగిరీ సీట్లు కన్వీనర్తోనే భర్తీ ♦ కౌన్సెలింగ్‌లో సీట్లు మిగిలితే కాలేజీలకు ♦ నాలుగు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య కోర్సుల ఫీజులు పెరిగాయి. ప్రైవేటు కాలేజీల్లోని బీ, సీ కేటగిరీల ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఐదు శా తం పెంచింది. ఈ మేరకు ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలను, ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాలుగు జీవోలు జారీ చేసింది. ప్రైవేటు కాలేజీల్లోని ఏ కేటగిరీ సీట్ల ఫీజులో ఎలాంటి మార్పులు లేవు. గత ఏడాది ఉన్నట్లుగానే ఏడాదికి రూ.60 వేలుగా ఉంటుంది. ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీటు ఫీజు గత ఏడాది వార్షిక ఫీజు రూ.11 లక్షలు ఉం డేది. ఐదు శాతం పెంపుతో ఇది ప్రస్తుతం రూ.11.55 లక్షలకు చేరింది. సీ కేటగిరీ సీట్ల ఫీజు... బీ కేటగిరీ సీట్ల ఫీజుకు రెట్టింపు స్థాయిలో ఉండాలనే మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ లెక్కన ప్రైవేటు కాలేజీల్లో సీ కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.23.10 లక్షలు ఉంటుంది. ప్రస్తుత పెంపు వల్ల ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సు సీ కేటగిరీ సీట్లలో చేరిన వారికి అదనంగా రూ.5.50 లక్షలు ఖర్చు కానుంది.ప్రైవేటు కాలేజీల్లోని బీ కేటగిరీ బీడీఎస్ సీట్ల ఫీజు రూ.4 లక్షల నుంచి రూ.4.20 లక్షలకు పెరిగింది. ఇదే కోర్సులోని సీ కేటగిరీ సీట్ల ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలకు పెంచారు. మైనారిటీ కాలేజీల్లోని 3 కేటగిరీల ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో మార్పులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరంలోనూ ఫీజులు ఉంటా యని పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో పోల్చి తే మైనారిటీ కాలేజీల్లో బీ, సీ కేటగిరీల సీట్ల ఫీజు ఎక్కువగా ఉండడం వల్లే ఈసారి మార్పులు చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లోని ఏ కేటగిరీ సీటుకు వార్షిక ఫీజు రూ.10 వేలు ఉంది. ఈ ఫీజులోనూ మార్పులు ఉండవు. ఎంబీబీఎస్ కోర్సులలో చేరే విద్యార్థులు ఐదేళ్లపాటు ఫీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్సులో చేరే ముందు ఎంత ఫీజు చెల్లిస్తారో మిగిలిన నాలుగేళ్లు అదే తరహాలో చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది. ఇదీ కౌన్సెలింగ్ తీరు... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ఏ, బీ, సీ కేటగిరీ సీట్లు అన్నింటినీ జాతీయ అర్హత ప్రవే శ పరీక్ష(నీట్) ర్యాంకుల ఆధారంగా కన్వీనర్ భర్తీ చేయనున్నారు. ఏ కేటగిరీ తరహాలోనే బీ, సీ కేటగిరీ సీట్లకు ఆన్లైన్ దరఖాస్తు, మెరిట్ లిస్ట్, వెబ్ కౌన్సెలింగ్ ఉంటాయి. కౌన్సెలింగ్ ప్రక్రియల్లోనూ ఏ, బీ, సీ కేటగిరీ సీట్లు భర్తీ కాని సందర్భంలో కన్వీనర్ స్పాట్ కౌన్సెలింగ్(మాప్ అప్ రౌండ్) పద్ధతిలో భర్తీ చేస్తారు. ఈ పద్ధతిలోనూ సీట్లు భర్తీకాని పరిస్థితుల్లో కేటగిరీల వారీగా ఖాళీలను పేర్కొం టూ వీటిని భర్తీ చేసే అవకాశాన్ని ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇస్తారు. ఏ కేటగిరీలో పేర్కొంటే ఆ మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కన్వీనరు ఆధ్వర్యంలోనే అన్ని సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎంసీఐ మార్గదర్శకాల మేరకు నిర్దేశిత గడువులోపే మూడు కేటగిరీల సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. బీ, సీ కేటగిరీ సీట్లకు నీట్ ర్యాంకు సాధించిన అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీపడే అవకాశం ఈసారి ఉంటుంది. ఆగస్టు 31లోపు అన్ని రకాల వైద్య విద్య కోర్సుల ప్రవేశాలను ముగించాలని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే ప్రవేశాలు చెల్లుబాటుకావని పేర్కొంది. -
బీపీఎస్ సొమ్మంతా కార్పొరేషన్‌కు..
విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం కింద వసూలైన రూ.49 కోట్లను నగరపాలక సంస్థకే కేటాయిస్తూ మునిసిపల్ మంత్రి పి.నారాయణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ పద్దుల ద్వారా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం విషయమై మేయర్ కోనేరు శ్రీధర్ సెక్రటేరియెట్‌లో మంత్రిని కలిశారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని బీపీఎస్ నిధులు మొత్తం విడుదల చేయాల్సిందిగా కోరారు. నిబంధనల ప్రకారం బీపీఎస్‌లో 50 శాతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించాల్సి ఉంది. మేయర్ విజ్ఞప్తి మేరకు పూర్తి సొమ్మును నగరపాలకసంస్థకు కేటాయిస్తూ మంత్రి జీవో విడుదల చేశారు. ఆన్లైన్ బిల్డింగ్ప్లాన్ల ద్వారా వసూలైన రూ.42 కోట్లు విడుదల చేయాల్సిందిగా మేయర్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సురేష్, టౌన్‌అండ్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ జీవి.రఘు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.నాగమణిని మేయర్ కలిసి నగరపాలక సంస్థ స్థితిగతులపై వివరించారు. కో ఆప్షన్‌సభ్యులు సిద్ధెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మచిలీపట్నం పోర్టు ల్యాండ్ పూలింగ్‌కు జీవో జారీ
విజయవాడ: మచిలీపట్నం పోర్ట్ ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్‌కు నిబంధనలు ఖరారు చేసింది. పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. భూములు లేని కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. 426 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఎంఏడీఏ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంఏడీఏ పరిధిలో 28 గ్రామాలు ఉన్నాయి. మెట్ట భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం, గరీబ్ భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. -
ఆర్డినెన్స్‌తో సరి!
ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో హోదాపై ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం రాత్రి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ ఆ వెంటనే ఉత్తర్వు జారీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో ఆగమేఘాలపై స్పందించిన వైనం మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఓటు వేసేందుకు అడ్డు తొలగినట్టే సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనికి గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో సభ్యత్వాన్ని కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరిస్తూ కొద్దిరోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వు (జీవో 207)ను రద్దు చేసింది. దాని స్థానంలో తనకున్న ప్రత్యేకాధికారాలతో ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఆగమేఘాలపై.. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసే నాటికి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే నాటికి గ్రేటర్ పరిధిలో నమోదైన ఎమ్మెల్సీలకే ఎక్స్ అఫీషియో హోదాలో మేయర్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుందన్న జీహెచ్ఎంసీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ్నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా/నామినేట్ అయినా తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరుగా నమోదు చేసుకున్నవారికి ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పిస్తూ కొద్దిరోజుల క్రితమే ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఉత్తర్వు జారీ విధానాన్ని జీర్ణించుకోవటం కూడా కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ ఉత్తర్వు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శాసన వ్యవస్థ ద్వారా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్టసవరణ సరికాదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వు జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదన విన్న ధర్మాసనం ప్రభుత్వం ఉత్తర్వు తేవటానికి అనుసరించిన విధానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం వివాదాస్పదమవుతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం... ఓ అడుగు ముందుకేసి తనకున్న ప్రత్యేకాధికారాల ద్వారా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా గురువారం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపగా ఆయన రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు దానిపై లోతైన అధ్యయనం అవసరమంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవటం గమనార్హం. ఆర్డినెన్స్ చట్టబద్ధమే అయినందున మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి మార్గం సుగమమైంది. -
అపోలో ఖాతాలో చిత్తూరు ఆసుపత్రి
* ఐదేళ్ల పాటు లీజుకు జిల్లా ప్రభుత్వాసుపత్రి..జీవోజారీ * 2016 నుంచి 150 సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం * అప్పటినుంచే అపోలో యాజమాన్యంతో ఎంఓయూ అమలు సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఈ ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పజెబుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. ఈ మేరకు కుదిరిన అవగాహన ఒప్పందంలోని షరతులను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అపోలో యాజమాన్యం వైద్య కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన క్లినికల్ అటాచ్మెంట్ (ఆస్పత్రి) కోసం.. అభివృద్ధి పేరిట చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని సాధ్యాసాధ్యాల పరిశీలన అంటూ గత జూన్ 30న ఒక కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, డీఎంఈ (వైద్యవిద్యా సంచాలకులు), వైద్య విధానపరిషత్ కమిషనర్, చిత్తూరు ఆస్పత్రి సూపరింటెండెంట్లు ఉండగా ఐదో సభ్యుడిగా అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్) ప్రతినిధికి కూడా ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ కమిటీ వారం రోజుల్లో అపోలోకు ప్రభుత్వాసుపత్రిని ఇవ్వవచ్చునంటూ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వసతుల లేమి ఉందని, అపోలోకు లీజుకు ఇవ్వడం ద్వారా వసతులు సమకూర్చవచ్చునని పేర్కొంది. వెనువెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలో యాజమాన్యానికి ఐదేళ్ల పాటు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభమవుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దశల వారీగా సీట్లను 250కి పెంచుతారని తెలిపారు. భారతీయ వైద్యమండలి నిబంధనల మేరకు అపోలో యాజమాన్యం వసతులు ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. ఈ మేరకు అపోలో యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంలోని షరతులను ఉత్తర్వుల్లో వెల్లడించారు. అపోలో చేయాల్సిన అభివృద్ధి ఇదీ.. * చిత్తూరు ఆస్పత్రిలో ప్రస్తుతం లేని అక్యూట్ మెడికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్, క్యాజువాలిటీ విభాగాలను అపోలో ఏర్పాటు చేయాలి స ఆపరేషన్ థియేటర్లను పెంచి వాటికి సరిపడా మౌలిక వసతులు కల్పించాలి * ట్రామాకేర్‌తో పాటు న్యూరో, ఇంటెన్సివ్, క్రిటికల్ కేర్లు ఏర్పాటు చేయాలి స 10 హీమో డయాలసిస్ మెషీన్లను ఏర్పాటు చేయాలిస ప్రసవాలకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలి స సీటీ, ఎంఆర్ఐ స్కాన్లు, కలర్ డాప్లర్, మామోగ్రఫీ యూనిట్లను ఏర్పాటు చేయాలి స సెంట్రల్ క్యాజువాలిటీని ఏర్పాటు చేయాలి స రోజుకు 1,500 మంది ఔట్ పేషెంట్ రోగులకు తగిన వసతులు ఏర్పాటు చేయాలి * నర్సింగ్ సర్వీసులు బలోపేతం చేయాలి * ప్రస్తుతం 320 పడకల ఆస్పత్రి ఉంది, మెడికల్ కాలేజీకి తగినట్టుగా పడకలు పెంచాలి * 2016 నుంచి (కళాశాల ప్రారంభం నుంచి) అవగాహన ఒప్పందం అమల్లోకి వస్తుంది * ప్రస్తుతం ఈ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు కొనసాగుతాయి స ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. మెడికల్ కళాశాల కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటుచేస్తే వారికి అపోలో చెల్లించాలి స లీజు పూర్తయ్యాక మెషినరీ మొత్తం ఆస్పత్రికే వదిలేసి వెళ్లాలి. ఎంఓయూ జరగకముందే అఫిలియేషన్! అపోలో యాజమాన్యానికి చిత్తూరు ఆస్పత్రిని అప్పజెప్పే ప్రక్రియను ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద