- జయంతి సభలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి
హైదరాబాద్‌లో ఐలమ్మ విగ్రహం పెట్టిస్తా
Published Tue, Sep 27 2016 12:32 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM
పాలకుర్తి : తనకోసం కాకుండా పదిమంది బాగు కోసం చాకలి ఐలమ్మ పోరాడిన గడ్డకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో చాకలి అయిలమ్మ 121వ జయంతి వేడుక సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హై దరాబాద్‌లో ఐలమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఐలమ్మ పేరును ఏదైనా ప్రాంతానికి లేదా ప్రభుత్వ సంస్థకు పెట్టేలా సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని అన్నారు. ఐలమ్మ చేసిన పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిదాయకమని నివాళులర్పిం చారు.
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ అమర వీరుల చరిత్రను భావి తరాలకు తెలిపేలా శౌర్యయాత్ర నిర్వహించాలని కోరారు. ఐలమ్మ పోరాటం నిజాంపై మాత్రమే కాదని, బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినసోమనాధుడువంటి మహావీరులు జన్మిం చిన పాలకుర్తి గడ్డ చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఐలమ్మ వారసులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. రజక సంఘ రాష్ట్ర నాయకులు మల్లేశం మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలం గాణ తల్లి విగ్రహం దొరసానిలా కాకుండా ఐలమ్మలా ఉండేలా చూడాలన్నారు. ఐలమ్మ మనవడు చిట్యాల రాంచంద్రం ఆధ్వర్యంలో జరి గిన సభలో రజక సంఘం జిల్లా నాయకులు ఉప్పలయ్య, సాంబరాజు యాదగిరి, ఎంపీపీ భూక్య దల్జీత్ కౌర్, జడ్పీటీసీ సభ్యుడు బన్నెపాక గణేష్, వైస్ ఎంపీపీ గూడ దామోదర్, టీఆర్‌ఎస్ నాయకులు ముస్కు రాంబాబు, నల్ల నాగిరెడ్డి, గంగు కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు సోమ సత్యం, చిట్యాల సోమన్న, అయిలమ్మ వారసులు పాల్గొన్నారు.
Advertisement