హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
Published Thu, Jul 28 2016 12:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
జనగామ : హరితహారం లక్ష్యం చేరుకునేలా అధికారులు కష్టపడి పనిచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో 80 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువు కట్టలు, ప్రభుత్వ భూములు, పీఆర్, ఆర్‌అండ్‌బీ రహదారులు, వ్యవసాయ గట్లపై మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై కేసీఆర్ సీరియస్‌గా పని చేస్తున్నారని, లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని శాఖల అధికారులు సమసన్వయంతో పని చేయాలని అన్నారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు మిగతా పనులు పక్కన బెట్టి హరితహారంపైనే దృషి సారించాలని సూచించారు. లక్ష్యం సాధించేవరకు మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో 6 లక్షల ఈత మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అధికారులు ప్రతిపాదనలు పంపించి తీసుకెళ్లాలని అన్నారు. మొక్కలను రక్షించేందుకు వాటర్ ట్యాంకులు, అద్దె బోర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమీక్షలో డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో అనిల్ పాల్గొన్నారు. కాగా షామీర్‌పేట, వడ్లకొండ గ్రామాల్లో బండ్ ప్లాంటేషన్, ఈత గౌడ సొసైటీ భూమిని పరిశీలించారు. వారి వెంట డ్వామా ఏపీడీ వసంత, క్లస్టర్ టీఏ కె.శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మోహన్ ఉన్నారు.
Advertisement