జెడ్పీ, పంచాయతీ, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు మార్గదర్శకాలతో జీవో జారీ
ఒకేచోట ఐదేళ్ల పనిచేస్తే సీటు కదలాల్సిందే
ఐదేళ్లలోపు వారికి పరిపాలనా సౌలభ్యం మేర బదిలీలు
కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశం
విశాఖపట్నం: జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్టుమెంట్లలో బదిలీల కుదుపు మొదలైం ది. ఈ నాలుగు శాఖల్లో బదిలీలకు మా ర్గం సుగమమైంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డవెలప్‌మెంట్ కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి గురవారం రాత్రి జీవో నెం.755ను జారీ చేశారు. ఈ జీవోలో బదిలీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను పేర్కొన్నారు. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ బదిలీలు ఈ నెల 15వ తేదీలోగా చేపట్టాలని పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట ఐదేళ్లపాటు పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీలు చేయాల్సిందే. ఐదేళ్ల లోపు వారిని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని పేర్కొన్నారు. బదిలీలన్నీ పూర్తిగా కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపరంగా చూస్తే ఇప్పటికే ఏర్పాటైన క్లస్టర్ పంచాయతీలకు గ్రేడ్‌ల వారీగా కార్యదర్శలను నియమించాలని సూచించా రు. నిర్దేశించిన గ్రేడ్ స్థాయి అధికారి లేకపోతే ఆ తర్వాత గ్రేడ్ కార్యదర్శిని నియమించాలని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎట్టిపరిస్థితుల్లోనూ సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వడానికి వీల్లేదు. రేషనలైజేషన్ ద్వారా ఏర్పడిన ఖాళీల్లో నిష్పత్తి ప్రకారం బదిలీలు చేయాలి. జిల్లా పరిషత్‌తో పాటు మండల ప్రజాపరిషత్ లోని ఎంపీడీఒలు, ఇతర మినిస్టీరియల్ సిబ్బందిని బదిలీ చేయాలని పేర్కొన్నారు.
ఎంపీడీవోలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సొంత రెవెన్యూ డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వడానికి వీల్లేదు. డిఎల్‌పీవోలు, ఏవోలు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (పీఆర్ అండ్ ఆర్‌డీ)సిబ్బందిని జిల్లా పరిధిలో కలెక్టర్ పర్యవేక్షణలో బదిలీలు చేయాలి. వీరికి కూడా సొంత రెవెన్యూ డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వకూడదు. సెకండ్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంతకంటే దిగువ కేడర్ ఉన్న అధికారులను సంబంధిత అధికారులే జిల్లా పరిధిలో బదిలీలు చేసుకోవచ్చు. ఈఎన్‌సీలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అండ్ సీఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు, ఎస్‌ఈలను అంతర్‌జిల్లాల పరిధిలో బదిలీలు చేయాలి. అదే విధంగా అర్హత ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను జిల్లా పరిధిలోనే బదిలీలు చేయాలి. వీరికి కూడా సొంత డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఇక ఏఈఈలు, ఏఈలను జిల్లా పరిధిలోనే రేషనలైజేషన్ ద్వారా ఏర్పడిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలి. అయితే సొంత సబ్ డివిజన్‌లో బదిలీలు చేయకూడదు. ఇప్పటికే ఐదేళ్లు పైబడి ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాను శాఖల వారీగా సిద్ధంచేశారు. తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన వారి జాబితాలో జిల్లా పరిషత్‌లో 381 మందికి 352 మంది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 745 మందికి 183 మంది, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 294 మందికి 102 మంది, ఆర్‌డబ్ల్యూఎస్‌లో 205 మందికి 60 మంది ఉన్నారు.
పాడేరు ఈఈలు బదిలీ: పంచాయతీరాజ్ పాడేరు ఈఈగా పనిచేస్తున్న కె.ప్రభాకరరెడ్డిని నెల్లూరు జిల్లా కావలికి బదిలీ చేశారు. విభజనలో ఏపీకి కేటాయించిన కేసీ రమణను పాడేరులో నియమించారు. అదే విధంగా పాడేరులో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈగా పనిచేస్తున్న ఎన్‌వి రమణమూర్తిని గుంటూరుకు బదిలీ చేశారు. ఈ స్థానాంలో ఎవరినీ నియమించలేదు.
మొదలైన బదిలీల కుదుపు
Published Thu, Aug 6 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement