లెవీ రూపంలో బియ్యూన్ని సేకరించే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. మిల్లర్లు సేకరించే ధాన్యాన్ని ఆడించగా వచ్చే బియ్యంలో 75 శాతాన్ని లెవీగా తీసుకోడానికి బదులు.. 25 శాతం బియ్యూ న్ని మాత్రమే తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ జారీ చేసింది. రాష్ట్రంలో 20 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. జిల్లానుంచి సుమారు 6 లక్షల టన్నుల బియ్యం లెవీగా సేకరించాల్సి ఉంది. అయితే, లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటనేది ఇంకా ప్రకటించలేదు.
దీంతో ఏం చేయూలో తెలియక మిల్లర్లు సందిగ్ధంలో ఉన్నారు. కస్టమ్ మిల్లింగ్ (ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి మజూరీకి బియ్యంగా ఆడించడం) ప్రాతిపదికన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించి విధాన ప్రకటన మాత్రం చేయలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన మిల్లర్లు పాత లెవీ విధానాన్ని అమలు చేయకపోతే వచ్చే సమస్యలు ఏమిటనేది వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు.
మాసూళ్లు మొదలైనా...
మెట్టలో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యూరుు. డెల్టాలోనూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్పటికీ మిల్లులకు తీసుకెళ్లినంత వేగంగా రైతులు ఆ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లడం లేదు. అక్కడి నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారాయంటున్నారు. తేమ శాతం, సొమ్ము చెల్లింపు వంటి విషయాల్లో ఇబ్బందులు ఉండటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. బ్యాంకులతో ఆర్థిక లావాదేవీలున్న మిల్లర్లు తప్ప ఇతర మిల్లర్లు ధాన్యాన్ని భారీగా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లెవీ విధానం ప్రకటించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం ఇటీవల రాజమండ్రిలో ఉభయగోదావరి జిల్లాల రైస్‌మిల్లర్లు సమావేశమయ్యారు.
పాత లెవీ విధానం అమలు చేయించేలా చూడాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. ఇందుకోసం ముఖ్యమంత్రిని కలవాలని ఆ సమావేశంలో తీర్మానించారు. లేదంటే లక్ష్యాలు, తేమ శాతాలతో సంబం ధం లేకుండా మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం ఆడిం చగా వచ్చిన మొత్తం బియ్యూన్ని కొనుగోలు చేయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. మరోపక్క విదేశాల్లో స్వర్ణ బియ్యానికి డిమాండ్ లేకపోవడం.. తమిళనాడుకు ఎగుమతులు సన్నగిల్లడంతో కొత్త ధాన్యానికి పెద్దగా ధర పలకడం లేదు.
లెవీ పేచీ
Published Wed, Nov 26 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement