నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం త్వరలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఐకేపీ, మెప్మా ఏఎండీ నందకుమార్ అన్నారు.
-
ఐకేపీ, మెప్మా ఏఎండీ నందకుమార్
నిర్మల్‌టౌన్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం త్వరలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఐకేపీ, మెప్మా ఏఎండీ నందకుమార్ అన్నారు. పట్టణంలోని మయూరి హోటల్‌లో శనివారం ఆదిలాబాద్, నిర్మల్, భైంసా మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత నిరుత్సాహ పడకుండా స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
ఇందులో 26 కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐకేపీ, మెప్మా సిబ్బంది దీనిపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్లు త్రియంబకేశ్వర్‌రావు, అలివేలుమంగతాయారు, సిబ్బంది పాల్గొన్నారు.