కేసీఆర్ పాలనకు ప్రజల ఆమోదం | KCR to rule by the people | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలనకు ప్రజల ఆమోదం

Published Fri, Jun 3 2016 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

KCR to rule by the people

పాలకుర్తి ఎమ్మెల్యే   ఎర్రబెల్లి దయూకర్‌రావు

 

పాలకుర్తి : సీఎం కేసీఆర్ రెండేళ్ల పాలనకు అన్నివర్గాల ప్రజలఆమోదం ఉందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం నియోజకవర్గ కేం ద్రంలో తెలంగాణ రాష్ర్ట ద్వితీయ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాల కుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి, సాయుధ పోరాట యోధు రాలు చాకలి అయిలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మరో మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం ఖాయమన్నారు.


కార్యక్రమంలో తెలంగాణ మలి విడత ఉద్యమంలో ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, ఎంపీపీ భూక్య దల్జీత్ కౌర్, జెడ్పీటీసీ సభ్యుడు బన్నెపాక గణేష్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రాంబాబు,  తొర్రూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పాలకుర్తి సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ విజయ, కొడకండ్ల మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, నాయకులు పసునూరి నవీన్, గంగు కృష్ణమూర్తి, ఎస్‌ఐ ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement