kabaddi compitations
-
క్రీడాకారులతో కబడ్డీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, పాలకుర్తి: నిత్యం రాజకీయాల్లో బీజీగా ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావు కబడ్డీ, కబడ్డీ అంటూ కూతబెట్టి ఆట ఆడారు. పాలకుర్తి నియోజకవర్గం వావిలాల గ్రారమంలో మూడు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల్లో పాల్గొనే 40 టీముల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటలలో కెప్టెన్‌గా ఉన్నానని.. ఆటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఆరోగ్యంగా ఉన్నానని, మీరు కూడా ఆటలను ఆడి.. ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రానికి పేరు తేవాలని వారిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, సర్పంచ్ గంట పద్మ, భాస్కర్ తదితరులు ఉన్నారు. చదవండి: (పవన్‌లో స్పష్టంగా కనిపించిన అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు) -
కబడ్డీలో అద్భుత ప్రతిభ.. సాయం కోసం ఎదురుచూపు..
చేర్యాల ( సిద్దిపేట ) : మండల పరిధిలోని గుర్జకుంటకు చెందిన శెట్టె నరేశ్ కబడ్డీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు . ఇటీవల గోవాలో జరిగిన అండర్ -19 విభాగ పోటీల్లో తెలంగాణ జట్టులో తన ప్రతిభ చాటాడు . ప్రస్తుతం చేర్యాలలో ఇంటర్ చదువుతున్న నరేశ్ అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో నేపాల్‌లో జరగబోయే పోటీలకు అతడు సన్నద్ధం అవుతున్నాడు. అయితే , స్పాన్సర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు . ఆర్థిక సహకారం అందిస్తే మరింత ప్రతిభతో క్రీడల్లో రాణించి రాష్ట్రనికి , దేశానికి పేరు మంచి తెస్తానంటున్నాడు . అతనికి సహాయం చేయాలనుకుంటున్న వారు మొబైల్ నంబర్ 6303757100 లో సంప్రదించవచ్చు. చదవండి: KL Rahul: ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న కేఎల్ రాహుల్! -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక డీఎల్ఎన్ఆర్ పాఠశాల క్రీడామైదానంలో 63వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం 12 జిల్లాల క్రీడాకారులను అధికారులు, నేతలు పరిచయం చేసుకుని ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్‌బాషా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కే కోటేశ్వరమ్మ, అబ్జర్వర్ సీ మాల్రెడ్డి, సర్పంచ్ జూగుంట స్నేహలత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు భీమతాటి వెంకటరమణయ్య, జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే...బాలుర విభాగంలో కృష్ణాపై వైజాగ్, విజయనగరంపై శ్రీకాకుళం, ప్రకాశంపై, తూర్పుగోదావరి, చిత్తూరుపై గుంటూరు జట్లు విజయం సాధించాయి. అలాగే పశ్చిమగోదావరిపై కడప, కృష్ణాపై, కర్నూల్, శ్రీకాకుళంపై నెల్లూరు, కడపపై గుంటూరు, అనంతపురంపై తూర్పుగోదావరి జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో.. కడపపై చిత్తూరు, కర్నూలుపై ప్రకాశం, శ్రీకాకుళంపై వైజాగ్, కృష్ణాపై పశ్చిమగోదావరి జట్లు విజయం సాధించాయి. అలాగే చిత్తూరుపై తూర్పుగోదావరి, నెల్లూరుపై విజయనగరం జట్లు గెలుపొందాయి. కాగా విజయనగ రం–గుంటూరు జట్ల మధ్య జరిగిన పోటీ టైగా ముగిసింది. -
ఉత్సాహ‘బరి’తం
కోటలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మూడురోజుల పాటు నిర్వహణ ప్రారంభించిన అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ సామర్లకోట : కూత మొదలైంది. ఉత్సాహ‘బరి’త వాతావరణంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో స్థానిక పల్లంబీడ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను గురువారం అఖిల భారత కబడ్డీ అసోసియేషన్ అ««దl్యక్షుడు కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన మహిళ, పురుష జట్లు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్ అధ్యక్షత వహించగా ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ సామర్లకోట పట్టణ యువకులు పట్టుదలతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం వల్ల సామర్లకోటకు ప్రాధాన్యమిచ్చామన్నారు. జాతీయ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు రాజస్థాన్‌లోను, మహిళల కబడ్డీ పోటీలు పాట్నాలోను జరుగుతాయని చెప్పారు. ఆ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు సామర్లకోటలోనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో కబడ్డీలో బంగారు పతకం సాధించామని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, కమిటీ సభ్యులను అభినందించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు మాత్రమే గెలుపు, ఓటమిలను సులభంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి మాట్లాడుతూ ఆటలను స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో క్రీడలపై మరింత శ్రద్ధచూపాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం. రంగారావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు, కార్యదర్శి పద్మనాభం, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్య దర్శి ఎం.శ్రీనివాస్‌కుమార్, కోశాధికారి ఏవీడీ ప్రసాద్, జాతీయ కబడ్డీ కోచ్ పోతలు సాయి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, పసల సత్యానందరావు, పంచా రామ క్షేత్ర ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమార స్వామి, డిప్యూటీ సీఎం తనయుడు నిమ్మకాయల రంగనాగ్, రాష్ట్ర టీడీపీ ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మఠం సెంటర్ నుంచి పల్లం బీడ్‌లోని కోర్టు వరకు క్రీడాకారులు ర్యాలీగా తరలి వచ్చారు. ముఖ్య అతిథులు క్రీడా జెండాలను బెలూన్లు ఎగుర వేసి క్రీడలకు స్వాగతం పలికారు. అదే విధంగా కోర్టును వారు ప్రారంభించారు. పురుషుల విభాగంలో తూర్పు– కడప జట్ల మధ్య, మహిళల విభాగం నుంచి కర్నూలు– గుంటూరు జట్లతో పోటీలు ప్రారంభమ అయ్యాయి. రాష్టంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఈటీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.