మెుక్కలకు జియో ట్యాగింగ్
మెుక్కలకు జియో ట్యాగింగ్
Published Wed, Aug 31 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
హన్మకొండ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మ కలెక్టర్ కరుణను ఆదేశించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల భూసేకరణపై రాజీవ్‌శర్మ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేర కు మొక్కలు నాటాలని ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కల వివరాలను 100 శాతం రిజిస్టర్‌లో నమోదు చేసి, జియో ట్యా గింగ్ చేయాలని సూచించారు. వచ్చే సంవత్స రం జిల్లాలకు నిర్ణయించిన లక్ష్యం మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జగిత్యాల–కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మాణాని కి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద ఇప్పటివరకు 3.86 కోట్ల మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 5 రో జులుగా వర్షాలు కురుస్తున్నాయని, నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారి 365కు సం బంధించి తానంచర్ల నుంచి జమాండ్లపల్లి వరకు భూసేకరణ పూర్తి చేశామన్నారు. మంగళ్‌వారిపేట–మల్లంపల్లి వరకు 400 మీటర్లు, నల్లబెల్లి మండలం అర్షన్‌పల్లి వద్ద భూసేకరణ వారం రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. వరంగల్–హైదరాబాద్ 4 లైన్ల రహదారి భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హరితహారం ప్రత్యేక అధికారి పృథ్వీరాజ్, ఫారెస్టు కన్జర్వేటర్లు రాజారం, అక్బర్, నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement