- అధికారులను అభినందించిన కలెక్టర్
హరితహారంలో 3.53కోట్ల మెుక్కలు
Published Tue, Aug 23 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
హన్మకొండ అర్బన్ : జిల్లాలో హరితహారం ద్వారా సోమవారం నాటికి 3.53కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హరితహారం ప్రగతికి కృషిచేసిన వారిని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు వారాల్లో సాధించలేని పనిని నాలుగు రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. మెుదటి నుంచి ఇలాగే కృషి చేస్తే లక్ష్యం పూర్తయ్యేదని అన్నారు. వెనుకబడిన మండలాల్లో పరిస్థితిపై తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాస్, సీఈవో విజయ్‌గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement