extending
-
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్‌ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. -
సెకండ్‌వేవ్: లాక్డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం
చండీఘడ్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అయితే, ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరేన్స్ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య అదపులోనే ఉందని అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేయడానికి మరికొంత కాలం లాక్డౌన్ అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్నినూతన సడలింపులను జారీ చేశారు. దీని ప్రకారం... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు పనివేళలని తెలిపారు. అదే విధంగా.. ఇకమీదట దుకాణ యజమనులు సరి,బేసి నియమాలను పాటిస్తూ దుకాణాన్ని తెరుచుకోవాలని అన్నారు. అయితే, కొన్ని మాల్స్‌లలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు తెరవడానికి ప్రత్యేకంగా అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, వీటిలో ఒకేసరి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాల్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే, కర్య్ఫూ మాత్రం యధావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నిరకాల విద్యాసంస్థలు జూన్ 15 వరకు మూసివేయబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. అదే విధంగా వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని పేర్కొన్నారు. కాగా.. శనివారం ఒక్క రోజే 1,868 కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుఈ మహమ్మారి కారణంగా 8,132 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు హరియాణాలో 7,53,937 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 23,094 కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. -
వెలగపూడి రహదారులకు మోక్షం
* సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం వరకు విస్తరణ * యుద్ధ ప్రాతిపదికన పనులు * పనుల్లో నిమగ్నమైన సీఆర్డీఏ అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి వెళ్లే రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల రాజధాని ప్రాంతం వెలగపూడికి చేరుకునేందుకు ఉన్న రహదారులన్నింటినీ సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గాన్ని సుందరీకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వారంలో రెండుమూడు రోజులపాటు రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతుండటంతో పనిలో పనిగా సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం మీదుగా వెలగపూడి చేరుకునే రహదారినీ విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్టతోపాటు వెంకటపాలెం రహదారికి ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టారు. మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఆయా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. వాస్తవానికి రాజధాని వెలగపూడి ప్రాంతానికి సీఎం చంద్రబాబు ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గంలో వెళ్తారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు పలువురు మంత్రులకు చెందిన కార్యాలయాలు ప్రారంభం కావడం.. సచివాలయ సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో ఇక్కడకు తరలిరావడంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. వాహన రాకపోకలు అధికంగా ఉండటంతో దుమ్మూధూళితో రహదారులన్నీ కాలుష్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారులను విస్తరించించాలని నిర్ణయించడంతో సీఆర్డీఏ అధికారులు శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.