వెలగపూడి రహదారులకు మోక్షం | Velagapudi roads got 'development' | Sakshi
Sakshi News home page

వెలగపూడి రహదారులకు మోక్షం

Published Thu, Oct 20 2016 6:37 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

వెలగపూడి రహదారులకు మోక్షం - Sakshi

వెలగపూడి రహదారులకు మోక్షం

* సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం వరకు విస్తరణ
* యుద్ధ ప్రాతిపదికన పనులు
* పనుల్లో నిమగ్నమైన సీఆర్‌డీఏ అధికారులు
 
సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధానికి వెళ్లే రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల రాజధాని ప్రాంతం వెలగపూడికి చేరుకునేందుకు ఉన్న రహదారులన్నింటినీ సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గాన్ని సుందరీకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వారంలో రెండుమూడు రోజులపాటు రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతుండటంతో పనిలో పనిగా సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం మీదుగా వెలగపూడి చేరుకునే రహదారినీ విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్టతోపాటు వెంకటపాలెం రహదారికి ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టారు. మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఆయా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. 
 
వాస్తవానికి రాజధాని వెలగపూడి ప్రాంతానికి సీఎం చంద్రబాబు ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గంలో వెళ్తారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు పలువురు మంత్రులకు చెందిన కార్యాలయాలు ప్రారంభం కావడం.. సచివాలయ సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో ఇక్కడకు తరలిరావడంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. వాహన రాకపోకలు అధికంగా ఉండటంతో దుమ్మూధూళితో రహదారులన్నీ కాలుష్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారులను విస్తరించించాలని నిర్ణయించడంతో సీఆర్‌డీఏ అధికారులు శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ మల్లికార్జున ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement