మచిలీపట్నం పోర్ట్ ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది.
విజయవాడ: మచిలీపట్నం పోర్ట్ ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్కు నిబంధనలు ఖరారు చేసింది. పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్కు భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. భూములు లేని కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు.
426 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఎంఏడీఏ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంఏడీఏ పరిధిలో 28 గ్రామాలు ఉన్నాయి. మెట్ట భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం, గరీబ్ భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.