పూర్తి చేసింది. గత జూన్ 30న కమిటీ వేస్తూ సర్క్యులర్ జారీ చేస్తే, ఆగస్టు 29 నాటికల్లా ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ కళాశాలకు అఫిలియేషన్ మంజూరు చేసింది. అదే సమయానికి హైపవర్ కమిటీ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లూ మంజూరు చేసింది. వీటిని ఆసరాగా చేసుకుని అపోలో యాజమాన్యం 2015 సెప్టెంబర్ 20కి ముందే 150 ఎంబీబీఎస్ సీట్లకు భారతీయ వైద్యమండలిలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఆస్పత్రి ఆప్పగింతకు సంబంధించిన విధివిధానాలను మాత్రం అక్టోబర్ 14న ఖరారు చేశారు. కోట్ల విలువైన ఆస్తి అపోలో చేతుల్లోకి..: దశాబ్దాల చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా ఆస్పత్రి 17.23 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆస్పత్రిని అప్పగించడం ద్వారా సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి అప్పగించింది. ఈ ఆస్పత్రి ఏటా 4.68 లక్షల మంది ఔట్ పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేస్తే 8 స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయవ చ్చు. భవనాల ఆధునీకరించడంతో పాటు, పరికరాలను కొనుగోలు చేయడానికి వీలుంది. వైద్యులు, పారా మెడికల్, నర్సులు, పరిపాలనా సిబ్బందిని నియమించుకోవచ్చు. తాజా నిర్ణయంతో నిరుపేదలకు కష్టకాలం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీప భవిష్యత్తులో ఈ ఆస్పత్రి ద్వారా అందించే ప్రతి సేవకూ యూజర్ చార్జీలు తప్పవని అధికారులే చెబుతున్నారు. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రంలో 13 వేల మంది వైద్యులు, లక్షన్నరకు పైగా పారా మెడికల్ సిబ్బంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు పరం చేసే విధానం కొనసాగితే ప్రభుత్వ నియామకాలకు అవకాశం ఉండదంటున్నారు. రూ.200 కోట్ల విలువ చేసే ఆస్పత్రిని నయా పైసా తీసుకోకుండా ఒక మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి ప్రైవేటుకు అప్పగించారంటే.. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మొదలైన బదిలీల కుదుపు
జెడ్పీ, పంచాయతీ, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు మార్గదర్శకాలతో జీవో జారీ ఒకేచోట ఐదేళ్ల పనిచేస్తే సీటు కదలాల్సిందే ఐదేళ్లలోపు వారికి పరిపాలనా సౌలభ్యం మేర బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశం విశాఖపట్నం: జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్టుమెంట్లలో బదిలీల కుదుపు మొదలైం ది. ఈ నాలుగు శాఖల్లో బదిలీలకు మా ర్గం సుగమమైంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డవెలప్మెంట్ కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి గురవారం రాత్రి జీవో నెం.755ను జారీ చేశారు. ఈ జీవోలో బదిలీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను పేర్కొన్నారు. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ బదిలీలు ఈ నెల 15వ తేదీలోగా చేపట్టాలని పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట ఐదేళ్లపాటు పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీలు చేయాల్సిందే. ఐదేళ్ల లోపు వారిని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని పేర్కొన్నారు. బదిలీలన్నీ పూర్తిగా కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపరంగా చూస్తే ఇప్పటికే ఏర్పాటైన క్లస్టర్ పంచాయతీలకు గ్రేడ్ల వారీగా కార్యదర్శలను నియమించాలని సూచించా రు. నిర్దేశించిన గ్రేడ్ స్థాయి అధికారి లేకపోతే ఆ తర్వాత గ్రేడ్ కార్యదర్శిని నియమించాలని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎట్టిపరిస్థితుల్లోనూ సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడానికి వీల్లేదు. రేషనలైజేషన్ ద్వారా ఏర్పడిన ఖాళీల్లో నిష్పత్తి ప్రకారం బదిలీలు చేయాలి. జిల్లా పరిషత్‌తో పాటు మండల ప్రజాపరిషత్ లోని ఎంపీడీఒలు, ఇతర మినిస్టీరియల్ సిబ్బందిని బదిలీ చేయాలని పేర్కొన్నారు. ఎంపీడీవోలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సొంత రెవెన్యూ డివిజన్లో పోస్టింగ్ ఇవ్వడానికి వీల్లేదు. డిఎల్పీవోలు, ఏవోలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (పీఆర్ అండ్ ఆర్డీ)సిబ్బందిని జిల్లా పరిధిలో కలెక్టర్ పర్యవేక్షణలో బదిలీలు చేయాలి. వీరికి కూడా సొంత రెవెన్యూ డివిజన్లో పోస్టింగ్ ఇవ్వకూడదు. సెకండ్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంతకంటే దిగువ కేడర్ ఉన్న అధికారులను సంబంధిత అధికారులే జిల్లా పరిధిలో బదిలీలు చేసుకోవచ్చు. ఈఎన్సీలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అండ్ సీఈ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, ఎస్ఈలను అంతర్‌జిల్లాల పరిధిలో బదిలీలు చేయాలి. అదే విధంగా అర్హత ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను జిల్లా పరిధిలోనే బదిలీలు చేయాలి. వీరికి కూడా సొంత డివిజన్లో పోస్టింగ్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇక ఏఈఈలు, ఏఈలను జిల్లా పరిధిలోనే రేషనలైజేషన్ ద్వారా ఏర్పడిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలి. అయితే సొంత సబ్ డివిజన్లో బదిలీలు చేయకూడదు. ఇప్పటికే ఐదేళ్లు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాను శాఖల వారీగా సిద్ధంచేశారు. తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన వారి జాబితాలో జిల్లా పరిషత్‌లో 381 మందికి 352 మంది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 745 మందికి 183 మంది, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 294 మందికి 102 మంది, ఆర్‌డబ్ల్యూఎస్‌లో 205 మందికి 60 మంది ఉన్నారు. పాడేరు ఈఈలు బదిలీ: పంచాయతీరాజ్ పాడేరు ఈఈగా పనిచేస్తున్న కె.ప్రభాకరరెడ్డిని నెల్లూరు జిల్లా కావలికి బదిలీ చేశారు. విభజనలో ఏపీకి కేటాయించిన కేసీ రమణను పాడేరులో నియమించారు. అదే విధంగా పాడేరులో ఆర్డబ్ల్యూఎస్ ఈఈగా పనిచేస్తున్న ఎన్వి రమణమూర్తిని గుంటూరుకు బదిలీ చేశారు. ఈ స్థానాంలో ఎవరినీ నియమించలేదు. -
జాయింట్ జగడం
- కార్యదర్శికి చెక్ పవర్‌పై సర్పంచుల గుర్రు - నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా? - కార్యదర్శుల కొరతతో తీవ్ర ఇబ్బందులు - 29 అంశాలు బదలాయింపు అయ్యేనా..? సుల్తానాబాద్: గ్రామపంచాయతీలకు 29 అంశాలను బదలాయించడంతో పాటు నిధులు, విధుల్లో సర్వాధికారాలు కట్టబెడుతామన్న సర్కారు దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్పంచులు గుర్రుగా ఉన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరిట గ్రామ ప్రజాప్రతినిధులను అగౌరవ పరచడమేనని, తమ హక్కులను హరించే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజీవోపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరముందని సర్పంచులు కోరుతున్నారు. నిధుల దుర్వినియోగమే కారణమా..? సర్పంచులకు నేరుగా చెక్ పవర్ ఉండడంతో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుం డానే డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్‌ను అమలు చేస్తే కొంతవరకు అవినీతికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతోనే ఈ జీవో జారీ చేసినట్టు భావిస్తున్నారు. సర్పంచులు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నప్పటికీ పలు రకాల పనులకు నిధులు విడుదల చేయలేదు. పని చేసిన వాటికి నిధులు నేటికీ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. గతంలోనూ జాయింట్ చెక్ పవర్ కల్పించిన సందర్భాల్లో సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్ పవర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కార్యదర్శులేరి..? జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, 528 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. క్లస్టర్ల వారీగా చూసినా జిల్లాలో 621 క్లస్టర్లు ఉండగా.. 93 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పెద్ద పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన వాటిలో నాలుగు నుంచి ఆరు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భారంతో వీరు అన్ని పనులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా నిధుల విషయమై సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది.