
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్‌రెడ్డిలో లోపిస్తుందని ఎద్దేవా చేశారు. మీరు తిడుతుంటే.. మేము పడుతూ ఉంటామా? అని మండిపడ్డారు. తమకు కూడా చీము, నెత్తురు ఉన్నది.. తాము కూడా ఎదో ఒక భాషలో తిట్టేలాగా? చేస్తున్నారని అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్, హరీష్ రావులను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమని అన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. బీఆర్‌ఎస్‌ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. బీఆర్ఎస్‌ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యతో కూడా కాదని తీవ్రంగా విమర్శించారు.
చదవండి: సీఎం రేవంత్‌తో మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment