harita haaram
-
మెుక్కలకు జియో ట్యాగింగ్
హన్మకొండ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మ కలెక్టర్ కరుణను ఆదేశించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల భూసేకరణపై రాజీవ్‌శర్మ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేర కు మొక్కలు నాటాలని ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కల వివరాలను 100 శాతం రిజిస్టర్లో నమోదు చేసి, జియో ట్యా గింగ్ చేయాలని సూచించారు. వచ్చే సంవత్స రం జిల్లాలకు నిర్ణయించిన లక్ష్యం మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జగిత్యాల–కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మాణాని కి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద ఇప్పటివరకు 3.86 కోట్ల మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 5 రో జులుగా వర్షాలు కురుస్తున్నాయని, నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారి 365కు సం బంధించి తానంచర్ల నుంచి జమాండ్లపల్లి వరకు భూసేకరణ పూర్తి చేశామన్నారు. మంగళ్వారిపేట–మల్లంపల్లి వరకు 400 మీటర్లు, నల్లబెల్లి మండలం అర్షన్పల్లి వద్ద భూసేకరణ వారం రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. వరంగల్–హైదరాబాద్ 4 లైన్ల రహదారి భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హరితహారం ప్రత్యేక అధికారి పృథ్వీరాజ్, ఫారెస్టు కన్జర్వేటర్లు రాజారం, అక్బర్, నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పది రోజుల్లో హరితహారం లక్ష్యం పూర్తి
హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో జిల్లాకు నిర్దేశించిన 4 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంలో ఇప్పటివరకు 3.53 కోట్లు పూర్తి చేశామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మరో పది రోజుల్లో నూరుశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆమె చెప్పారు. మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాటిన మొక్కల్లో 94 శాతం బతికి ఉన్నాయన్నారు. వర్షాలు లేకపోవడం తో ఎవెన్యూ ప్లాంటేషన్ నిలిపివేశామని చెప్పారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. జియో ట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానం వాడకం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించగా.. బుధవారం జిల్లాకు సాంకేతిన నిపుణుల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈజీఎస్ ద్వారా చేప ట్టిన కార్యక్రమానికి చెల్లింపులు సత్వరమే చేపడుతున్నందుకు కలెక్టర్, అధికారులను అభినందించారు. వీడియో కాన్ఫరె¯Œæ్సలో సీసీఎఫ్ అక్బర్, సీఎఫ్ రాజారాం, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీఈఓ విజయ్‌గోపాల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఎఫ్ఓ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు. -
హరితహారంలో 3.53కోట్ల మెుక్కలు
అధికారులను అభినందించిన కలెక్టర్ హన్మకొండ అర్బన్ : జిల్లాలో హరితహారం ద్వారా సోమవారం నాటికి 3.53కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హరితహారం ప్రగతికి కృషిచేసిన వారిని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు వారాల్లో సాధించలేని పనిని నాలుగు రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. మెుదటి నుంచి ఇలాగే కృషి చేస్తే లక్ష్యం పూర్తయ్యేదని అన్నారు. వెనుకబడిన మండలాల్లో పరిస్థితిపై తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాస్, సీఈవో విజయ్‌గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఐదు కోట్ల మెుక్కలు నాటాలి
హరితహారంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : హరితహారంలో జిల్లాలో ఐదు కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మంది రంలో మంగళవారం హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో జిల్లా లక్ష్యం 4 నుంచి 5 కోట్ల మొక్కలకు పెరిగిందన్నారు. అధికారులు ప్రణాళికను తయారు చేసుకుని జిల్లాలో విరివిగా మెుక్కలు నాటేందుకు కృషి చేయాలన్నారు. గత ఏడాది హరితహారంలో మన జిల్లా మొదటì æస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అన్ని వర్గాల ప్రజలను మెుక్కలు నాటడంలో భాగస్వాములను చేసి వరంగల్‌ను మరోసారి ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల, వరద కాల్వ ప్రాంతాల్లో, చిన్ననీటి పారుదల శాఖ స్థలాల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలన్నారు. డీ గ్రేడెడ్ ఫారెస్టులో యూకలిప్టస్ మెుక్కలను విరివిగా పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి రో డ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఖమ్మం జిల్లా లో మన సరిహద్దు నుంచి రోడ్డుకు ఇరువైపులా మెుక్కలు పెంచారని, మన జిల్లాలో కూడా అదే విధంగా రోడ్లకు ఇరువైపులా పెంచాలన్నారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనని సర్పంచ్‌లకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు. హరితహారంతో జిల్లాను పచ్చదనంతో నింపాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఇంటికి 5 పూలు, 5 పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు. ఈ నెల15 నాటికి ఎంచుకున్న లక్ష్యంలో 80 శాతం పూర్తి చే యాలన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడు తూ ఇప్పటి వరకు జిల్లాలో 2.11 కోట్ల మొక్కలు నాటామని.. 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. 142 ప్రదేశాల్లో 95 శాతం మొక్కలు బతికి ఉన్నాయని తెలిపారు. వచ్చే ఏడాది మొక్కల పెంపకానికి కూడా రెండు రోజుల్లో నర్సరీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమీక్షలో జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు రాజయ్య, కొండా సురేఖ, శంకర్‌నాయక్, మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
జనగామ : హరితహారం లక్ష్యం చేరుకునేలా అధికారులు కష్టపడి పనిచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో 80 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువు కట్టలు, ప్రభుత్వ భూములు, పీఆర్, ఆర్అండ్బీ రహదారులు, వ్యవసాయ గట్లపై మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై కేసీఆర్ సీరియస్‌గా పని చేస్తున్నారని, లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని శాఖల అధికారులు సమసన్వయంతో పని చేయాలని అన్నారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు మిగతా పనులు పక్కన బెట్టి హరితహారంపైనే దృషి సారించాలని సూచించారు. లక్ష్యం సాధించేవరకు మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో 6 లక్షల ఈత మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అధికారులు ప్రతిపాదనలు పంపించి తీసుకెళ్లాలని అన్నారు. మొక్కలను రక్షించేందుకు వాటర్ ట్యాంకులు, అద్దె బోర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమీక్షలో డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో అనిల్ పాల్గొన్నారు. కాగా షామీర్పేట, వడ్లకొండ గ్రామాల్లో బండ్ ప్లాంటేషన్, ఈత గౌడ సొసైటీ భూమిని పరిశీలించారు. వారి వెంట డ్వామా ఏపీడీ వసంత, క్లస్టర్ టీఏ కె.శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మోహన్ ఉన్నారు. -
హరితహారంలో ముందుండాలి
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : రాష్ట్రం భవిష్యత్‌లో కరువుబారిన పడుకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జిల్లా నంబర్ వన్‌గా నిలవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. బుధవారం శివునిపల్లి జెడ్పీఎస్ఎస్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం, స్థానిక ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ. 95 లక్షలతో నిర్మించిన నూతన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.70 కోట్ల మెుక్కలు నాటామని చెప్పారు. తండాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, అరూరి రమేష్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, డీటీడబ్ల్యూఓ చందన, ఏటీడబ్ల్యూఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
మేనిఫెస్టో అమలులో నిర్లక్ష్యం
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి రాయపర్తి : మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త జంగా రాఘవరెడ్డి విమర్శించారు. మండలంలోని పెర్కవేడు పీఏసీఎస్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ భవనం, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల మాఫీ ఒకేసారి చేయకపోవడంతో వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీఏసీఎస్ ద్వారా గేదెలు, గొర్రెలు, ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు పిల్లల చదువులకు రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బిల్లా సుధీర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ గారె అనిత, డీసీసీ జీఎం సురేందర్, యాదగిరి, సుధాకరాచారి, మేనేజర్ నరేందర్, యాకూబ్, సీఈఓ ఏడాకుల సోమిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హామ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా హరితహారం అమలులో మొదటి స్థానంలో ఉండాలని, వచ్చే రెండేళ్లలో నిజామాబాద్ ‘హరిత ఇందూరు’ కావాలని వ్యవసాయ, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్నలు ఆకాంక్షించారు. మన దేశంలో సగటున 27 చెట్లు మాత్రమే ఉన్నాయని, అందు వలన కరువు, కాటకాలు, వరదలు, తుఫాన్లు సంభవిస్తున్నాయన్నారు. ఫలితంగా పచ్చదనం కోసం మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఆదివారం మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్నలు జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, జిల్లా కలెక్టర్ యోగితా