సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్‌ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment