పాలకుర్తి కోసం ఫైటింగ్
పీసీసీ నేతల ముందే బాహాబాహీ
జంగా, దుగ్యాల వర్గీయుల కొట్లాట
వర ంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలన్న విషయంపై పీసీసీలో సం దిగ్ధత నెలకొంది. ఈ విషయం సోమవారం పీసీసీ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్‌లో నిర్వహించిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తు న్నా జెడ్పీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో మొదలైన విబేధాల కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి అక్కడి నేతలు, కార్యకర్తలు డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఏడాదిన్నరగా పాలకుర్తిలో పార్టీ రెండుగా చీలింది. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో దుగ్యాల వర్గీయులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయాన్ని సదరు నేతలు దుగ్యాలకు చేరవేయడంతో ఆయన డీసీసీ భవన్‌కు వచ్చారు. దుగ్యాల వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన వర్గీయులు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జం గా రాఘవరెడ్డి వర్గీయులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాలను పీసీసీ నేతలు ఇరువురిని వేర్వేరు చాంబర్లలోకి రావాలని కోరారు.
వీరితో మాట్లాడుతున్న సమయంలోనే అదే చాంబర్ల ముందు మాటమాట పెరగడంతో అగ్రనేతల సాక్షిగా ఇరువర్గాల కు చెందిన నేతలు, కార్యకర్తలు పరస్పర దూషణలతో పాటు భౌతి క దాడులకు దిగారు. అరుుతే, నేతల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా యూత్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపై ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వెళ్లిపోయూరు. ఈవిషయమై ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీసీసీబీ చైర్మన్ జంగా రా ఘవరెడ్డి అనుచరులు బిల్లా సుధీర్‌రెడ్డి, బేరిపెల్లి విజయకుమార్, జల్లం కుమార్, కోతి ఉప్పలయ్య, కాసరపు ధ ర్మారెడ్డి తదితరులు తనపై దాడి చేశారని కడవెండికి చెందిన కౌడగాని సోమయ్య సో మవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అయితే, జంగా రాఘవరెడ్డి వర్గీయులు కూడా తమపై దుగ్యాల ప్రోద్బలంతో ఆయన అనుచరులు దాడి చేశారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఇన్‌చార్జితోనే భవిష్యత్తు
వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని భావించి నందునే ఇద్దరు నేతలు పట్టుపడుతున్నట్లు తెలిసింది. దుగ్యాల శ్రీనివాసరావు పార్టీకి పూర్తిగా దూరం ఉండడంతో పార్టీ శ్రేణులన్నీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి దగ్గరయ్యాయి. పార్టీ కార్యక్ర మాలను విజయవంతం చేస్తుండడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ విషయం దుగ్యాల వర్గీయులకు రుచించకపోవడం తో గలాటా సృష్టించినట్లు వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. కాగా, పాలకుర్తి ఇన్‌చార్జ్ వ్యవహారంపై మంగళవారం జిల్లా పార్టీ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.