ఖమ్మం: డ్వాక్రా సంఘాల స్కాలర్‌షిప్‌లను స్వాహా చేసిన ఘటన జిల్లాలోని మణుగురు, పినపాక మండలాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. తమకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను కాజేసారని కొందరు మహిళలు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సిబ్బంది చేతివాటం ప్రదర్శించి స్కాలర్‌షిప్‌లను స్వాహా చేసారని మహిళలు ఆరోపిస్తున్నారు.
మణుగూరు, పినపాక మండలాల్లో డ్వాక్రా పథకం కింద మహిళలు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు రాకపోవడంతో ఆరాతీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సిబ్బందే కాజేసినట్లు ఆధారాలు లభించడంతో మహిళలు ఆందోళన చేపట్టారు.
.