టీడీపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరమాడారు | Yerrabelli Dayakararao fires on Home Minister nayini narasimha Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరమాడారు

Published Fri, Jun 5 2015 4:00 AM | Last Updated on Mon, Aug 27 2018 8:19 PM

టీడీపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరమాడారు - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బేరమాడారు

ఆ రికార్డులు మా దగ్గరున్నాయి : ఎర్రబెల్లి  
పాలకుర్తి: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయని చెప్పడం వెనుకున్న కుట్ర అర్థమౌతోందన్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి రూ. 20 కోట్ల వరకు ఆఫర్ చేసిన రికార్డులు తమ దగ్గరున్నాయన్నారు.

వాటిని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనకు కేసీఆర్ డబ్బులిస్తే వెళ్లానని.. చెప్పారన్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ పార్టీ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎలా గెలువగలిగిందన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఓట్లేయించుకున్నారన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement