పది రోజుల్లో హరితహారం లక్ష్యం పూర్తి
Published Wed, Aug 24 2016 12:34 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో జిల్లాకు నిర్దేశించిన 4 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంలో ఇప్పటివరకు 3.53 కోట్లు పూర్తి చేశామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మరో పది రోజుల్లో నూరుశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆమె చెప్పారు. మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాటిన మొక్కల్లో 94 శాతం బతికి ఉన్నాయన్నారు. వర్షాలు లేకపోవడం తో ఎవెన్యూ ప్లాంటేషన్ నిలిపివేశామని చెప్పారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. జియో ట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానం వాడకం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించగా.. బుధవారం జిల్లాకు సాంకేతిన నిపుణుల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈజీఎస్ ద్వారా చేప ట్టిన కార్యక్రమానికి చెల్లింపులు సత్వరమే చేపడుతున్నందుకు కలెక్టర్, అధికారులను అభినందించారు. వీడియో కాన్ఫరె¯Œæ్సలో సీసీఎఫ్ అక్బర్, సీఎఫ్ రాజారాం, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీఈఓ విజయ్‌గోపాల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement