అనంతపురం: ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగుల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా నుంచి సోమవారం తలపెట్టిన ఐకేపీ ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ఇందులో భాగంగా ముందుగా సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఐకేపీ వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు.