
సాక్షి, పాలకుర్తి: నిత్యం రాజకీయాల్లో బీజీగా ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావు కబడ్డీ, కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రారమంలో మూడు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటలలో కెప్టెన్‌గా ఉన్నానని.. ఆటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు కూడా ఆటలను ఆడి.. ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
చదవండి: (పవన్‌లో స్పష్టంగా కనిపించిన అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు)
Comments
Please login to add a commentAdd a comment