రాణా, ఆర్మూరు శాసన సభ్యులు జీవన్‌రెడ్డితో కలిసి పెర్కిట్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... అడవుల సంరక్షణకు ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. చెట్లను నరికి అక్రమంగా కలపను తరలించే వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పీడీ యాక్డు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. చెట్టును కొట్టే హక్కుదాని యాజమానికి కూడా లేదని, ఇక నుంచి చెట్టు కొట్టాలంటే గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి అని అన్నారు. తల్లి బిడ్డకు ఉన్న సంబంధమే, చెట్టుకు– మనిషికి ఉన్న సంబంధమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వర్షాలు రావడం లేదన్నారు. మనకు కనపడే సత్యాన్ని గుర్తించాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల చొప్పున, నియోజక వర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. హరితహారం కింద చేపట్టే ప్రతి పనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని వివరించారు. కనీసం 12 మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరు కనీసం 12 మొక్కలు నాటితే ఈ సంవత్సరం 46 కోట్ల చెట్లను పెంచవచ్చని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8,695 గ్రామ పంచాయతీలలో 11,410 గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మన నిత్య జీవితం చెట్టుతోనే ముడిపడి ఉంటుందని, అందరు భాగస్వాములైతే ఒకే రోజులో జిల్లాకు నిర్దేశించిన 3.50 కోట్ల మొక్కలు నాటడం సమస్య కాదన్నారు. జిల్లా కలెక్టర్ పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అన్ని అవసరాలకు వాడే నీటిని కొనలేమని, ప్రాణవాయువును కొనలేమని చెప్పారు. 40 వేల మొక్కలు నాటిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సోమేశ్వర్ గ్రామంలో 43 వేల మొక్కలు నాటినందున రూ.40 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. బ్లాక్ ప్లాంటేషన్లు విరివిగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. చెట్లు లేకపోతే ప్రతి మనిషి ప్రతి దినం మూడు ఆక్సిజన్ సిలిండర్లు వాడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. జీవితకాలానికి దాని వ్యయం రూ. ఐదు కోట్లు దాటుతుందని తెలిపారు. ఈతవనాలు కనిపించకుండా పోవడం వల్లే కల్తీ కల్లు ఏరులై పారుతుందన్నారు. పంటకు యోగ్యం కాని భూముల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అలాగే 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. రెండు సంవత్సరాల్లో ఇంటికి రక్షిత నీటిని అందించేందుకు రూ.40 వేల కోట్లతో ప్రణాళిలి సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. పోటాపోటీగా కథలు, సామెతలు పెర్కిట్‌లో హరితహారం సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు మొక్కల ప్రాధాన్యతపై క్లాసు ఇచ్చారు. తమదైన శైలిలో వృక్షసంపద, పచ్చదనంపై పోటాపోటీగా కథలు చెప్పి ప్రజలను హరితహారం వైపు ఆకర్షితులను చేసే ప్రయత్నం చేశారు. ‘‘ మీ బోర్లు పోస్తున్నాయా.. ఎందుకు పోయడం లేదు.. నీరు ఎందుకు ఎండిపోయింది... వర్షాలు ఎందుకు పడటం లేదు... ’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ప్రశ్నలు వేస్తూ వారితోనే జవాబులు రాబడుతూ చివరకు చెట్ల యొక్క ఆవశ్యకతను వివరించారు. చెట్లకు మనుషులకు తల్లీ కొడుకుల అనుబంధం అంటూ చాలా ఉదాహరణలు చెప్పి ప్రజలను మొక్కలు నాటుతామని అనిపించారు. కలెక్టర్ డాక్టర్ యోగితారాణా‘‘ నేను ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నా... ఇక్కడ కరువు కాటకాలకు అంతరించిన అడవులే కారణం... మొక్కలు నాటడం మనందరి బాధ్యతగా మీ అందరికీ చెప్తున్నాం... ఇది మీరు విస్మరిస్తే ఒకవేళ నేను చనిపోయినా మిమ్మల్ని వదలి పెట్టను.. దేవుడికి మీపైనా ఫిర్యాదు చేస్తా.. నా తప్పు లేదు దేవుడా మొక్కలు నాటమని చెప్పిన వినడం లేదని పెర్కిట్ గ్రామస్తులైన మీపై చెప్తా.. అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు జాగ్రత్త’’ అంటూ మొక్కల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. భవిష్యత్‌లో నీటి కొరతను ఉదాహరణలతో వివరించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టింది మొదలు కాలిపోయే వరకు చెట్టుతోను మనిషి జీవితం ముడిపడి ఉందని, అలాంటి చెట్లను నిర్లక్ష్యం చేస్తే భావితరాల భవిష్యత్ అంధకారమే అన్నారు. హరితహారం సీఎం కేసీఆర్ మానసపుత్రికని, ఈ పథకం విజయవంతం కోసం అందరూ కృషి చేయాలంటూ చెట్లకు మనుషులకు ఉన్న బంధం, మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను వివరించారు. పెర్కిట్ సర్పంచ్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ యాదిరెడ్డి, అడిషనల్ సీసీఎఫ్ ఎస్.కె. సిన్హా, ఉద్యానవనశాఖ డీడీ సునందరెడ్డి, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓలు సుజాత, ప్రసాద్, జోజి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.