Central Food Technology Research Institute
-
పండ్లకే నష్టం ఎక్కువ!
సాక్షి, అమరావతి: పంటల కోత అనంతరం పండ్లకు అత్యధికంగా నష్టం వాటిల్లుతోందని, ఆ తరువాత ఆ నష్టం ఎక్కువగా కూరగాయల్లో ఉందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పండ్లు, కూరగాయలు కోత అనంతరం అధిక ఉష్ణాగ్రతల కారణంగా నాణ్యత క్షీణించడం, వృధా అవ్వడం జరుగుతోందని పేర్కొంది. పండ్ల కోత అనంతరం దేశంలో 6.02 శాతం నుంచి 15.05 శాతం మేర నష్టపోతున్నాయని, ఆ తరువాత కూరగాయల్లో 4.87 శాతం నుంచి 11.61 శాతం మేర నష్టం వాటిల్లుతోందని అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, విలువ జోడింపులు పెంచడం తదితర చర్యలను తీసుకుంటోందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెగా ఫుడ్ పార్క్‌లు, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, విలువ పెంపు మౌలిక సదుపాయాలను, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లను, ఫుడ్ ప్రాసెసింగ్–ప్రిజర్వేషన్ కెపాసిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా 1,680 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర రుణ సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడానికి సులభతరం చేసిందని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. -
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్‌ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. -
మ్యాగీకి సీఎఫ్టీఆర్ఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తింటే హానికరం, ఆరోగ్యానికి ప్రమాదకరమంటూ మార్కెట్లో బంద్ చేసిన ఈ ఉత్పత్తులకు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎఫ్టీఆర్ఐ) నుంచి అన్ని అనుమతులు లభించాయి. ఈ సంస్థ నిర్వహించిన పరిశోధనలో మ్యాగీ నూడుల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. దాదాపు 29 శాంపుల్స్ పై నిర్వహించిన టెస్ట్ లో ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు లేవని సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకు తెలపింది. ఈ విషయాన్ని నెస్లే సోమవారం సాయంత్రంప్రకటించడంతో, మంగళవారం మార్కెట్లో దీన్ని షేర్ విలువ 5 శాతం పెరిగి రూ.6,180 కు చేరింది.. గతేడాది డిసెంబర్ లో మ్యాగీ నూడుల్స్ శాంపుల్స్ ను మైసూర్ ల్యాబోరేటరీలో పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి మ్యాగీకి వచ్చిన మంచి ఫలితాలతో మరిన్ని మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్లోకి పునః ప్రవేశపెడతామని నెస్లే తెలిపింది. 2015 జూన్ లో ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయన పదార్థాలు ఉన్నాయంటూ మార్కెట్లో ఆ ఉత్పత్తును ఆపివేసింది. ముంబాయి హైకోర్టు విధించిన షరతులను సంతృప్తిపరుస్తూ మ్యాగీ నూడుల్స్ గతేడాది నవంబర్ లోనే మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని షేర్ల విలువ ఏ మాత్రం పెరుగలేదు. 14.50 శాతం వరకూ పడిపోయాయి.ఈ క్రమంలో సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన ఫలితాలతో నెస్లే షేర్లు మెరుగైన బాటలో నడుస్తున్నాయి.