‘నేనే సీనియర్‌ రౌడీని‌ నాకే టికెట్‌ ఇవ్వాలి’ | A Congress Leader Says I'm a Senior Rowdy Sheeter I deserve Mla Ticket | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 29 2018 11:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

A Congress Leader Says I'm a Senior Rowdy Sheeter I deserve Mla Ticket - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేత సుధీర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ‘నేను సీనియర్‌ రౌడీషీటర్‌.. నాకే టికెట్‌ ఇవ్వాలి’అని ఓ కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ విషయాన్ని ఓ అభిమాని ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. మన కర్మరా! బాబు అనే ఎమోజీతో ఆయన రిట్వీట్‌ చేశారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. వరంగల్‌ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేత సుధీర్‌ రెడ్డి, ఇదే టికెట్‌ ఆశిస్తున్న వారి పార్టీకే చెందిన మరో నేత రాఘవ రెడ్డిని ఉద్దేశించి విలేకరులతో మాట్లాడారు. ‘నేను నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసినా. కాంగ్రెస్‌ పార్టీ కోసమే రౌడీ షీటర్‌గా ఉన్నా. కాబట్టి నాకే టికెట్‌ ఇవ్వాలి. సీనియర్‌ రౌడీ షీటర్‌ను నేనే. నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసింది నేనే. రాఘవ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నడు సేవ చేయలేదు.’ అని సుధీర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ ప్రెస్‌మీట్‌ ఎప్పుడు ఎక్కడ జరిగింది మాత్రం స్పష్టత లేదు. కానీ ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక నెటిజన్లు మాత్రం అతని నిజాయితీకి అన్నా కాంగ్రెస్ టికెట్‌ ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement