Custom milling
-
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్‌ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. -
సమీక్షల షో
►కస్టమ్ మిల్లింగ్‌లో అక్రమాలపై సర్కారు తీరిది ►రూ.68 కోట్లుబకాయిపడిన 23 మంది మిల్లర్లు ►రెండేళ్లుగా చర్యలు శూన్యం ►మంత్రి మారటంతో మిల్లుల తనిఖీలు, ►కేసుల నమోదుకు ఆదేశాలు నెల్లూరు : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుని ఖజానాకు తూట్లు పొడిచిన అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. సమీక్షల పేరిట హడావుడి చేస్తూ.. తెరవెనుక నుంచి అక్రమార్కులకు ఆశీస్సులు అందజేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటన సాగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నియోజకవర్గాలో పర్యటించిన ఆయన రెండుచోట్ల శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన బియ్యాన్ని (సీఎంఆర్) అమ్మేసుకున్న మిల్లర్లపై కేసులు నమోదు చేసి నెల రోజుల్లో ఆ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. ఖజానాకు గండికొడితే ఉపేక్షించేది లేదని ప్రకటించి వెళ్లారు. ప్రతిసారి ఇలాగే ‘షో’ నిర్వహించటం మినహా ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది. ఏటా ఇదే తంతు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్న మిల్లర్ల విషయంలో ఏటా ఇదే తంతు నడుస్తోంది. జిల్లాలో 23 మంది మిల్లర్లు సుమారు రూ.68 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. బియ్యాన్ని అమ్మేసుకున్నారు. వారినుంచి సొమ్మును రికవరీ చేసే పేరిట ఏటా నాలుగుసార్లు సమీక్షలు నిర్వహించడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మిల్లర్ల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉండటంతో మంత్రి హడావుడి చేసి వెళ్లడం.. ఆనక లాబీయింగ్‌తో చర్యలు నిలుపుదల చేయించుకుని కాలం గడపటం పరిపాటిగా మారింది. నిధుల స్వాహా సాగుతోందిలా జిల్లాలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 250 మిల్లులు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. రెండేళ్ల నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు లేకపోవటం, జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండటంతో ఇక్కడి మిల్లర్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఐకేపీ కేం ద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం ఆడే నిమిత్తం కస్టమ్ మిల్లింగ్ పేరిట మిల్లర్లకు అప్పగిస్తోంది. బియ్యం ఆడినందుకు వారికి కమీషన్ చెల్లిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.3.65 కోట్ల విలువైన 17.70 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్లు.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో దర్జాగా అమ్మేసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.40.90 కోట్ల విలువైన 18,907 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ పేరిట తీసుకున్న మిల్లర్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి 23 మంది మిల్లర్లు వడ్డీలు, జరిమానాలతో కలిపి రూ.68 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మంత్రులు మారినా.. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన పరిటాల సునీత అనేక మార్లు జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ బియ్యాన్ని బొక్కిన మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా గురువారం అదే శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించారు. రెండు మిల్లుల్ని సీజ్ చేసి, నెలలోగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. గతంలోనూ కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నేతలు లాబీయింగ్ నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్ల నుంచి సొమ్ములు దండుకుని వారిపై చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయిస్తున్నారు. మొత్తం మీద మంత్రి పర్యటన పరోక్షంగా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించేందుకు దోహదపడుతుందనే విమర్శ వినిపిస్తోంది. -
అవే అక్రమాలు
ఫలితమివ్వని పకడ్బందీ చర్యలు రూ.71.76 లక్షల సర్కారు ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైన నిజాలు నిజామాబాద్ : వర్ని మండలంలోని ఓ రైసుమిల్లుకు ఈ ఖరీఫ్ కొనుగోలు సీజనులో 9,468 క్వింటాళ్ల సర్కారు ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ కోసం కేటాయించారు. ఈ మిల్లరు 2,012 క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని సర్కారుకు అప్పగించాడు. ఇంకా ఈ మిల్లరు వద్ద 7,456 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఉండాలి. అనుమానం వచ్చి రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల ఈ మిల్లును ఆకస్మిక తనిఖీ చేయగా.. కేవలం 2,672 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే స్టాక్ ఉంది. మిగిలిన 4,784 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఏమైనట్లు. ఈ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ మిల్లరుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. జిల్లాలో ఒకే ఒక్క మిల్లరు పక్కదారి పట్టించిన సర్కారు ధాన్యం విలువ సుమారు రూ.71.76 లక్షలు ఉంటుంది. పైగా ఉన్న ధాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. సదరు మిల్లరు నిబంధనల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని అధికారుల చర్యలు సాగకుండా చేయడం గమనార్హం. ఎన్ని చర్యలు చేపట్టినా.. కస్టం మిల్లింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఎన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినా.. అక్రమాల్లో ఆరితేరిన మిల్లర్లు మాత్రం తమ ‘దందా’ య«థేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లు సర్కారుకు కుచ్చు టోపి పెట్టిన మిల్లర్లు.. తాజాగా ఈ ఖరీఫ్ కొనుగోలు సీజను కస్టం మిల్లింగ్లోనూ తమ నైజాన్ని ప్రదర్శించారు. పైన పేర్కొన్న ఒక్క ఉదాహరణ చాలు కస్టం మిల్లింగ్‌లో అక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి. బ్యాంకు గ్యారంటీ.. క్రిమినల్ కేసుల హెచ్చరికలు.. ఇవేవీ అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు. ఈసారి సీఎంఆర్ వేగవంతం.. ఈ ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ప్రభుత్వం 186 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సుమారు రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద 2.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ఈ ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి.. బియ్యం ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా 183 మిల్లర్లకు కేటాయించింది. ఈ« ధాన్యాన్ని తీసుకున్న మిల్లరు 1.36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కస్టం మిల్లింగ్ ఈసారి వేగవంతమవుతోంది. ఇప్పటి వరకు సుమారు 1.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సర్కారుకు తిరిగి వచ్చేసింది. అంటే 80 శాతం కస్టం మిల్లింగ్ పూర్తయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కస్టం మిల్లింగ్ ఈ సారి వేగవంతం కాగా, అక్రమాలు మాత్రం అలాగే కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. గతంలో సెప్టెంబర్ మాసాంతానికి కూడా కస్టం మిల్లింగ్ జరిగేది కాదు. కానీ.. ఈసారి జనవరి నెలాఖరు వరకు 95 శాతానికి పైగా ఈ కస్టం మిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. అక్రమాలు మాత్రం య«థేచ్ఛగా కొనసాగుతుండటంతో పౌరసరఫరాల శాఖను విమర్శలు వెంటాడుతున్నాయి. ‘కస్టం’ కేటాయింపుల్లో చేతివాటం జిల్లాలో కస్టం మిల్లింగ్ కేటాయింపుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో ఇదే కస్టం మిల్లింగ్ పేరుతో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లులో ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన బడా మిల్లర్లు ఇప్పుడా బినామీ పేర్లతో కొత్త లైసెన్సులు తీసుకున్న వారికి అధికారులు తిరిగి కోట్లు విలువైన ధాన్యం కస్టం మిల్లింగ్ కోసం అప్పగించడం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సర్కారుకు ఎగనామం పెట్టినట్లు అధికారులకు తెలిసినప్పటికీ.. సాంకేతిక కారణాలు సాకుగా చూపి వారికే మళ్లీ ధాన్యాన్ని కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చిత్తశుద్ధిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మిల్లర్లకు బ్లాక్ స్పాట్
-ఎఫ్‌సీఐకి తరలిస్తున్న బియ్యంపై నల్లచుక్కలు -40 వేల టన్నులు తిరస్కరణ -ఘొల్లుమంటున్న రైస్ మిల్లర్లు తాడేపల్లిగూడెం : రైస్ మిల్లర్లకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ‘బ్లాక్ స్పాట్’ పేరిట కొర్రీ వేస్తోంది. బియ్యం గింజల మధ్యలో నల్లటి మచ్చ ల్లాంటివి ఉన్నాయంటూ గడచిన 20 రోజుల్లో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి పంపించింది. ఈ పరిస్థితితో మిల్లర్లు ఘొల్లుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ పేరిట బియ్యం ఆడించింది. ధాన్యాన్ని మరాడించినందుకు క్వింటాల్‌కు రూ.15 చొప్పున మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ధాన్యాన్ని ఆడగా వచ్చే ఊక, చిట్టు, తవుడు తదితరాలను మిల్లర్లకే ఇస్తోంది. క్వింటాల్ ధాన్యానికి బదులుగా 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఆ బియ్యాన్ని నేరుగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లంతా ఎఫ్‌సీఐ డిపోలకు తరలించడం మొదలుపెట్టారు. టిప్ డ్యామేజీ ఉందంటూ.. మిల్లర్లు తీసుకొచ్చిన బియ్యాన్ని దిగుమతి చేసుకునే ముందు వాటి నాణ్యతను ఎఫ్‌సీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తుంటారు. అయితే, ఇటీవల మిల్లర్లు తీసుకొస్తున్న బియ్యంపై నల్లటి మచ్చలు (టిప్ డ్యామేజీ) ఉందని క్వాలిటీ కంట్రోల్ గుర్తించింది. అలాంటి బియ్యాన్ని దిగుమతి చేసుకునేది లేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. గడచిన 20 రోజుల్లో సుమారు 60 వేల టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఎఫ్‌సీఐ డిపోలకు తరలించగా, టిప్ డ్యామేజీ పేరిట అందులో సుమారు 40 వేల టన్నుల బియ్యాన్ని అధికారులు తిరస్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైస్‌మిల్లర్లు బేలచూపులు చూస్తున్నారు. 1.85 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా 10,65,436 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 6,63,842 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో 50 వేల టన్నులను రేషన్ బియ్యం నిమిత్తం ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం తరలింపు ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు 4,79,137 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ డిపోలకు చేరవేశారు. ఇంకా 1,84,709 టన్నుల బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. గత నెల వరకూ రోజుకు 3 వేల నుంచి 4 వేల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి చేరవేసేవారు. గడచిన 20 రోజులుగా రోజుకు కనీసం వెయ్యి టన్నులు కూడా ఎఫ్‌సీఐ స్వీకరించడం లేదు. టిప్ డ్యామేజీ పేరిట బియ్యాన్ని తిప్పిపంపుతున్నారని మిల్లర్లు చెబుతున్నారు. నాణ్యత గుర్తించేదిలా ఎఫ్‌సీఐకి తరలించే బియ్యంలో ఒక బస్తా నుంచి 10 గ్రాముల్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బయటకు తీస్తారు. రంగు, పాలిష్, నూకల శాతం ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తారు. 10 గ్రాముల్లో 0.03 గ్రాములకు మించి దెబ్బతిన్న (డ్యామేజీ) బియ్యం ఉండకూడదు. అందులో నూకల శాతం 25 వరకు ఉండవచ్చు. అంతకుమించితే చెల్లించే సొమ్ములో కోత విధించడం లేదా వెనక్కి పంపించడం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి కారణాలేమీ లేకపోయినా బియ్యంపై నల్లమచ్చలు ఉన్నాయంటూ బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. 20 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన 1.85 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ బియ్యాన్ని వెనక్కి తీసుకు రావాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ నష్టాన్ని ఎలా భరించాలని ప్రశ్నిస్తున్నారు. -
రైస్ మిల్లులపై దాడులు
విజయనగరం కంటోన్మెంట్ :రైస్మిల్లర్లపై ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దాడులకు ఉపక్రమించారు. పేరుకుపోయిన ధాన్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ ముందుకు సాగకపోవడం తదితర కోణాల్లో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వీరికి సమాంతరంగా పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా తనిఖీలు చేశారు. కాకపోతే, దాడుల పరిస్థితి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. జేసీ ఆదేశాలకు, విజిలెన్స్ దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఈలోపు మిల్లర్లు జాగ్రత్త పడ్డారని, అందు వల్లేవాస్తవాలు బయటికి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు లెవీలో రేషన్ బియ్యం వినియోగిస్తున్నారన్న సమాచారంతో పాటు పలుమార్లు రేషన్ బియ్యం కూడా అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడడంతో జిల్లాలో ఏదో జరుగుతుందోనన్న అనుమానాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పక్కన పెట్టి పీడీఎస్ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌గా ఇచ్చేస్తున్నారని, కొన్ని చోట్ల అందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిన్నింటిపై ‘సాక్షి’ లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అంతవరకు నోరు మెదపని జిల్లా అధికారులు డిఫెన్స్‌లో పడ్డారు. చివరకు తమ పీకకు చుట్టుకుంటుందన్న భయంతో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎదురైంది. అందు లో భాగంగానే మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, గుట్టురట్టు చేయాలని విజిలెన్స్ అధి కారులకు ఆదేశించారు. దీంతో మంగళవారం భోగాపురం, డెంకాడ, గంట్యాడ, పార్వతీపురం మండలాల్లోని మిల్లులపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఉపకలెక్టర్లు దాడులు నిర్వహించారు. మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలు, వారిచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది? అన్న వివరాలను సేకరించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. గంట్యాడ మండలం సిరిపురంలోని యడ్ల రమణమూర్తికి చెందిన కృష్ణవేణి మిల్లులో విజిలెన్స్ సీఐలు ఉమాకాంత్, రేవతమ్మల నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. 20 కిలోల ధా న్యం మాత్రమే తేడా వచ్చినట్టు మొదట తేల్చారు. గం ట్యాడ మండలంలోని కనకదుర్గ ఫ్లోర్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు గజపతిరావు నేతృత్వంలో భోగాపురం మండలంలోని శుభకరి రైస్‌మిల్లును, డెంకాడలోని శ్రీమన్నారాయణ రైస్‌మిల్‌ను ఆయా మండలాల తహశీల్దార్లతో కలిసి తనిఖీ చేశారు. అయితే అక్కడ మిల్లుల్లో ఎటువంటి పొరపాట్లూ లేవని తేల్చేశారు. రికార్డులు మాత్రం నిర్వహించలేదని వారిని రికార్డులు సక్రమంగా నిర్వహించుకోవాలని హె చ్చరించినట్లు డీఎం ఎం గణపతిరావు సాక్షితో చెప్పారు. అదేవిధంగా పార్వతీపురంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామయ్య కూడా మిల్లులను తనిఖీ చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ బి రామారావు మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులు గానీ, తాము నియమించిన ఇతర అధికారులు గానీ రాత్రికి లేదా రేపు ఉదయం నివేదిక ఇస్తారని, నివేదిక ఆధారంగా వారిపై చర్యలు ఉంటాయని తెలి పారు. మిల్లుల్లో లెక్కలు తేలేదాకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూర్తి లెక్కలు తేలాకే మళ్లీ కొనుగోళ్లు చేపడతామన్నారు. అయి తే ఉదయం నుంచే దాడు లు మొదలు పెట్టినా ఏ మిల్లులోనూ అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించలేదు. సిఫార్సులకు, దాడులకు మధ్య సమయం ఎక్కువగా ఉండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి. -
సర్కారు ధాన్యం తాకట్టు
హుజూరాబాద్: ప్రభుత్వం తమకు అప్పగించిన కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని(సీఎంఆర్) మరపట్టించి మళ్లీ ప్రభుత్వానికి లెవీ బియ్యాన్ని సరఫరా చేయాల్సిన మిల్లర్లు కొత్త పంథాలో పోతున్నారు. సర్కారు ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సినవారు ఏకంగా ఆ ధాన్యాన్ని తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే తాజా వెలుగు చూసింది. హుజూరాబాద్ శివారులోని పెంచికలపేట గడ్డపై ఉన్న బాలాజీ పారాబాయిల్డ్ మిల్లుకు గత సీజన్లో 23వేల క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి లెవీ ద్వారా 15674 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేయాలి. కాని ఇప్పటివరకు కేవలం 8100 క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 7574 క్వింటాళ్ల బియ్యాన్ని పంపించాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా ఇంకా ఎందుకు పంపించడం లేదని అధికారులు విచారణ జరపగా సదరు మిల్లు నిర్వాహకులు స్పందించలేదు. ఆ తర్వాత అసలు వాస్తవాలు బయటపడ్డాయి. పదిరోజుల క్రితం షిఫ్టింగ్‌కు ఆదేశం బాలాజీ రైస్‌మిల్లులో ఉన్న సర్కారు ధాన్యాన్ని వెంటనే వేరే మిల్లులకు తరలించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం 2500 క్వింటాళ్ల ధాన్యాన్ని తరలించారు. ధాన్యాన్ని తరలిస్తున్న సమయంలోనే ఓ బ్యాంకు ప్రతినిధులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ధాన్యం తమకు సంబంధించిందని, దీనిని తరలించే హక్కు అధికారులకు లేదని వారు చెప్పడంతో సివిల్‌సప్లయ్ ఉద్యోగులు కంగుతిన్నారు. ఈ క్రమంలో ధాన్యం ఉన్న గోదాముకు బ్యాంకు ప్రతినిధులు తాళాలు వేసుకొని స్వాధీనం చేసుకున్నారు. రూ.70లక్షల రుణం పొందిన వైనం మిల్లులో ఉన్న సర్కారు ధాన్యాన్ని తాకట్టు పెట్టి సదరు నిర్వాహకులు రూ.70లక్షల రుణం తీసుకున్న విషయం అధికారులకు తెలియడంతో బుధవారం డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం సంపత్, తహశీల్దార్ శంకరయ్య, ఎఫ్ఐ శ్రీనివాస్, డీటీసీఎస్‌లు రమేశ్, రాజమౌళి పోలీసు బలగాలతో మిల్లు వద్దకు చేరుకున్నారు. గోదాములకు తాళాలు వేసి ఉండటంతో బ్యాంకు ప్రతినిధులకు, మిల్లు యజమానికి సమాచారం ఇచ్చారు. అయినా వారు రాలేదు. దీంతో స్వయంగా అధికారులే గోదాముల తాళాలను పగలగొట్టించారు. అనంతరం ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ధాన్యాన్ని అప్పగించకుంటే కేసులు పెడతామని డీఎస్వో, డీఎం చెప్పారు. -
లెవీ పేచీ
లెవీ రూపంలో బియ్యూన్ని సేకరించే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. మిల్లర్లు సేకరించే ధాన్యాన్ని ఆడించగా వచ్చే బియ్యంలో 75 శాతాన్ని లెవీగా తీసుకోడానికి బదులు.. 25 శాతం బియ్యూ న్ని మాత్రమే తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలనూ జారీ చేసింది. రాష్ట్రంలో 20 లక్షల టన్నుల బియ్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. జిల్లానుంచి సుమారు 6 లక్షల టన్నుల బియ్యం లెవీగా సేకరించాల్సి ఉంది. అయితే, లెవీ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటనేది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఏం చేయూలో తెలియక మిల్లర్లు సందిగ్ధంలో ఉన్నారు. కస్టమ్ మిల్లింగ్ (ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి మజూరీకి బియ్యంగా ఆడించడం) ప్రాతిపదికన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించి విధాన ప్రకటన మాత్రం చేయలేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన మిల్లర్లు పాత లెవీ విధానాన్ని అమలు చేయకపోతే వచ్చే సమస్యలు ఏమిటనేది వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ఆ సందర్భంలో పేర్కొన్నారు. అయినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. మాసూళ్లు మొదలైనా... మెట్టలో ఇప్పటికే వరి కోతలు పూర్తయ్యూరుు. డెల్టాలోనూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్పటికీ మిల్లులకు తీసుకెళ్లినంత వేగంగా రైతులు ఆ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లడం లేదు. అక్కడి నిబంధనలు రైతులకు ప్రతిబంధకాలుగా మారాయంటున్నారు. తేమ శాతం, సొమ్ము చెల్లింపు వంటి విషయాల్లో ఇబ్బందులు ఉండటంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. బ్యాంకులతో ఆర్థిక లావాదేవీలున్న మిల్లర్లు తప్ప ఇతర మిల్లర్లు ధాన్యాన్ని భారీగా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లెవీ విధానం ప్రకటించకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం ఇటీవల రాజమండ్రిలో ఉభయగోదావరి జిల్లాల రైస్‌మిల్లర్లు సమావేశమయ్యారు. పాత లెవీ విధానం అమలు చేయించేలా చూడాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని.. ఇందుకోసం ముఖ్యమంత్రిని కలవాలని ఆ సమావేశంలో తీర్మానించారు. లేదంటే లక్ష్యాలు, తేమ శాతాలతో సంబం ధం లేకుండా మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం ఆడిం చగా వచ్చిన మొత్తం బియ్యూన్ని కొనుగోలు చేయించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. మరోపక్క విదేశాల్లో స్వర్ణ బియ్యానికి డిమాండ్ లేకపోవడం.. తమిళనాడుకు ఎగుమతులు సన్నగిల్లడంతో కొత్త ధాన్యానికి పెద్దగా ధర పలకడం లేదు. -
డిసెంబర్ 15 నాటికి కస్టమ్‌మిల్లింగ్ లక్ష్యం నూరుశాతం పూర్తి చేయాలి : జేసీ
రాంనగర్ : రబీ సీజన్ 2013-14 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని జేసీ ప్రీతిమీనా కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో ఏర్పాటు చేసినసమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడానికి గాను ప్రతిరోజూ 2500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఖరీఫ్2014-15 సంవత్సరానికి కస్టమ్‌మిల్లింగ్ కింద ఇప్పటికే 41,767 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 40,746 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అప్పగించామన్నారు. అయితే ఇందులో 27,707 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎవరు కూడా బియ్యాన్ని డెలివరీ చేయలేదన్నారు. ఖరీఫ్ 2014-15 సంవత్సరానికి రా రైస్ 3,08,103 టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,606 టన్నులు మాత్రమే డెలివరీ చేశారన్నారు. లెవీ కింద ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సిన బాయిల్డు రైస్‌కు బదులు రా రారైస్‌ను త్వరితగతిన ఇవ్వాలని కోరారు. మిల్లర్లు ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. మిల్లుల వారీగా ప్రతివారం ఎంత ధాన్యం కొనుగోలుచేశారో ప్రతి శనివారం రిపోర్టు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైస్‌మిల్లర్ల అధ్యక్షుడు, రాష్ట్ర అసోసియేషన్ కన్వీనర్ జి.నాగేందర్ మాట్లాడుతు రైస్ మిల్లర్లు బాయిల్డ్ రైస్, రా రైస్ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ నాగేశ్వర్రావు, సివిల్‌సప్లయ్ డీఎం వరకుమార్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సొమ్మొకరిది.. సోకొకరిది!
మిర్యాలగూడ : సొమ్మొకరిది..సోకొకరిది అన్న చందంగా ఉంది జిల్లాలోని మిల్లర్ల తీరు. ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం లేదు. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఓ పక్క బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లర్లు బియ్యం వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. తిరిగి రాబట్టుకోవడంలో విఫలం.. రైతులనుంచి సివిల్ సప్లయీస్ కేంద్రాలతోపాటు ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇస్తున్నా అధికారులు సకాలంలో రాబట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయటి మార్కెట్లో విక్రయించుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. 2012-13కు సంబంధించి 8830 టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. 2012-13వ సంవత్సరంలో మిల్లర్ల నుంచి 30,952 టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా 22,122 టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 8,830 టన్నులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది మాట ఇలా ఉంటే ఈ ఏడాది 2013-14లో రబీలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఒక్క క్వింటాకు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. రబీ సీజన్లో రైతులనుంచి 3,67,466 టన్నుల ధాన్యం సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం 220మంది మిల్లర్లకు ఇచ్చారు. కాగా మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి 2,49,876 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క క్వింటా బియ్యం కూడా ఇవ్వలేదు. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. మిల్లర్ల వ్యాపారం.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో మిల్లర్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఖరీఫ్ పచ్చిబియ్యం మిల్లర్ల వద్ద 8830 టన్నులు ఉంచుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లర్లు ఎఫ్‌సీఐకి లేవీ ద్వారా ఇచ్చే బియ్యానికి క్వింటాకు 2100 రూపాయలు చెల్లిస్తారు. అదే లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.18.54 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో కిలోబియ్యం రూ.40 చొప్పున విక్రయిస్తున్నారని అనుకుంటే రూ.35.32 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నట్టే. అంతేకాకుండా రబీలో ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ ఒక్క క్వింటాకు కూడా ఇవ్వలేదు. రబీలో ఉన్న బియ్యాన్ని లెవీకి ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం : నాగేశ్వర్రావు, డీఎస్ఓ, నల్లగొండ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం. ఖరీఫ్ సీజన్లో ఉన్న బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చాం. గడువులోగా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించడానికి చర్యలు తీసుకుంటాం. -
గింజగింజకూ అక్రమాలే..
కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల అక్రమాల్లో డొంక కదులుతోంది. అర్హులైన రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా ఇతరులకు బదిలీ అయిన ప్రత్యేక పర్మిట్ల బాధితులు 12 మంది కాదని, 31 మంది ఉన్నారని పౌర సరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. మిలర్ల అంగీకారం లేకుండా రైస్‌మిలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి సంతకంతో వచ్చిన దరఖాస్తులను జిల్లా సరఫరా అధికారి బదిలీ చేసిన కారణంగా 12 మంది మిల్లర్లు కలిపి ఏకంగా కోటి రూపాయలు నష్టపోయినట్లు చెబుతుండగా... ఇప్పుడు ఈ విలువ రెండున్నర కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బాధితులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా బయటకు రాకుండా రైస్ మిలర్ల సంఘం బాధ్యులు వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. నష్టపోయిన వారు పేర్లు వెల్లడించి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పౌర సరఫరాల అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే ఫిర్యాదు చేసిన వారు వ్యాపారపరంగా భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందని సంఘం ముఖ్యులు హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. రైస్‌మిలర్ల సంఘానికి, పౌర సరఫరాల అధికారులకు ఇప్పటికే పేర్లు తెలిసిన 12 మందిలో నలుగురు రైస్ మిల్లర్లు మాత్రం శుక్రవారం కరీనగర్‌కు వచ్చి జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పర్మిట్ల అక్రమ బదిలీలో తాము ఎక్కువగా నష్టపోయామని ఈ నలుగురిలో ఇద్దరు గురువారం పౌరసరఫరాల కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటామని అధికారులు షరతు పెట్టడంతో వీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకుండానే చూడాలని, ఒకవేళ వచ్చినా తదుపరి ఎలాంటి విచారణ, చర్యలు లేకుండా అన్ని రకాలుగా ప్రయత్నించాలని రైస్ మిల్లర్ల సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నారు. దీని కోసం రాజకీయపరంగా తమ పలుకుబడిని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ధాన్యం కేటాయింపులోనూ... పర్మిట్ల బదిలీ ఒక్క విషయంలోనే కాకుండా ప్రభుత్వ ధాన్యం బియ్యంగా మార్చే(సీఎంఆర్) కేటాయింపుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని కొందరు రైస్ మిల్లర్లు చెబుతున్నారు. సంఘం ముఖ్యులతో ‘మంచిగా’ ఉన్న వారికే ప్రభుత్వ ధాన్యం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలోనూ త్వరలోనే ఫిర్యాదుదారులు బయటికి వస్తారని చెబుతున్నారు. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యంలో వందశాతం అప్పగించిన వారికి అంతే పరిమాణంలో మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇవ్వాలి. జిల్లాలో 226మంది మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్‌మిల్లర్ల సంఘం పెత్తనం తో అధికారులు ఇప్పటివరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి మాత్రమే పర్మిట్లు ఇచ్చా రు. ఇందుకు రైస్‌మిలర్ల సంఘం అక్రమ దందా నే కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన పర్మిట్లలోనూ 30 శాతం వరకు అర్హులకు సంబంధం లేకుండా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పౌర సరఫరాలశాఖ అధికారి ఆమోదంతోనే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం వచ్చే ఫిర్యాదులతో అక్రమాల దం దా ఏ మేరకు ఉందనేది స్పష్టం కానుంది. కస్ట మ్ మిల్లింగ్ బియ్యం ప్రత్యేక పర్మిట్ల దందాపై ‘సాక్షి’లో వచ్చిన విస్తృత కథనంతో అధికారుల్లో చలనం మొదలైంది. ఇప్పటివరకు జారీ చేసిన 87 వేల టన్నుల బియ్యం పర్మిట్ల వివరాలను ఠీఠీఠీ.జ్చుటజీఝ్చజ్చట.జీఛి.జీ వెబ్సైట్ లో పొందుపరిచామని, అక్రమాలు జరిగినట్లు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.